S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చేతులే యంత్రాలుగా భారీ నౌకల తయారీ

ప్రపంచ దేశాల్లో భారత్‌ది ఉతృష్టమైన స్థానం. ఇక్కడ వేల ఏళ్ల నాటి నుండి అనేక కళలు, విద్యలు విరాజిల్లాయి. ఈ నేల మీద జీవించిన వారికి రాని విద్యంటూ లేదని ప్రతీతి. వేల ఏళ్లనాడే మానవుడికి నౌకాయానంపై పట్టుంది. మన దేశం కూడా నౌకాయానంలో పేరెన్నిక గన్నదే. అంతే కాదు అనేక దేశాల వారు నౌకలను అప్పట్లో ఎక్కడెక్కడి నుండో కొనుగోలు చేసుకుంటుంటే మన దేశంలో మాత్రం స్వదేశీ పరిజ్ఞానంతో కావలసిన నౌకలను తయారు చేసుకునేవారు. ఆ కళ మనకు భారతదేశంలో నేటికీ కనిపిస్తుంది. పెద్దపెద్ద ఆవిరి నౌకలు, చమురు ఆధారిత నౌకలు, అత్యంత అధునాతన నౌకలు రాజ్యమేలుతున్న ఈ తరుణంలో కూడా కేరళలోని ఒక ప్రాంతం చేత్తో తయారు చేసే నౌకలకు ప్రసిద్ధి గాంచింది. కోజికోడ్ నగరానికి పదికిలోమీటర్ల దూరంలో గల చలియార్ నది చెంతన గల బేపూర్ అనే చిన్న ప్రాంతంలో సాంప్రదాయ నౌకల తయారీ కనిపిస్తుంది.
పెద్దపెద్ద వృక్షరాజాల ఎత్తులో ఇక్కడ ఒక్కో నౌక తయారవుతూ ఉంటుంది. ఇలాంటి నౌకలను తయారు చేయడానికి సిద్ధహస్తులైన పనివారు నిరంతరం ఇక్కడ శ్రమిస్తూ కనిపిస్తారు మనకి. ఇలాంటి ఒక నౌకను తయారు చేయాలంటే దాదాపు ఏభై మంది మూడు నుండి నాలుగేళ్ల పాటు శ్రమించాల్సి ఉంటుంది. అలా తయారైన ఈ నౌకలను ఉరు అని పేర్కొంటారు. ‘హ్యాండ్‌మేడ్ కార్గో షిప్స్’గా ప్రసిద్ధి చెందిన ఈ తరహా నౌకలకు ఇక్కడి నిపుణులు పెట్టింది పేరు. అందుకే ఈ ఉరు నౌకలను ఇక్కడికి స్వయంగా వచ్చి తయారు చేయించుకునేందుకు చైనా, జపాన్, అరబ్, పర్షియా, యూరప్ దేశాలకు చెందిన నౌయా వ్యాపారులు ఆసక్తి చూపుతుంటారు. చెక్క, ఇనుమును మిళితం చేసి తయారు చేసే ఈ నౌకలు ఎంతో శక్తివంతంగా ఉంటాయి. సాధారణంగా పెద్దపెద్ద నౌకలను తయారు చేయాలంటే బ్లూప్రింట్ అవసరం అవుతుంది. కానీ బేపూర్ నౌకాతయారీ నిపుణులకు అటువంటివేమీ అవసరం లేదు. వారు తమ మెదడులోనే అన్ని లెక్కలూ గట్టి నౌకలను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దగలరు. ఈ నౌకలకు పదిహేను వందల ఏళ్ల నాటి నుండి ఎంతో గిరాకీ ఉంది. ఎత్తుగా, దృఢంగా ఉండే ఈ నౌకలను వాణిజ్య నౌకలుగా ఉపయోగించుకోవడానికి అనువైనవి. ఇతర నౌకలతో పోల్చి చూస్తే ఈ నౌకల తయారీ చౌకే కాకుండా బలమైనవి కావడంతో అరబ్ దేశాల నౌకాయాన వ్యాపారులు ఉరు నౌకలంటే ఆసక్తి చూపుతుంటారు. అయితే ఇటీవల వీటికి ఆదరణ తగ్గింది. అయినప్పటికీ ఉరు తయారీ నిపుణులు తమ పనితనాన్ని విడిచిపెట్టలేదు. ఆర్డర్లు వచ్చినప్పుడు అద్భుతంగా పని చేసి తమ ఘనతను చాటుకుంటున్నారు. తమకి తెలిసిన కళను తరువాతి తరాలకు అందిస్తున్నారు.

- దుర్గాప్రసాద్ సర్కార్