S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సైకత రాణి!

ఈ రాతికట్టడాన్ని చూస్తే అచ్చం మహిళ తలలా కనిపిస్తోంది కదూ! బ్రిటిష్ రాణి ఎలిజబెత్ తలకట్టును తలపిస్తోందనేవారూ ఉన్నారు. తైవాన్ రాజధాని తైపీకి 45 నిమిషాల ప్రయాణం చేస్తే యెహిలియూ పట్టణం వస్తుంది. అక్కడ ఉన్న జియోపార్కులో ఈ రాతిబొమ్మ కనిపిస్తుంది. గాలి రాపిడికి బండరాయి ఇలా తయారైంది. ఇలాంటి వింతలు ఎన్నో అక్కడి పార్కులో కనిపిస్తాయి. దాదాపు నాలుగువేల ఏళ్లనుంచి ఆ రాయి ఇలా మార్పులకు లోనయి ఉంటుందని అంచనా. దీనిని చూసేందుకు పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తూంటారు. ఈ రాయిని ‘క్వీన్స్ హెడ్’గా పిలుస్తారు! అన్నట్లు ఈ అపురూప శిల్పంలో అతి సన్నని భాగం మెడ. అక్కడి దాని చుట్టుకొలత కేవలం 136 సెంటీమీటర్లు.

- భారతి