S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పుస్తకం తెరిస్తే..

ఎలా చదువను ప్రియా!
ప్రేమలో పడితే - పుస్తకం తెరిస్తే-
పదపదంలో నీ వదనమే
అక్షరక్షరంలో నీ సోగ కళ్లే
ఏ పుట తిరగేసినా-
పేజిపేజిలో నీ జిలేబి పెదవులే
తాజా గులాబీ నవ్వులే
ఏవేవో గంధర్వ పద సవ్వడులే
నా ఎద నిండా నీ సోయగాల సందడే
నీవక్కడ నేనిక్కడ ఉండలేను
చదువలేను చదివినా-
నీవు లేక నా మస్తిష్కం శూన్యమవుతుంది
ఆలోచన ధార ఇంకిపోతుంది
మనసంతా వేసవి భూమిలా-
నెర్రెలు నెర్రెలుగా పగుళ్లు బారుతుంది
అందుకే వస్తున్నా నీ దరికి
ఒకే దేహంగా ఒకే ప్రాణంగా బతుకుదాం
కలిసే చదువుల్ని జయిద్దాం విజేతలవుదాం

-జి.యం.ఆర్.పటేల్ 9440041351