S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దీపావళి

బుజ్జిపాప చిరునవ్వు దీపం
కంటికి చందమామ దీపం
స్పందనలో అనురాగ, ఆవేశాలను వెలికితెచ్చే
హృదయ దీపం
ఆలోచనతో అవకాశాన్ని వెదకిపెట్టే మనోదీపం
ఆత్మ పరమాత్మల అంతర్గత భావ బోధనా జ్ఞానదీపం
గుడిలో దేవుడికి భక్తి దీపం
బడిలో గురువుకు గౌరవ దీపం
అమ్మా నాన్నలకు ప్రేమ దీపం
ఇన్ని దీపాల వెలుగులో జీవిత నౌక
దైనందిన ప్రాపంచిక నిర్దేశాలతో
దిశ కోసం వెతుకుతూ
భవసాగరపు అలల్లో వూగుతూ తేలుతున్నది.
మనలోని స్వార్థ, సంకుచితత్వమనే
నరకాసురుణ్ణి సత్యభామ మట్టుపెట్టాలని
శ్రీకృష్ణుణ్ణి పూజిస్తున్నాం.
‘దేశ క్షేమం, ధర్మ నిరతి’ అనే కటాక్షం కోసం
లక్ష్మీదేవిని ఆరాధిస్తున్నాం.
మతాబులు, తారాజువ్వలు, ప్రమిద దివ్వెలు, పిండి వంటలు
మన ఆనందానికి అవధులు లేవని చెబుతున్నాయి
పిల్లా పెద్దల గలగలల జావళి
దీపకాంతుల సడిలేని సవ్వడి
ఆశానిశల పండుగ దీపావళి.

-అనంత మురళీచంద్ర ఎ.ఎస్.ప్రభాకర్ 9963887346