S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దారి మార్చుకో

విలాసవంతమైన భవంతుల్లో
తమకు కేటాయించిన గదుల్లోనో...
అపార్ట్‌మెంట్స్ పైభాగంలోనో...
పార్కుల్లో చీకటిగా ఉండే ప్రదేశంలోనో
నిర్మానుష్య ప్రాంతంలో విస్తరిస్తోన్న వినాశనం!
చలనచిత్రాల ఈవెంట్ ఫంక్షన్స్‌లోనో
ఊళ్ల చివర్లలోనో.. నగర శివార్లలోనో
అస్తారబతంగా అలముకుంటున్న అంధకారం!
సూపర్ మార్కెట్ల సౌందర్య పోషక విభాగాల్లోనో...
రోడ్లపై నిలుపుకున్న వాహనాలలోనో
లోలోపలే వ్యాపిస్తోన్న విధ్వంసం!
స్థాయినిబట్టో, అవకాశాన్నిబట్టో, అందుబాటును బట్టో
సాధారణమైనదో.. అతి ఖరీదైనదో.. అందిన వాడికి అందినంత..
ఎంత చెట్టుకి అంత గాలి.. ఎంత మందుకి అంత నిషా!
గోళ్ల రంగును శుభ్రం చేసే రసాయనమట...
సిరా రాతను తొలగించే పదార్థమట...
వడ్రంగి పనుల్లో అతికించడానికి ఉపయోగించే జిగురుట!
పెట్రోలు, దగ్గుమందు, నిద్ర మాత్రలు...
ట్రామిడాల్, మార్ఫిన్, ఫోర్ట్‌మీన్...
పెథడీన్, కిటమీన్, గంజాయి, ఎల్.ఎస్.డి...
కొకైన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్!
ఏ కొరివైతేనేం తలగోక్కోవడానికి!?
పేరేదైనా ప్రభావం ప్రబలమే పతనావస్థకి!
ఉక్కు నరాలు, ఇనుప కండరాలతో
జాతికి కొండంత అండ కావలసిన యువత
మత్తుదారిలో చిత్తవుతూ చేజార్చుకోకూడదు భవిత!

-అన్నంరాజు వేణుగోపాల శ్రీనివాసమూర్తి 9989792549