S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వాహ్..పూజా!

బాలీవుడ్, టాలీవుడ్‌లో ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న మాట వాహ్..పూజా అని. వారి మాటల్లో నిజం లేకపోలేదు. హిందీతో పాటు ఇప్పుడు తెలుగు చిత్రాల్లోనూ బిజీగా మారబోతోంది పూజా హెగ్డే. ఇప్పటికే టాలీవుడ్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన ఓ చిత్రం, రామ్‌చరణ్ ‘రంగస్థలం’లో ఓ స్పెషల్ సాంగ్ చేస్తోంది. అదే విధంగా బాలీవుడ్‌లోనూ అందరూ ఆశ్చర్యపోయేలా ఊహించని అవకాశాలను కొట్టేసి రేస్‌లో ముందుకు పరుగులు పెడుతోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ సరసన ‘రేస్-3’లో అతడికి జోడీగా నటించేందుకు ముందుగా పలువురు భామలు పేర్లు వినిపించాయి. ఈ చిత్రంలోని పాత్రకోసం ఎంతోమంది కథానాయికలను పరిశీలించారట. అయితే ఆ అవకాశం చివరికి పూజా హెగ్డేని వరించిందని టాక్. బాలీవుడ్‌లో ‘రేస్’ సీరిస్‌కి ఎంతటి క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పూజా నటిస్తున్నారని కొందరు, లేదని మరి కొందరు అంటున్నారు. అయినా పూజా నటిస్తున్నారన్న మాటే నిజం. వాస్తవానికి హృతిక్ రోషన్ సరసన పూజా నటించిన ‘మొహంజొదారో’ ఆశించిన విజయాన్ని సాధించలేదు. దాంతో పూజాకి బాలీవుడ్‌లో అవకాశాలు రావని కొందరు వాపోయారు. కానీ ‘రేస్-3’లో అవకాశాన్ని కొట్టేసిన ఆమె వాళ్ల నోళ్లు మూయించారు. ఏది ఏమైనా ఇలాంటి సమయంలో పూజా హెగ్డేకు రేస్ అవకాశం ఆమె గెలుపు కిందే లెక్క!

-సమీర్