S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సన్నగిల్లిన ఆశలు!

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏక కాలంలో నటిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు బాగా ఆలోచనలో పడిందట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న పాలసీని తు.చ తప్పకుండా పాటించే భామల్లో ఈ అమ్మడు ఎప్పుడూ ముందుంటుంది. టాలీవుడ్, కోలీవుడ్‌లో దాదాపు స్టార్ హీరోలందరితోనూ జోడీ కట్టింది. దీనికి తగ్గట్టే పాపులారిటీ ఉండటంతో పారితోషికాన్ని కూడా భారీగా పెంచుకుంటూ పోయిందని కోలీవుడ్, టాలీవుడ్‌లో వినిపిస్తున్న మాట. మధ్యలో అవకాశాలు సన్నగిల్లినా మళ్లీ ‘బాహుబలి’తో మరోసారి విజృంభించింది. ఆ క్రేజ్‌ను వాడుకోవడానికి పారితోషికాన్ని భారీగా పెంచేసిందట. దీంతో అవకాశాలు మళ్లీ తగ్గాయనీ ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఆ మధ్య హిందీ చిత్రం ‘క్వీన్’ దక్షిణాది భాషల రీమేక్‌లో నటించడానికి తమన్నాను సంప్రదించగా దర్శక, నిర్మాతలను కళ్లు తిరిగే పారితోషికం డిమాండ్ చేసిందనే ప్రచారం జోరుగా సాగింది. ప్రస్తుతం తెలుగు ‘క్వీన్’లో తమన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. తమన్నాకు అవకాశాలు తగ్గడానికి కారణం ఇదీ ఒకటి కాగా, ఇటీవల ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటం మరో కారణం. ఇలాంటి స్థితిలో బెంగ పెట్టుకున్న తమన్నా అవకాశాలు చేజారిపోతున్నాయని భావించిందట. ఇక లాభం లేదనుకొని మెట్టుదిగి పారితోషికంలో బాగానే తగ్గిందట. ఈ భామ చేతిలో ప్రస్తుతం తెలుగు, తిమిళం, హిందీ చిత్రాలు రెండేసి వున్నాయి. వీటిలో విక్రమ్‌తో చేస్తున్న ‘స్కెచ్’మినహా ఏ ఒక్క చిత్రంలోనూ స్టార్ హీరో లేరన్నది గమనార్హం. ఆశలన్నీ సన్నగిల్లిపోతున్నాయ్.. ఏది ఏమైనా తమన్నా కెరీర్ మాత్రం సందిగ్ధంలో పడ్డ మాట వాస్తవం!