S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆ గ్రామంలోని పురుషులంతా వంటవాళ్లే(లోకం పోకడ)

తరచి చూడాలే గానీ మన చుట్టూ ఎన్నో వింతలు ఉన్నాయి. వాటి గురించి వింటుంటే ఎంతో చిత్రంగా ఉంటుంది. ఆ సంగతులు తెలుసుకుంటుంటే అబ్బురమనిపిస్తుంది. అలాంటి అబ్బురమనిపించే సంగతులను గుదిగుచ్చుకున్న చిన్నపాటి గ్రామమే తమిళనాడులోని రామాంతపూర్‌లో గల కలయూర్. 356 ఇళ్లు, 1450 మంది జనాభా కలిగిన ఈ గ్రామంలోని పురుషులంతా వంట వాళ్లే. వీరిలో దాదాపు రెండు వందల మంది వంట పని చేయడానికి వివిధ ప్రాంతాలకు వెళ్లి వస్తుంటారు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పాండిచ్చేరిలో వీరు వివిధ చోట్ల వంట పని చేస్తూ సంపాదిస్తుంటారు. అందుకే ఈ గ్రామాన్ని ‘ది విలేజ్ ఆఫ్ కుక్స్’ అంటారు. ఇప్పటి ఈ సంస్కృతి రమారమి అయిదు వందల సంవత్సరాల క్రితం ప్రారంభమయింది. ఇక్కడి వనియార్ సామాజికి వర్గానికి చెందిన పురుషులు తొలినాళ్లలో వంట వాళ్లుగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ పేరు తర్వాతి కాలంలో తమిళనాడు నాలుగు చెరగులకు పాకడంతో వీరు వండి వడ్డించే వంటకాలకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. పెళ్లిళ్లు, వేడుకలు, పార్టీలకు పెద్ద ఎత్తున వంటకాలు తయారు చేయాలంటే ధనవంతులు, స్థితిమంతులు వనియార్లనే పిలుస్తుంటారు. వీరు సాంప్రదాయ బ్రాహ్మణ వంటకాలు సిద్ధం చేయడంలో సిద్ధహస్తులు. వీరితో వండించుకోవాలంటే ఆరు నెలల ముందుగానే వీరిని బుక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వీరు చాలా బిజీ. వీరు వండే చాలా వంటకాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. అటువంటివి నేటి వంటకాలలో అస్సలు కనిపించవు. దీనికి కారణం ఈ సాంప్రదాయం అయిదు వందల సంవత్సరాల క్రితం ప్రారంభం కావడమే అంటారు అంతా. ఆ వంటకాలు ఎంతో ప్రత్యేకమైనవి. మరెంతో రుచికరమైనవి. నేటి ఏ వేడుకల్లోనూ అలాంటి వంటకాలు కనిపించవు. ఆ వంటకాల తయారీ సీక్రెట్‌ను వనియార్లు బయటి వారికి చెప్పరు. ఇక్కడ వంట నేర్చుకోవాలంటే ఔత్సాహికులు పనె్నండేళ్ల ప్రాయం నుండి తర్ఫీదు పొందాల్సి ఉంటుంది. తొలుత వీరు కూరలు తేవడం, వాటిని కోయడం, శుభ్రం చేయడం వంటి ప్రాథమిక దశలోని పనులు చేయాల్సి ఉంటుంది. అలా చేసిన వారు ప్రధాన కుక్‌గా మారాలంటే పదేళ్ల పాటు పని నేర్చుకోవలసిందే. అప్పుడే రుచి శుచితో కూడిన వనియార్ సాంప్రదాయ వంటలు వండి వడ్డించేందుకు అర్హత సాధించినట్లు. ఇక్కడి వంటవారు తమ కొడుకులకు తమ విద్యను నేర్పిస్తూ తమ సాంప్రదాయాన్ని తర్వాతి తరాలకు అందిస్తుంటారు. వీరు బయట ఎంత అద్భుతంగా వంట చేసినా ఇంట్లో మాత్రం ఆ పని చేయరు. ఇంట్లో వంట చేయాల్సింది ఆడవారే. అది వివక్ష కాదు. వారి సాంప్రదాయం.

దుర్గాప్రసాద్ సర్కార్