S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చర్మ సౌందర్య సాధనం.. సున్నిపిండి (మీకు మీరే ఢాక్టర్)

ప్రశ్న: ఆయుర్వేద శాస్త్రంలో చర్మ సౌందర్యాన్ని కాపాడే సున్ని పిండి లాంటి ద్రవ్యాలు ప్రత్యేకంగా మగవారి కోసం ఏమైనా ఉన్నాయా? మగవాళ్ల కోసం ఏదైనా ఉపాయం చెప్పండి.
-జ్వాలా ప్రసాదరావు (సికిందరాబాద్)
జ: అలంకారం అనేది ఆడవాళ్లకు సంబంధించిన వ్యవహారం అని చాలామంది అన్యాయంగా అంటూ ఉంటారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారు అద్దంలో చూసుకుంటూ తలకాయి సరిచేసుకునేది మగవాళ్లే! ఆడవాళ్లు కాదు!! సాధారణంగా ఆడవాళ్లు అలా వ్యవహరించరు.
చర్మ సౌందర్యం స్ర్తి పురుషులిద్దరికీ అవసరమే! దాన్ని కాపాడేందుకు వైద్య శాస్త్రంలో అనేక ఉపాయాలున్నాయి. వైద్యానికి స్ర్తి పురుష భేదం ఉండదు. చర్మ సౌందర్యాన్ని కాపాడేందుకు సున్నిపిండి ఒక ఉత్తమ సాధనం. మగవాళ్లు కూడా సున్నిపిండిని వాడుకోవాలి. అది ఆడవాళ్ల వ్యవహారం అని నామోషీ పడకూడదు.
చూర్ణం అనే సంస్కృతం మాట తెలుగు వారి నోటిలో పడి సున్నం, సున్ని అయ్యింది. అన్నంలో తినే సున్నిపొడి కూడా ఇలానే ఏర్పడింది. సున్నిగుండ అని కూడా కొన్ని ప్రాంతాల్లో అంటారు. సున్ని అంటే చూర్ణం. దేని చూర్ణం..? విశిష్టమైన మూలికల చూర్ణం. అతి మెత్తని స్వభావం కలిగిన పప్పు్ధన్య చూర్ణం అని కూడా! వన మూలికల్ని, శనగపిండి లేదా పెసరపిండిని కలిపితే చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేసే సున్నిపిండి తయారౌతుంది.
కృష్ణదేవరాయల వారి దినచర్య గురించి ‘రాయవాచకం’ అనే పుస్తకంలో ఉంది. రాయలు తెల్లవారుఝామునే లేచి, కడుపు నిండా నువ్వుల నూనె తాగి, ఒళ్లంతా నువ్వుల నూనె పట్టించుకుని చెమట కారేదాకా వ్యాయామం చేసేవాడు. అప్పుడు మళ్లీ నూనె పట్టించి నలుగు పెట్టుకుని తలంటి స్నానం చేసేవాడట.
పండుగ రోజున మాత్రమే నలుగు పెట్టుకుని తలంటి పోసుకోవటం కాదు, అభ్యంగన స్నానాన్ని ఇలా ప్రతిరోజు చేయాలని దీని భావం. అందరూ చేయాల్సిన విధి ఇది. వ్యాయామాలు మగాళ్లకు, అలంకారాలు ఆడాళ్లకే అనే ఆలోచన మారాలి! మగాళ్ల ఫేషియల్ క్రీములు, మగాళ్ల సెంట్లు, మగాళ్ల టాయిలెట్ సోపులు, మగాళ్ల షాంపూలు అనేవి వ్యాపారుల సృష్టి.
నలుగు పెట్టుకుని వలిచినందువలన చర్మం మీద వెంట్రుకల కుదుళ్లు శుభ్రం అవుతాయి. చర్మం మీద అట్టగట్టిన మాలిన్యాలు వదులుతాయి. విష రసాయనాలు కలిసిన సబ్బులు, లిక్విడ్ సోపులు వగైరా వాడటం గొప్ప అనుకుంటున్నాం. వాటి వలన కలిగే అపకారాల గురించి ఆయా కంపెనీలు పెదవి విప్పవు. మనం సోపు, షాంపూ, క్రీములకు అలవాటుపడి మేలు చేసే సహజ ద్రవ్యాలను పాత చింతకాయ పచ్చడి అనుకుంటున్నాం. ఇది అపోహే! నలుగు పెట్టుకోవటంలో నామోషీ పడాల్సిందేమీ లేదు. అది మన సంస్కృతిలో ఒక భాగమైన ఆరోగ్య సూత్రం.
సున్నిపిండి గురించి చెప్పబోయే ముందు ఇది బజార్లో దొరుకుతుందా అని అడక్కండి. కొంచెం ఓపిక చేసుకుని స్వంతంగా చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మేము చెప్పబోయే ద్రవ్యాలన్నీ మీకు పెద్ద పచారీ కొట్లలో దొరికేవే! మీ దగ్గర మిక్సీ ఉంటే చాలు, కల్తీలేని సున్నిపిండి మీ ఇంట్లో రెడీ!
కమలాకాయ తొక్కలు, వేపాకులు, తులసాకులు, గులాబీ రేకులు వీటిని వేర్వేరుగా ఎండించి ఉంచుకోండి. ఎండాక ఈ నాలుగింటినీ ఒక్కొక్కటి 100 గ్రాముల చొప్పున తీసుకోండి. పసుపుకొమ్ములు 100 గ్రాములు, ముల్తానీ ముట్టి 100 గ్రాములు కూడా తీసుకోండి. వీటన్నింటినీ మర పట్టించుకోండి లేదా ఇంట్లో మిక్సీ పట్టుకోండి. ఈ పొడిలో పావుకిలో పెసర పిండి, పావుకిలో శనగపిండి కూడా కలపండి. మొత్తాన్నీ కలిపి మెత్తగా జల్లెడ పట్టండి. సుగంధభరితమైన సున్ని పిండి సుమారుగా ఒక కిలో తయారౌతుంది. ఇది చిన్నపిల్లలక్కూడా నలుగు పెట్టడానికి వీలైనదిగా ఉంటుంది. కమలాల తొక్కులు చర్మానికి మృదుత్వాన్నిస్తాయి. వేపాకులు క్రిమి దోషాలను పోగొడతాయి. తులసాకులు ఈ సున్నిపిండిని చర్మం లోపలి పొరల్లోకి తీసుకువెడతాయి. గులాబీ రేకులు పరిమళంతోపాటు చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి. పసుపుకొమ్ములు చర్మకణాలను శుద్ధిచేస్తాయి. ముల్తాన్ ముట్టి చర్మం మీద జిడ్డును తొలగించి మొటిమల్లాంటివి కలగకుండా చేస్తుంది. ఇన్ని రకాల ప్రయోజనాలున్న ద్రవ్యాలను ఒకచోట చేర్చటం వలన ఈ సున్నిపిండికి ఔషధ విలువలెక్కువగా ఉంటాయి.
నలుగు పెట్టుకునే పద్ధతి ఇలా: ప్రొద్దునే్న లేచి, కొంత వ్యాయామం చేసి, ఒళ్లంతా నువ్వుల నూనె పట్టించుకోండి. ఈ సున్నిపిండిని ముద్దలాగా తడిపి ఒళ్లంతా రాసుకోండి. పావుగంటసేపు గాలికి శరీరాన్ని ఆరనివ్వండి. ఆరిన తరువాత ఆ నలుగునంతా చేత్తో వలిచేయండి. నల్లగా సున్నిపిండి రాలిపోతుంది. చర్మం కాంతివంతం అవుతుంది.
ఈ సున్నిపిండిని ముఖానికి మాత్రమే నలుగు పెట్టుకుంటే ఫేషియల్ ప్యాక్‌లా ఉపయోగపడుతుంది. చంకల్లోనూ, గజ్జల్లోనూ తప్పనిసరిగా నలుగు పెట్టుకోవాలి. అక్కడ ఫంగస్ అంటే తామర వచ్చే స్థావరం కాబట్టి. చెమట, మకిలి ఎక్కువగా పడతాయి. ఫంగస్‌కు అదే ఆహారం. అక్కడ పరిశుభ్రత ఉంటే ఫంగస్‌కి ఆహారం దొరక్క అది నశించిపోతుంది.
నలుగు పెట్టుకునే వారికి వార్థక్యం వచ్చినా, చర్మం యవ్వన శోభతో వెలుగులీనుతుంది. వనవంతలు నలుగు పెట్టుకుంటే కాంతిమయం అవుతారు. కెరీర్ పెరగాలంటే రూపలావణ్యాలు అవసరం కదా!
**
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్తు, బకింగ్‌హామ్‌పేట
పోస్టాఫీసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ - 500 002

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com