S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆ సిఫారసులు ఏమయ్యాయి?

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు, ఉత్తమ విద్యావ్యవస్థకోసం చక్రపాణి కమిటీ కొన్ని సూచనలు చేసింది. గత కేబినెట్ సమావేశంలో వీటిపై చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు కట్టుబడ్డామని ప్రకటించారు. అయితే చక్రపాణి సిఫారసులు కొన్ని బాగున్నాయి. ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ ఉన్నతాధికారి, మేనేమెంట్ కమిటీ ప్రతినిధి, సమీపంలోని ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలు, మహిళా పోలీసు అధికారి, ఇద్దరు స్థానిక సామాజిక కార్యకర్తలతో మోనిటరింగ్ కమిటీ ఆయా ప్రైవేటు విద్యా సంస్థలను పర్యవేక్షించాలన్నది మొదటి సిఫారసు. జాయింట్ కలెక్టర్, మహిళా పోలీసు అధికారి, ఇంటర్మీడియట్ బోర్డు ఆర్‌జెడి, ఆర్‌ఐఒ, ఇద్దరు విద్యావేత్తలు, పౌరసమాజంలోని ఇద్దరు ప్రతినిధులతో ఎథికల్ కమిటీ ఉండాలన్నది మరో సూచన. నెలకు ఒక సబ్జెక్టులో ఒక పరీక్ష మాత్రమే ఉండాలని, పదేపదే ఒక్కో గది నుంచి మరో గదికి తరలించవద్దని, రెండు ఫ్లోర్‌లు ఉన్న భవింతి అయితే లిఫ్టు తప్పనిసరి అని, యోగా, వ్యాయామం తప్పనిసరిగా నేర్పాలని, విద్యార్థీనీవిద్యార్థుల మార్కులను నోటీస్‌బోర్డుపై రాయకూడదని, లైబ్రరీ, ఆటస్థలం ఉండాలని, కెరీర్ కౌన్సిలింగ్ చేస్తుండాలన్నవి మరికొన్ని సూచనలు. అయితే ఇవి పాటించేవారు ఎవరు, పాటించమని చెప్పేవారు ఎవరు? ఇక్కడ స్పందించవలసినది తల్లిదండ్రులే ఎందుకంటే బాధితులు వారే కనుక. విద్య చెప్పేది కార్పొరేట్ సంస్థ అయినంత మాత్రాన కలిసి వచ్చేదేమీ ఉండదు. ప్రభుత్వ సంస్థ అయితే కోల్పోయేది ఏమీ ఉండదు. సమాజంలో ఎన్నో ఉన్నత పదవులు, స్థానాల్లో ఉన్నవారెందరో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకున్నవారే. అబ్దుల్ కలామ్ చదివినది ఎక్కడ? ఇక్కడ కళ్లు తెరవాల్సింది తల్లిదండ్రులే. రేపటిపౌరులను తీర్చిదిద్దవలసినది ముందు మన ఇంట్లోనే. మన మనసుల్లోనే, మన ఆలోచనల్లోనే. నష్టం జరగకముందే మేల్కొనాలి. ఉన్నతమైన లక్ష్యాలు అవసరం. సాధిస్తే సరే. సాధించలేకపోతే జీవితం ముగిసిపోయినట్లు కాదు. జీవించడానికే కదా పుట్టాం. మధ్యలోనే జీవనయానం ముగిస్తే ఎలా? చదువు...బాగా బతకడం కోసం. చచ్చిపోవడం కోసం కాదు.