S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నవ్వే పుర్రె

ఫిలిప్ పురావస్తు శాస్తజ్ఞ్రుడు. ఆ అంశం మీద అతను రాసిన అనేక పుస్తకాలు పేరు పొందాయి. ముఖ్యంగా మాయన్, అజ్‌టెక్ తెగలకి చెందిన వారి మీద రాసిన పుస్తకాలు విడుదలయ్యాక అనేక యూనివర్సిటీలు తమ ఆంత్రపాలజీ డిపార్ట్‌మెంట్‌లో అతన్ని కన్సల్టెంట్‌గా నియమించాయి. ప్రి కొలంబియన్ కాలం మీద ఫిలిప్ రీసెర్చ్ చేస్తున్నాడు. అతనికి మిల్‌డ్రెడ్‌తో పెళ్లైంది. తర్వాత కొద్దికాలానికే, పెళ్లికి ముందు నించే ఆమెకి ఏషర్ అనే రహస్య ప్రియుడు ఉన్నాడని ఫిలిప్‌కి తెలిసింది. అతను లాస్ ఏంజెలెస్‌లో సంగీతకారుడు.
సెప్టెంబర్ నెలలో ఓ శనివారం మధ్యాహ్నం ఫిలిప్ అడవిలోని తన కాటేజ్‌కి విశ్రాంతి కోసం వెళ్తే అక్కడ మంచం మీద నగ్నంగా ఉన్న వాళ్లిద్దరూ కనిపించారు. కోపంతో ఊగిపోతూ ఫిలిప్ వాళ్లిద్దర్నీ పిడిగుద్దులు గుద్దాడు. స్పృహలో లేని వాళ్ళిద్దరి ముఖాలలని దిండుతో అదిమి చంపేశాడు.
తర్వాత వచ్చిన దారినే ఇంటికి చేరుకున్నాడు. తను చేసిన ఘోరానికి అతనికి ఎలాంటి బాధ కాని, పశ్చాత్తాపం కాని కలగలేదు. రెండు రోజుల తర్వాత తిరిగి కాటేజ్‌కి వెళ్లి ఆ రెండు శవాలని ఓ చోట పాతిపెట్టాడు. తన భార్య కనపడటం లేదని పోలీసులకి రిపోర్ట్ ఇచ్చాడు. తమ మధ్యగల పొరపొచ్చాల వల్ల ఆమె తిరిగి పుట్టి పెరిగిన బోస్టన్‌కి వెళ్లిపోయి ఉండచ్చని కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు. అడవిలో తనకో కాటేజ్ ఉందని అతను పోలీసులకి చెప్పలేదు.
తర్వాత యుకాటన్ సంస్కృతి పరిశోధన మీద మెక్సికోకి వెళ్లి, మూడు నెలలు ఉండి, ఓ పుస్తకాన్ని పూర్తి చేసి వెనక్కి వచ్చాడు. పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్లు ఇంకా మిల్‌డ్రెడ్ ఆచూకీని కనుక్కోలేక పోయామని చెప్పారు. మిల్‌డ్రెడ్ తనకి ఫోన్ చేసి తన ప్రియుడితో వెళ్లిపోతున్నానని, ఇంక తిరిగి రానని చెప్పిందని అబద్ధం చెప్పాడు.
‘మీ ఆవిడకో రహస్య ప్రియుడున్న సంగతి మా విచారణలో తెలిసింది. అతన్ని మేం కనుక్కోలేక పోవడానికి ఇదే కారణం అయి ఉంటుందని అనుకున్నాం. దర్యాప్తుని కొనసాగించమంటారా?’
‘ఒద్దు. ఇక ఆమెని వెనక్కి తీసుకోను’ ఫిలిప్ నిరాకరించాడు.
ఆ తర్వాత అతను మళ్లీ పెళ్లి చేసుకోలేదు.
* * *
ఆరేళ్లు గడిచాక ఓసారి అతను సెంట్రల్ అమెరికాలోని ఓ దేశానికి వెళ్లినప్పుడు తనున్న గెస్ట్‌హౌస్‌లో షోకేస్‌లో ఉన్న ఓ పుర్రెని చూసి అడిగాడు.
‘ఇది ఇక్కడ ఎందుకు ఉంది?’
‘అలంకారంగా’ గెస్ట్‌హౌస్ కీపర్ చెప్పాడు.
ఫిలిప్ తిరిగి చికాగోకి చేరుకున్నాక మూడు గంటల ప్రయాణ దూరంలోని అడవిలో ఉన్న తన కాటేజ్‌కి వెళ్లి పలుగు, పార తీసుకుని తన భార్య శవాన్ని తవ్వి తీసి, ఆమె పుర్రెని మాత్రం తీసుకుని దానికి మెరుగు పెట్టి తన స్టడీ రూంలోని షో కేస్‌లో అలంకారంగా ఉంచాడు. నవ్వుతున్నట్లుగా ఉన్న ఆ పుర్రె కనపడినప్పుడల్లా అతనికి మరణం గుర్తుకు రాసాగింది.
* * *
సెక్రటరీ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వచ్చిన క్రేన్‌ని ఫిలిప్ కొన్ని ప్రశ్నలు అడిగాడు. క్రేన్ అంతకు మునుపు ఎనిమిదేళ్లు మరో ప్రఖ్యాత ఆంత్రపాలజిస్ట్ దగ్గర సెక్రటరీగా పని చేయడంతో తన
పనిలో మంచి అనుభవాన్ని గడించాడు. అతను నచ్చడంతో మర్నాడే ఉద్యోగంలో చేరమని ఫిలిప్ కోరాడు.
రెండు వారాల తర్వాత క్రేన్ చెప్పాడు.
‘నేను ఈ ఉద్యోగం మానేస్తున్నాను’
‘ఎందుకు? జీతం చాలలేదా?’ ఫిలిప్ ఆశ్చర్యంగా అడిగాడు.
‘అదేం కాదు. నేనీ గదిలోకి వచ్చినప్పుడల్లా ఆ పుర్రె నాతో గుసగుసలాడుతున్నట్లుగా అనిపిస్తోంది. నాకు భయంగా ఉంది’
‘ఏమని గుసగుసలాడుతోంది?’
‘చంపు’ అనే ఒక్క మాటే నాకు వినిపిస్తోంది. దాంతో రాత్రుళ్లు నాకు సరిగ్గా నిద్ర కూడా పట్టడంలేదు’ క్రేన్ చెప్పాడు.
‘దీన్ని మొమెంటో మోరి అంటారు. అంటే మృత్యువుని గుర్తు చేసేదని అర్థం. సెంట్రల్ అమెరికాలో కూడా పుర్రె మాట్లాడుతోందని కొందరు చెప్పగా విన్నాను. దాన్ని భ్రమగా భావించి కొట్టి పారేసాను. నిజమేనన్న మాట. నీకేం భయంలేదు. నువ్వు సమర్థుడైన సెక్రటరీవి. క్రమంగా ఆ గుసగుసలు ఆగిపోతాయి. భయపడకు’ ఫిలిప్ అభయం ఇచ్చాడు.
* * *
మరో వారం గడిచాక ఓ రోజు పోలీస్‌స్టేషన్‌కి హత్య జరిగిందని ఫోన్ వచ్చింది. లెఫ్టినెంట్ అలెక్స్ తక్షణం ఫిలిప్ ఇంటికి చేరుకున్నాడు. బల్ల మీద తల వాల్చిన ఫిలిప్ తల వెనుక భాగం చితికి మెడ మీద కారిన రక్తాన్ని చూసాడు.
‘్ఫన్ చేసింది నేనే’ క్రేన్ చెప్పాడు.
‘ఈ హత్య ఎవరు చేసారో తెలుసా?’ అలెక్స్ అడిగాడు.
‘తెలుసు’ క్రేన్ జవాబు చెప్పాడు.
‘ఎవరు?’
‘నేనే’
క్రేన్ బల్ల కింద ఉన్న రక్తంతో తడిసిన పుర్రె వంక చూపిస్తూ చెప్పాడు.
‘అదే హత్యాయుధం. నేను ఫిలిప్ దగ్గర ఉద్యోగంలో చేరి మూడు వారాలే ఐంది. ఈ పుర్రె నాతో ‘చంపు.. చంపు’ అని చెప్తోందనీ, ఉద్యోగం మానేస్తానని చెప్పినా ఫిలిప్ ఒప్పుకోలేదు. ఇవాళ ఆయన వంగి కింద పడ్డ ఏదో కాగితాన్ని తీసుకుంటూంటే అకారణంగా నేనా పుర్రెని అందుకుని దాంతో ఆయన్ని కొట్టి చంపేసాను. వెంటనే మీకు ఫోన్ చేసాను’
‘ఎందుకు చంపావు?’
‘నాకే తెలీదు’
‘ఈ పుర్రె ఎవరిది?’
‘తెలీదు. బహుశ ఏ సెంట్రల్ అమెరికా నించో జ్ఞాపకం తెచ్చుకుని ఉండచ్చు’ క్రేన్ చెప్పాడు.
* * *
ఏడాది తర్వాత హై వే నిర్మాణం కోసం అడవిలో ఫిలిప్ కాటేజ్ పక్కనే తవ్వినప్పుడు తల లేని అస్థిపంజరం బయటపడటంతో పోలీసులు అది ఎవరిదా అని పరిశోధించారు. అది ఫిలిప్ కాటేజ్ అని తెలియడంతో, ఆ కోణంలో పరిశీలిస్తే అది ఫిలిప్ భార్యదని తెలిసింది. రెండో అస్థిపంజరం ద్వారా హత్యకి కారణం, హంతకుడు ఎవరో కూడా వాళ్లు కనుక్కున్నారు. విచిత్ర విషయాల మీద జరిగే ఓ టీవీ షోలో లెఫ్టినెంట్ అలెక్స్ ఈ విషయాన్ని హ్యూస్టన్‌లో 1954లో వెల్లడించాడు.
చనిపోయిన ఆరేళ్ల తర్వాత కూడా ఆత్మకి హంతకుడిని శిక్షించే శక్తి ఉంటుందా?
పుర్రె చంపమని చెప్తోందన్న క్రేన్ మాటలని ఫిలిప్ ఎందుకు విశ్వసించలేదు?
ఈ ప్రశ్నలకి సమాధానం దేవుడికే తెలియాలి.