S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆదితత్వ యోగారూఢం

‘హృదయ క్షేత్రమే ఆత్మ స్థావరమట కదా?!’
చైతన్య తెరచిన పుస్తకం అవుతున్నాడు.
‘అవును. అంత మాత్రాన హృదయాన్ని ఆత్మ ఆవరించుకుని ఉంటుందని కాదు.’
నా సమాధానం ముగియక ముందే చైతన్య ‘అంటే ఆత్మ పొదువుకున్నది హృదయం కాదా?’
‘హృదయ కేంద్రం ఆత్మది.. ఆ ఆత్మ సూక్ష్మాతి సూమ్రం. రూపంగా చెప్పుకోవాలంటే చిన్న చీమ తలను పదివేల భాగాలు చేస్తే వాటిలోని ఒక భాగం ఆత్మరూపం. పైగా ఈ ఆత్మరూపం మనసుకు అందేదే తప్ప కళ్లకు కనిపించేది కాదు. అందుకే ఆత్మను భౌతికంగా అవ్యక్తం, మానసికంగా వ్యక్తం అంటుంటాం.’
‘కరగనిది, కాలనిది కూడా..’ చైతన్య.
‘ఆత్మ కొలువై ఉండేది హృదయ క్షేత్రంలోనే. అయినప్పటికీ దాని అస్తిత్వం భౌతికంగా దేహాన్ని, అధిభౌతికంగా విశ్వాన్ని ఆవరించినటువంటిది. నా దృష్టిలో ఆత్మ విశ్వమిత్ర. ఆత్మ విశ్వత్వం ఆధ్యాత్మిక వెలుగు. ఆత్మది జాగృత చైతన్యం. జీవన వర్ఛస్సు అంతా ఆత్మదే. ఆత్మ తోడున్నంత కాలం దేహం అన్ని హొయలు పోతుంది. ఆత్మ భౌతిక బంధాల నుండి తప్పుకోవాలనుకున్న నాటి నుండి దేహం వడలటం ప్రారంభిస్తుంది. దేహం ఆకర్షణ కోల్పోతోందంటే ఆత్మ తన అస్తిత్వాన్ని దేహానికి దూరం చేస్తోందనే. గికంగా ఆత్మ అస్తిత్వం అందబాటులోనే ఉంటుంది. అందుకే ఆత్మ ఈ దేహం నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నపుడు అది యోగికి తెలుస్తుంది. ఈ ఆత్మ స్పృహ యోగ సాధకుల స్వంతం’ చైతన్యలో ఇలా ప్రారంభమైంది భగవద్గీతకు నా గిక గీత ఆఖ్యానం.
‘ఆత్మకు దేహం నండి తప్పుకోవటం తెలుసు కదా! అలాగే యోగ సాధకులకూ ఆత్మను దేహం నుండి తప్పించటం తెలుసంటారు.. నిజమేనా?’ చైతన్య ప్రశ్న.
‘నిజమే.. దీనే్న ఆత్మత్యాగం అందాం. అంటే, ఆత్మను దేహం నుండి ఇష్టపూర్వకంగా త్యజించటం. ఆత్మదేహాన్ని త్యజిస్తే మరణం. దేహం ఆత్మను త్యజిస్తే ఆత్మత్యాగం.. ఒక విధంగా గిక ప్రస్థానం.. శాశ్వతత్వానికి అది తొలి వజిలీ. మొత్తానికి, ఒక్క యోగి మాత్రమే తన దేహం నుండి ఆత్మను త్యజించగలడు... విశ్వ శక్తితో తన ఆత్మశక్తి మమేకం అయినపుడే అది సాధ్యం.
విశ్వ ప్రాంగణాలతో దేహ ఆత్మ రాకపోకలు సాగించటం సాధ్యమైన తర్వాతనే దేహం నుండి ఆత్మ శాశ్వతంగా తప్పుకోవటమూ సాధ్యమవుతుంది. అంటే, యోగ సాధకులు మొదటగా జనన మరణ వలయానికి అతీతం కావాలనుకుని సాధన సాగిస్తారు. జననంపై మోజూ ఉండదు.. మరణంపై ఏవగింపూ ఉండదు. ఆత్మ అస్తిత్వానికి రెండూ కారకాలే! ఈ స్థితిలో నెలకొనటానికి సాధకులమైన మనకు ధ్యాన సాధన తొలి ఆసరా అవుతుంది.
ఈ ఆసరానే విశ్వావరణలో ఆత్మ ఆవాసం ఏర్పరచుకోవటానికి తొలి భూమిక అవుతుంది. అందుకే యోగ సాధకులకు పాంచభౌతిక దేహం ఒక టెంపరరీ అడ్రసే తప్ప అదే పర్మినెంట్ రెసిడెన్సీ కాదు.’
నా ఆత్మఘోష సాగుతూనే ఉంది.
‘అవును గురువుగారూ! టెంపరరీనే కదా అని దేహారోగ్యాన్ని పట్టించుకోకపోవటం సృష్టి ధర్మానికి వ్యతిరేకం కదా!’ చైతన్య.
‘పాంచభౌతికతలోకి వచ్చిన ఆత్మకు అపాణిభూతమైన దేహం అత్యంత ముఖ్య స్థావరం. అందుకే పతంజలి యోగ సూత్రాలు దేహారోగ్యాన్ని సాధన చేయమంటాయి. అంటే దేహ సంయమనాన్ని, దేహ సంయమనం అంటే ఇంద్రియ సంయమనం అనే అర్థం. ఇంద్రియాతీతం కాగలిగితే మానసాతీతం అయినట్లే! మనసును కైవసం చేసుకోగలిగితే విశ్వకౌగిలి సాధ్యమవుతుంది. ఆ విశ్వ ప్రాంగణమంతా ఆత్మ సామ్రాజ్యమే! ఈ ఆత్మ సామ్రాజ్యాన్ని భక్తి, జ్ఞాన, కర్మ మార్గాల ద్వారా అధివసించటం ఎలానో భగవద్గీత సుబోధకం చేస్తుంది’
‘అందుకే కాబోలు పాశ్చాత్యులు భగవద్గీతను ‘్ఫస్ట్ ఫుల్లీ రియలైజ్డ్ యోగిక్ స్క్రిప్చర్’గా చెప్పుకుంటారు.’ చైతన్య ముక్తాయింపు.
* * *
‘న హ్య సన్న్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన’ అంటుంది భగవద్గీత. అంటే సంకల్ప త్యాగం చేసిన సాధకుడే యోగి అని. నిజానికి సంకల్ప త్యాగమే సన్యాసం.
‘యం సన్న్యాస మితి ప్రాహుః యోగం తం విద్ధి’ - సన్యాసమే యోగం. ఈ యోగాన్ని త్రికరణాత్మకంగా మన ముందుకు తెచ్చిందే కృష్ణోపదేశం.
సాధారణంగా మనం అగ్ని కార్యాలను త్యజించిన వారినే యోగులుగా పరిగణిస్తుంటాం. కానీ గీత ప్రకారం కర్మఫలాన్ని ఆశ్రయించకుండటం, కర్తవ్య కర్మలను ఆచరించటం యోగి ధర్మం. ఇటువంటి యోగ సాధకులనే సన్యాసు లంటుంది గీత.
నిష్కామ కర్మాచరణ వల్లనే యోగారూఢ స్థితి సాధ్యం. సర్వ సంకల్ప రాహిత్యం వల్లనే మోక్షప్రాప్తి సాధ్యం. అదే యోగప్రాప్తి. ఈ విషయానే్న విశదీకరిస్తూ-
‘యదా హి నేంద్రియార్ధేషు న కర్మ స్వనుపజ్జతే/ సర్వ సంకల్ప సన్న్యాసీ యోగారూఢస్తదోచ్యతే’
ఇంద్రియ భోగాలపై ఆసక్తి ఉండకూడదు. కర్మలపైనా ఆసక్తి ఉండకూడదు. పైగా సర్వ సంకల్పాలను త్యజించాలి. ఇటువంటి త్యాగధనులే యోగారూఢులు. ఇలా తమను తాము ఉద్ధరించుకునే సాధకులే యోగులు. వీరు ఆత్మధనులు. దీనే్న గీత ‘ఆత్మ సంయమ యోగం’ అంటుంది.
* * *
మన మానవ దేహం రూప లావణ్య విలసిత ప్రాపంచిక రథం. ఈ రథం హక్కుదారు అరూపమే అయినా రూపావిష్కరణ చేసేది మన బుద్ధే! భౌతిక ప్రపంచానికే పరిమితమై వర్తనం సాగిస్తున్నంతకాలం మన బుద్ధి మనసుపై, పంచేంద్రియాలపై పెత్తనం చెలాయిస్తుంటుంది.
అంటే, భౌతిక ప్రాపంచిక వర్తనమంతా బుద్ధి వశమైనదే. అయితే పంచేంద్రియ గుర్రాల పరుగును బుద్ధి నుండి తప్పించి ఆత్మవశం చేయగలిగితే రథసారథ్యం ఆత్మదే అవుతుంది. కర్మయోగం ఆత్మ మార్గం అవుతుంది.
సామాన్య జీవనానికి పంచేంద్రియ భోగత్వం తృప్తి నిస్తుందేమో కానీ గిక ప్రస్థానంలో వాత్రం పంచేంద్రియాలను బుద్ధి అదుపు చేయగలగాలి. అంటే మనసుకి శిక్షణ ధ్యానం వల్లనే సాధ్యం. అది యోగ సాధనలో తొలి అంకం.
అన్నట్టు, గిక ప్రస్థానంలో వ్యక్తి ఆత్మ, పరవాత్మ ఒక్కటే. ప్రాపంచికంగా ఆ రెండింటి అస్తిత్వం, స్థితి వేరువేరు అనిపించినా విశ్వవేదికపైన రెండింటి అస్తిత్వమూ, స్థితీ ఒక్కటే. అయితే వ్యక్తి ఆత్మ ఈ అభేదత్వాన్ని, అద్వితీయత్వాన్ని పసిగట్ట లేకపోవటమే ప్రాపంచిక మాయ. గిక ప్రస్థానంలో ఈ అద్వితీయతను అందుకోవటమే ‘ఒన్‌నెస్’. విశ్వ ప్రకృతిలో మమేకం అవుతూ ఈ రూపారణ్యాన్ని దాటి అరూపంలోకి ప్రస్థానించటమే ఆత్మప్రస్థానం.
* * *
ఆత్మ అస్తిత్వాన్ని గీత ‘న ఛిందంతి’ ‘న దహతి’ ‘న క్లేదయంతి’ ‘న శోషయతి’ అని అంటుంది. అంటే, ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహింపలేదు, నీరు తడపలేదు, గాలి శోషింపచేయలేదు అని అర్థం. అంతేకాదు, ‘నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః’ అనీ ఆత్మను నిర్వచిస్తోంది. అంటే, ఆత్మ నిత్యం, సర్వవ్యాప్తం, స్థిరం, సనాతనం అని అర్థం. పైగా ఆత్మ అవ్యక్తం, అచింత్యం, అవికార్యం.