S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కాంతి

జ్ఞానమన్నది పుస్తకాల ద్వారానో, వయసు పెరగడం ద్వారానో వచ్చేది కాదు. వస్తు జ్ఞానం, ప్రాపంచిక జ్ఞానం వాటివల్ల సమకూరవచ్చు.
వివేకం అలాంటిది కాదు. అది పుస్తకాల ద్వారా అనే్వషణ ద్వారా సమకూరేది కాదు. అది ఇతరుల నించి ఆదుకునేది కాదు. అది మనలోనే ఉంటుంది. అది అందరిలో ఉంటుంది. దానికి ప్రపంచం అడ్డంగా ఉంటుంది. అనుభవాలు ఆటంకంగా ఉంటాయి. అది సహజాతం లాంటిది. ఆ అడ్డంకుల్ని తొలగిస్తే అది బహిరంగమవుతుంది.
కొందరిలో అది ముందుగానే బయటపడుతుంది. కొందరికి ఆలస్యంగా బయటపడుతుంది. కొందరిలో అజ్ఞాతంగానే మిగిలిపోతుంది.
ఒక సూఫీ మార్మికుడు ఒక గ్రామంలోకి వచ్చాడు. అతని ఎదురుగా వస్తున్న ఒక పసివాణ్ణి చూశాడు. ఆ కుర్రాడు ఎంతో ముద్దుగా ఉన్నాడు. ఆ కుర్రాడి చేతిలో ఒక క్యాండిల్ వెలుగుతోంది. దీపం ఆరకుండా చేతిని అడ్డుపెట్టుకుని నడుస్తున్నాడు. లేత చెంపల మీద కాంతి ప్రసరిస్తూ కుర్రాడు మరింత ముద్దొస్తున్నాడు.
అతని ముఖంలో అమాయకత్వం చూసి సూఫీ మార్మికుడికి ముచ్చట వేసింది. ‘ఎక్కడికి వెళుతున్నావు?’ అని అడిగాడు.
కుర్రాడు ‘మసీదులో క్యాండిల్ పెట్టడానికి వెళుతున్నాను’ అన్నాడు.
సూఫీ కార్మికుడు ‘నువ్వే క్యాండిల్ వెలిగించావా?’ అన్నాడు.
కుర్రాడు ‘అవును నేనే వెలిగించాను’ అన్నాడు.
సూఫీ మార్మికుడు కుర్రాడిని ఆట పట్టిద్దామనుకుని ఒక చిత్రమైన ప్రశ్న వేశాడు. ‘నువ్వు వెలిగించినపుడు కాంతి ఎక్కడి నించి వచ్చిందో చూశావా?’ అన్నాడు.
కుర్రాడు నవ్వి క్యాండిల్ ఆర్పేసి ‘ఇప్పుడు వెలుగు ఆరిపోయింది. కాంతి ఎక్కడికి వెళ్లిందో చూశావా?’ అన్నాడు.
ఆ మాటలకు సూఫీ మార్మికుడు ఆశ్చర్యపోయాడు. కుర్రాడు మామూలుగా ఆ ప్రశ్న వేశాడు.
నిజమే! కాంతి ఎలా వస్తుందో, ఎక్కడికి వెళుతున్నదో ఎవరికీ తెలీదు. ఎవరికీ తెలియని దాన్ని కుర్రాడు ఎంత సరళంగా ప్రశ్నించాడు’ అని సూఫీ మార్మికుడు ఆశ్చర్యపోయాడు.

- సౌభాగ్య, 9848157909