S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మొదట్లో..

ఏమొదట్లో.. అన్నిటికన్నా మొదట్లో.. ఏ అన్నిటికన్నా.. అసలు అన్నిటికన్నా.. అనగా.. ఈ ప్రపంచము, విశ్వమూ ఏవీ లేనప్పుడన్నమాట.. నిజంగా మొదట్లో అసలేమీ లేదు. ఆ పరిస్థితిని ఊహించడమే కష్టం. ఇవాళ మనకు అన్నిటికన్నా చిన్నది అని చెప్పవలసి వస్తే పరమాణువు గుర్తుకు వస్తుంది. మన ప్రాచీనులు కూడా పరమాణువులలో అణువు, మహత్తులలో మహత్తు అంటూ వర్ణనలు చేశారు. పరమాణువులో భాగాలున్నాయి అంటున్నారు. అందులో ప్రోటాన్ ఒకటి. ఈ ప్రోటాన్ మరీ చిన్నది. చెప్పలేనంత చిన్నది. ఊహకు అందనంత చిన్నది.
పరమాణువే చిన్నది, అది కనిపించదు. అది ఉన్నందుకు జరుగుతున్నాయన్న మిగతా విషయాల ఆధారంగా దాని ఉనికిని నమ్మాలి. అటువంటి పరమాణువులోని భాగాలు మరీమరీ చిన్నవి. ప్రతి పుస్తకంలోనూ ఇటువంటి విఃయాలను చెప్పేటప్పుడు వాక్యం తరువాతనున్న చుక్క గురించి చెపుతూ ఉంటారు. అచ్చులో వచ్చిన ఆ చుక్కలో ఎన్ని ప్రోటాన్‌లు ఉంటాయి అని లెక్కపెట్టవచ్చు. ఇంచుమించుగా లెక్కవేస్తే ఇక్కడి చుక్కలో సుమారు 500,000,000,000 ప్రోటాన్‌లు ఉన్నాయి అనుకుందాం. సెకండ్ అనే కాలవ్యవధి గురించి తెలుసు కదా! ఈ పైన ఉన్న అంకెకు సమానంగా సెకండ్‌లు గడిచాయనుకోండి. ఎంత కాలమవుతుందో మీరు బహుశా ఊహించలేరు. ఐదు లక్షల సంవత్సరాలు అవుతుంది. ప్రోటాన్‌లు చిన్నవి అని చెప్పడానికి ఇంత ప్రయత్నం. ఈ ప్రపంచంలో చిన్న ప్రాణులను గురించి చెప్పడానికి మైక్రోస్కోపిక్ అనే మాట వాడతారు. ప్రోటాన్‌లను చూడడానికి ఈ మాట కూడా పనికిరాదు.
మనకు దిక్కుమాలిన ఊహాశక్తి ఉంది. వీలు కాదని తెలిసిన విషయాలను కూడా మనం సులభంగా ఊహించగలుగుతాము. కనుకనే ఇక్కడ మనం ఒక ఊహను మరీ అన్యాయంగా చేయగలగాలి. చిన్నది, మరీ చిన్నది, అంతకన్నా చిన్నదయిన ప్రోటాన్‌ను దాని కొలతలో బిలియనవ (నవ్వకండి!) భాగానికి కుదించగలగాలి. ఆ కుదించిన ప్రోటాన్‌ను ఒక పెద్ద ఖాళీలోకి చేర్చాలి. అందులో కొంత పదార్థం ఉండాలి. ఇవేవీ వీలుకావు. కానీ వీలయ్యాయి. కనుకనే విశ్వం పుట్టింది.
విశ్వం పుట్టిందీ అనగానే చాలామందికి విస్ఫోటనం అనే మాట మెదడులో కదలాడి ఉంటుంది. ఆ పద్ధతి గురించే అందరూ ఆలోచిస్తున్నారని అనుమానం కూడా. సృష్టిలోని పదార్థాన్నంతా ఒక చోటికి చేర్చి మన ప్రోటాన్ ఉన్న ఆ చోటిలోకి అదిమి పెట్టేసెయ్యాలి. ఆ చోటికి కొలతలంటూ ఉండవు. దానికొక పేరు కూడా పెట్టుకోవచ్చు.
ఇంతకూ ఇక్కడొక బిగ్‌బ్యాంగ్ అనే పెద్ద పేలుడు అనే మహా విస్ఫోటనం జరగాలి. అంటే మనం చాలా దూరంగా వెళ్లిపోవాలి అని కూడా వెంటనే ఆలోచన వస్తుంది. అయితే అక్కడ వెళ్లడానికి ఎటూ ఏమీ లేదు. మనమింకా పేరు పెట్టని ఆ కొలతలు లేని పదార్థపు చుక్క (అనవచ్చా!)ను మించి అసలు మరేమీ లేదు. పేలుడు జరిగిన తరువాత విశ్వం వ్యాపించడానికి అక్కడొక ఒక ఖాళీ లేదు. తన ఖాళీని తానే ఏర్పాటు చేస్తూ విశ్వం వ్యాపిస్తుంది.
పేలుడు, విస్ఫోటనం అనగానే చెవులు మూసుకోవాలని అనిపిస్తుంది. కారు టయరు పేలినా, దీపావళి బాంబు పేలినా ఆ చప్పుడును మన చెవుల దాకా చేర్చడానికి మధ్యలో గాలితోబాటు మరెన్నో ఏర్పాట్లున్నాయి. కనుకనే ఆ పేలుడు మనకు వినిపిస్తున్నది.
ఈ మహావిస్ఫోటనం జరిగినప్పుడు ఈ ఏర్పాట్లన్నీ లేవు. అది ఏమీ లేదులో జరిగిన పేలుడు. అంటే పేలుడు జరిగింది కానీ, చప్పుడు లేదని ఊహించ గలగాలి. ఒకతను మనుషులు గాలి వదిలితే వచ్చే చప్పుడు విన్నాడు. ఇక ఏనుగు గాలి వదిలితే ఎంత చప్పుడు వస్తుందని అనుమానం వచ్చింది. అతను దినమంతా ఏనుగు చుట్టూ తిరిగాడు. ఏనుగు గాలి వదిలింది. కానీ చప్పుడు మాత్రం రాలేదు. ఈ మహావిస్ఫోటనం గురించి చెప్పడానికి ఆలోచన కూడా సులభంగా అందదు.
పేలుడు జరిగింది అంటే ఒక చుక్క నించి అనుకున్నాము. ఆ చుక్క ఒక పెద్ద అంతులేని ఖాళీలో మధ్యన ఎక్కడో వేలాడుతున్నదని మనకు అనిపించడం చాలా సహజం. కానీ దాని చుట్టూ ఏమీ లేదు అని కూడా అనుకున్నాము. అంతరిక్షం లేదు, అందులోని ఖాళీ లేదు. చీకటి అంతకన్నా లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఒకటే మాట. అక్కడ ఉన్నదల్లా కొలతలు లేని చుక్క. దాని చుట్టూ ఏమీ లేదు. ఆ చుక్కకు కొలతలు లేవు. దాని చుట్టూ అనడానికి అసలు చుట్టూ లేదు. చుట్టు అన్నది లేనప్పుడు అక్కడ ఖాళీ లేదు. మరి దేనికీ ఉనికి లేదు. అలాంటి పరిస్థితి ఎంతకాలం కొనసాగింది లేక అది అప్పుడప్పుడే పుట్టుకు వచ్చిందా? ఈ రకంగా ఆలోచనలు పుట్టుకవస్తాయి గానీ, కొలతలేవీ లేని, ఖాళీలు కూడా లేని ఒక పరిస్థితి పుడుతుందా? దాన్ని గురించి మనం ఆలోచించగలమా? అది ఎప్పటి నుంచి ఉంది? ఈ ప్రశ్నలోనే ఒక తికమక ఉంది. దాని ఉనికికి ఎప్పటి అన్న ప్రశ్న లేదు. అంతకు ముందు కాలం కూడా లేదు. అంటే గతం లేదు. విశ్వం పుట్టుకతోనే కాలం కూడా పుట్టింది.
చదవడం ఆపి కొంచెంసేపు ఆ పరిస్థితిని గురించి ఆలోచిస్తామంటే అభ్యంతరం లేదు గానీ, పేలుడు జరిగింది. శబ్దం లేదు గనుక ఆ సంగతి మనకు పట్టదు. ఏమీ లేదులో నుంచి విశ్వం మొదలయింది. అప్పుడే వెలుగు పుట్టింది. వేడి పుట్టింది. కాలం పుట్టింది. కదలిక పుట్టింది. ఆ కదలిక మాటలకు అందకుండా ఉంది. కొలతలు లేని ఒక ఉనికిలో నుంచి చూస్తూండగానే కొలతలకు అందని ఒక విశ్వం తయారయింది. ఆ మొట్టమొదటి క్షణంలోనే అంతా వచ్చేసింది. ఆ క్షణం గురించి అర్థం చేసుకోవాలని పరిశోధకులు చాలామంది తమ జీవిత కాలాలను వెచ్చించారు. అయినా అర్థమయింది తక్కువే. మొత్తానికి ఆ క్షణంలోనే పదార్థాల మధ్యన గురుత్వాకర్షణ మొదలయింది. ఇప్పుడు మనం భౌతిక శాస్త్రంగా అనే పేరుతో చెప్పుకుంటున్న రంగంలో వర్ణించిన మరెన్నో రకాల బలాలు కూడా అప్పుడే పుట్టాయి. ఒక నిమిషం కన్నా తక్కువ సమయంలో ఈ విశ్వం మిలియన్ బిలియన్ మైళ్ల దూరం వ్యాపించింది. అది ఇంకా వ్యాపిస్తూనే ఉన్నది. పది బిలియన్ డిగ్రీల వేడి కూడా పుట్టింది. ఆ ప్రభావంతో అణు చర్యలు పుట్టాయి. తేలికపాటి మూలకాలు పుట్టాయి. ముఖ్యంగా హైడ్రోజన్, హీలియమ్‌లు పుట్టాయి. ప్రతి పది కోట్ల అణువులకు ఒక్కటిగా మిలియన్ కూడా పుట్టినట్టుంది. మూడు నిమిషాలలోపల బోలెడు పదార్థం పుట్టింది. ఆ పదార్థమే ఇప్పటివరకు విశ్వమంతా వ్యాపించి ఉంది. ఇక మీదట కూడా అదే ఉంటుంది. పదార్థాన్ని మళ్లీ సృష్టించడమూ, ఉన్నదాన్ని నాశనం చేయడమూ వీలు కాదని నిన్న మొన్న సైంటిస్టులు తెలుసుకున్నారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న లెక్కలో ఈ సంగతి నిన్నమొన్న తెలిసిందంటే అబద్ధం కాదు. మనం మాట్లాడుతున్నది బిలియన్ సంవత్సరాల గురించి. అందులో వందకు లెక్కలేదు. మొత్తానికి విశ్వం పుట్టింది.
విశ్వంలో ఎక్కడో ఒకచోట ఇంతకు ముందు మనం చెప్పుకున్న కొలతలు లేని ప్రోటాన్‌లాగ మన భూమి, దాని మీద అంతకన్నా చిన్న మనం ఉన్నాం. అందాలను చూచి ఆనందాన్ని గురించి ఊహించుకుంటున్నాం. అంటే ఈ విశ్వంలో ఎనె్నన్ని వీలవుతాయో, ఎంత బాగుంటాయో ఆలోచించాలని మనవి. ఇంత విశ్వమూ ఏర్పడడానికి పట్టిన సమయం మాత్రం ఎంతో తక్కువని గమనించాలి.
విశ్వంలో ఉన్న మరెన్నో అంశాలలో సముద్రంలో నీటి చుక్కలాగ మనమున్న ప్రాంతం, మన సౌర మండలం, మన భూమి కూడా ఉన్నాయి. మనకేమో మొత్తం అర్థమయి పోయిందని ఒక భావం. లేదంటే అది కూడా పట్టకుండా బతకడం ఒక పద్ధతి. కొలతలకు అందని మనం మన కొలతలను గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాము. మిగతా విషయాలు పట్టకుండానే బతుకు గడుస్తుంది. కానీ కొంతవరకయినా సంగతులు తెలిస్తే బాగుంటుందన్న ఆలోచన ఇక్కడ మొదలు కావాలి.
మళ్లీ ఒకసారి చప్పుడు లేని పేలుడు గురించి ఆలోచిస్తే అది ఎప్పుడు జరిగిందని ఒక ప్రశ్న. పరిశోధకులు బుర్రలు చించుకుని కనీసం పది బిలియన్ సంవత్సరాల క్రితం అని జవాబు ఇచ్చారు. జుట్టు కూడా పీక్కున్న మరి కొంతమంది వచ్చి అంతకు రెండు రెట్ల కాలం క్రితం అన్నారు. అసలు బుర్ర మిగలలేదనుకున్న మహా మేధావులు ఇంచుమించు ఈ మధ్యకాలంలో ఎప్పుడో జరిగి ఉంటుంది అని నచ్చజెప్ప చూచారు. అదీ సంగతి.

కె. బి. గోపాలం