S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కొత్త బాధ్యత!

సొట్టబుగ్గల తాప్సీ బాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. పింక్, జుడవా-2 సినిమాలతో హిట్స్ అందుకున్న ఈ అమ్మడికి సౌత్‌లో సక్సెస్ రాలేదన్న బాధ కూడా మరిచిపోయేలా విజయాలు వరించాయి. అందుకే కాస్త గ్లామర్ డోస్ పెంచి బాలీవుడ్‌లో గ్లామర్ హీరోయిన్‌గా స్థిరపడడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికీ తాప్సీకి అవకాశాలు భారీగా వస్తున్నాయట. తాజాగా తాప్సీ మరో బాధ్యత కూడా చేపట్టింది. ఉమెన్ హార్లిక్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. మహిళలు దృఢంగా, ధైర్యంగా ఉండాలని చెప్పనున్నదట. హిందీలో ఏకంగా రెండు సినిమాల్లో నటించేందుకు సిద్ధం అయినా, ఈ అమ్మడు తమిళంలో కూడా మరో చిత్రంలో నటిస్తోందట.

-సమీర్