S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘డెడ్ సీ’ సముద్రం కాదు!

ఇజ్రాయెల్, జోర్డాన్, వెస్ట్‌బ్యాంకు సరిహద్దుల్లో ఉన్న ‘డెడ్ సీ’ నిజానికి సముద్రం కాదు. భారీ ఉప్పునీటి సరస్సు. ఈ ‘మృత సముద్రం’ మూడువైపులా భూమి ఉంటుంది. అటువైపు నుంటి ఎక్కడికీ నీరు ప్రవహించదు. నాలుగోవైపు నుంచి లోపలికి నీరు చేరుతుందంతే. ప్రపంచంలో అత్యంత ఉప్పదనంతో ఉండే ఉప్పునీటి సరస్సు ఇది. మామూలు సముద్రాల నీటిలో ఉప్పు కన్నా డెడ్‌సీ నీరు 9.6 శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నీటిలో ఉప్పుసాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల మిగతా నీళ్లలో మనుషులు తేలడం కన్నా ఇక్కడ సులువుగా తేలియాడతారు. ఇందులో నీళ్లు ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల, అత్యంత దిగువున లోతుగా ఉండటం వల్ల సూర్యరశ్మి సరిగా పడక ఇందులో జలచరాలు, జీవరాశి దాదాపు ఉండదు. ఒకటీ అరా బ్యాక్టీరియా, ఆల్గేలు ఉంటే ఉంటాయి. ఈ నీటిని తాగలేరు. వైద్యఆరోగ్య పర్యాటక ప్రాంతంగా మాత్రం అభివృద్ధి చెందింది. అయితే దీనికి ఓ విశిష్టత ఉంది. ఈ నీటితో అద్భుతమైన ఔషధాలు తయారు చేస్తున్నారు. సొరియాసిస్ వంటి చర్మవ్యాధులు, కీళ్లనొప్పుల నివారణకు ఈ నీరు, ఇందులో దొరికే ఖనిజలవణాలు, మట్టితో ఔషధాలు తయారు చేస్తున్నారు. చికిత్సలు, వైద్య పరిశోధనలకు ఈ సముద్రం వేదికగా మారింది. ప్రపంచంలో అతిలోతైన ఉప్పునీటి సముద్రం ఇది. సముద్రమట్టానికి దాదాపు వెయ్యి అడుగుల లోతున ఈ డెడ్‌సీ ఉంటుంది. పదిమైళ్ల వెడల్పు, 30 మైల్ల పొడవున ఉండే ‘డెడ్ సీ’లో జీవరాశి బతకదు కనుక దానికి ఆ పేరు వచ్చింది. సాల్ట్ సీ అని, సీ ఆఫ్ డెత్ అని కూడా దీనిని పిలుస్తారు.

- ఎస్.కె.కె. రవళి