S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మైనస్ 60 డిగ్రీల చలిలోనూ బతికేస్తాయి!

ఎప్పుడో ఐదువేల ఏళ్ల క్రితం గ్రీన్‌లాండ్‌కు వచ్చిన ఈ శునకాలను ‘గ్రీన్‌లాండ్ డాగ్’ అని పిలుస్తారు. తోడేళ్ల లక్షణాలను పుణికిపుచ్చుకున్న వీటిని పెంచడం ఆషామాషీ కాదు. బలమైన, ధైర్యమైన యజమాని సంరక్షణలో మాత్రమే ఇవి చెప్పినమాట వింటాయి. యజమానికి వెనుక లేదా, పక్కనుంచి నడవటానికి ఇష్టపడతాయి. యజమానికన్నా ముందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లడానికి ఇష్టపడవు. ఎందుకంటే సహజంగా అవి తోటి శునకాల గుంపులో యజమానిని అనుసరించే గుణం కలిగి ఉంటాయి. గ్రీన్‌లాండ్‌కి వచ్చినా వాటి సహజలక్షణం అంతరించిపోలేదు. వీటికి ఒతె్తైన, దళసరి బొచ్చు ఉంటుంది. మైనస్ 60 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయినా అవి తేలిగ్గా తిరిగి బతుకుతాయి. అదే వాటి విశిష్టత. ఒకప్పుడు వీటిని ఎస్కిమోలు పెంచుకునేవారు. వేటకు వాడేవారు. ఇప్పుడు గ్రీన్‌లాండ్‌లో ఇవి ఎక్కువగా ఉన్నాయి.

- ఎస్.కె.కె. రవళి