S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అందానికి చిరునామా

ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. ఒక్కోసారి అందమైన దృశ్యాన్ని చూసినవెంటనే దానిని కెమెరాలో బంధించాలనిపిస్తుంది. కానీ చాలామందికి అవకాశం రాదు. అలాంటి అవకాశాలను వదులుకోని, అలాంటి అవకాశాల కోసం కాచుకుని ఉండేవారి కోసం నేషనల్ జియోగ్రాఫికల్ ఛానల్ ఏటా పోటీ నిర్వహిస్తుంటుంది. నేచర్ విభాగంలో జరిగిన పోటీకి వచ్చిన ఎంట్రీలు ఆహా అనిపిస్తున్నాయి. వాటిలో మెక్సికోలోని లాస్‌కొబొస్‌లో స్టార్‌ఫిష్‌ను అమాంతం మింగేసేందుకు ప్రయత్నిస్తున్న ఓ సీల్ పిల్ల ప్రయత్నిస్తున్న దృశ్యం ఒకటి. నిజానికి సీల్స్ వాటి ఆహారాన్ని వెంటనే తినవు. అరగడానికి వీలుగా శరీరాన్ని వంపులు తిప్పి తింటాయి. తినేముందు ఇలా వాటితో ఆడుకుంటాయి. ఒక్కోసారి తినేస్తాయి. చాలాసార్లు వదిలేస్తుంటాయి. ఈ దృశ్యాన్ని క్లిక్‌మనిపించాడు పెడ్రో కొరిల్లో. ఇక బాంబేహుక్ తీరంలో జెర్రీ ఎండే తీసిన ఓ కొంగ ఫొటో ఇట్టే కట్టిపడేస్తుంది. స్పష్టంగా, నిశ్ఛలకంగా ఉన్న నీటిలో కొంగ రెక్కలార్పిన దృశ్యం ఓ తెరచాపలా విచ్చుకుని కనిపిస్తుంది. ఇక తను తాగిన నీటిలో ఎక్కువైన ఉప్పును ముక్కు రంధ్రాల్లోంచి బయటకు చిమ్ముతున్న ఓ బల్లిజాతి జీవిని తన కెమెరాలో బంధించాడు ఎమ్ ఎంగెల్‌మన్. బాగున్నాయి కదూ ఈ ఫొటోలు.

- భారతి