S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్టార్‌డమ్ బ్యూటీ!

బాలీవుడ్‌లో 2005లో ‘పరిణీత’ చిత్రంతో అడుగుపెట్టిన బ్యూటీ విద్యాబాలన్. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద చక్కటి విజయాన్ని నమోదు చేసింది. దాంతో దాదాపు మూడేళ్లు ఆమె చేతినిండా చిత్రాలే. ఆయా సినిమాల షూటింగ్‌లతో బిజీ బిజీగానే కెరీర్‌ని సాగించింది. అయితే అలా సాగిపోతున్న విద్య జీవితంలో 2008 వచ్చే సరికి ఆమె ఆలోచనలు నెమ్మదిగా మారడం మొదలుపెట్టాయి. తనకు పూర్తి సంతృప్తినిచ్చే పాత్రలే చేయాలి అనుకుంది. దాంతో అప్పుడే తనకంటూ ఓ జీవితం ఉందని అర్థమైంది. సినిమాల కోసమే బతకాలనుకోలేదు. షూటింగ్‌లతో బిజీగా ఉన్నా ప్రచారం కోసం బయటికెళ్లాలని అస్సలు అనుకోలేదు. తనకంటూ ఓ చిన్న ప్రపంచంలో హాయిగా జీవించాలి. కెమెరా ముందు లేనప్పుడు జీవితాన్ని ఆస్వాదిస్తూనే కెమెరా ముందు పోషించే పాత్రలకు న్యాయం చేయగలననే నమ్మకం ఆమెకు కలిగింది. తనకంటూ ఓ వ్యక్తిగత జీవితం ఉంది. తన భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ సినిమా నటుడు కాదు. అందుకే ఆయన గురించి బహిరంగంగా మాట్లాడి ఆయన వ్యక్తిగత స్వేచ్ఛను ఇబ్బంది పెట్టలేదు. మిగిలిన ఆమె కుటుంబ సభ్యులు కూడా పబ్లిసిటీకి ఎంతో దూరంగా ఉంటారు. ఎందుకిలా? అని విద్యను కదిలిస్తే- ‘‘సినిమాల్లోకి వచ్చాక నా జీవితం వేరు.. నా కుటుంబం వేరు. అందుకనే పబ్లిసిటీకి వాళ్లను ఎప్పుడూ దూరంగానే వుంచాను. ఎందుకంటే నావల్ల వారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే నిర్ణయం తీసుకున్నా. దీనికి వాళ్లు కూడా ఓకే చెప్పారు. సినిమాల్లోకి వచ్చాక హిట్ ఫ్లాప్‌లు సహజం. ఫ్లాప్ వస్తే ఇబ్బంది పడిన మాట వాస్తవమే. అలాగని సినిమాలు చేయడం ఆపలేదు. సినిమాల్లో ఉన్నంత కాలం ఆ సమస్యలు తప్పవు. తొలినాళ్లలో ఉన్నంత బాధ ఇప్పుడు ఉండదు. ఎందుకంటే అనుభవం నేర్పిన పాఠం ఇది. ఓ నటిగా నేను సంపాదించుకొన్న స్టార్‌డమ్‌ని ప్రతి క్షణం ఆస్వాదిస్తూనే ఉంటాను. కానీ నటన ఎప్పటికీ నాకో ఉద్యోగమే’’అంటూ చెప్పుకొచ్చింది. బాలీవుడ్‌లో విద్యాబాలన్ చేసిన చిత్రాలను పరిశీలిస్తే మనకు ఈ విషయాలే స్పష్టంగా తెలుస్తాయి. కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. జాతీయ స్థాయి ఉత్తమనటిగా ప్రశంసలు అందుకొని ఓ పక్క వ్యక్తిగత జీవితాన్ని, మరో పక్క నటనను ఆస్వాదిస్తోంది. సినిమా.. పర్సనల్ లైఫ్.. ఈ రెండింటిని బ్యాలన్స్ చేసుకొంటూ కెరీర్‌లో హ్యాపీగా ముందుకెళుతుంది. దటీజ్..విద్య!!

-సమీర్