S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గ్రీన్‌లాండ్‌లో ఉండేదంతా ఐస్!

ఆర్కిటిక్ ప్రాంతానికి అతి చేరువలే ఉండే ‘గ్రీన్‌లాండ్’ పేరును బట్టి అంతా పచ్చదనమే ఉంటుందనుకుంటే తప్పే. ఆ దేశంలో 99శాతం గడ్డకట్టిన మంచు, కదులుతున్న గ్లేసియర్స్‌తో నిండిపోయి ఉంటుంది. ఈ దేశం చాలా పెద్దది. గ్రేట్‌బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, బెల్జియం దేశాలన్నీ కలిపినంత ఉంటుంది. ఈ దేశంలో ఐస్‌లేకుండా ఉండే అతికొద్ది ప్రాంతం డెన్మార్క్ అంత ఉంటుంది. ఇక్కడ రోడ్డురవాణా అసలు ఉండదు. నగరాల మధ్య రాకపోకలన్నీ వాయు లేదా జలమార్గాల్లోనే సాగుతాయి. ‘గ్రీన్‌లాండ్’ అంటే ‘ల్యాండ్ ఆఫ్ పీపుల్’ అని అర్ధం. ఇక్కడ మే 25 నుండి 25 వరకు సూర్యుడు అస్తమించడు. జూన్ 21 సుదీర్ఘ పగలు ఉన్న రోజు. ఆ రోజు గ్రీన్‌లాండ్‌లో జాతీయ సెలవు దినం.

- ఎస్.కె.కె. రవళి