S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఐస్‌లాండ్‌లో అగ్నిపర్వతాలు ఎక్కువ!

మనుషులు నివసిస్తున్న చిట్టచివరి ప్రాంతం ఐస్‌లాండ్. ఆర్కిటిక్‌కు దగ్గరి ప్రాంతంలో ఈ దేశం ఉంది. ఇక్కడ అడవులు లేవు. దోమలు ఉండవు. ఒక మహిళ దేశంలో అత్యున్నత పదవిని నిర్వహించిన తొలిదేశంగా దీనికి ప్రపంచంలో గుర్తింపు ఉంది. మైనస్ డిగ్రీల చలిలోనూ ఇక్కడివారు ఐస్‌క్రీమ్ తినడాన్ని ఇష్టపడతారు. ప్రపంచంలో మిగతా అన్ని దేశాలవారికన్నా ఇక్కడి ప్రజలు ఎక్కువగా సినిమాలు చూస్తారు. పేరులో ఐస్‌లాండ్ అని ఉన్నప్పటికీ ఈ అతి చిన్న దేశంలో 125 అగ్ని పర్వతాలు ఉన్నాయి. వీటిలో దాదాపు పాతిక అగ్నిపర్వతాలు చాలా చురుకుగా ఉంటాయి. అంటే ఎప్పుడు సెగలు కక్కుతూంటాయన్నమాట. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందడం రివాజు. గ్లేసియర్లు, లావా పేరుకున్న శిలాప్రాంతాలు, అగ్నిపర్వతాల సమాహారం ఐస్‌లాండ్. పచ్చటి మొక్కల మాట తక్కువే. సుదీర్ఘ శీతాకాలం, సుదీర్ఘ వేసవి కాలం మధ్యరాత్రి సూర్యోదయం, ఉత్తర కాంతుల దర్శనం ఇక్కడి విశేషం. సముద్రంలో వేల్ చేపలను పరిశీలించే పర్యాటక కార్యక్రమం ఈ దేశపు అతిపెద్ద ఆదాయ వనరు. ఐస్‌లాండిక్ భాష గత వెయ్యేళ్లుగా ఎటువంటి మార్పునకు గురి కాలేదు. అంటే అప్పటి పుస్తకాలను ఇప్పటివారు కూడా సులభంగా చదవగలరన్నమాట. పాములు, బల్లులు, తాబేళ్లను పెంచుకోవడం ఇక్కడ నేరం. ఇది తటస్థ దేశం. ఇక్కడ వాయుసేన, నౌకాదళం, ఆర్మీ ఉండవు. దేశంలో దాదాపు 98 శాతం మందికి ఇంటర్నెట్ సౌలభ్యం ఉంది. దేశంలో సగం జనాభా రాజధాని ‘రిక్‌జవిక్’లోనే నివసిస్తున్నారు. భూమిలోపల ఉండే భూఫలకాలు కదలికల వల్ల భూకంపాలు వస్తాయని తెలుసుకదా. ఐస్‌లాండ్‌లో అలాంటి రెండు భూఫలకాలు భూమిపైన కలసిన చోటు ఒకటి ఉంది. దానిని పింగ్‌వెల్లియన్ అంటారు. భూమిపై ఇలా బహిర్గతంగా రెండు భూ ఫలకాలు కలసిన చోట్లు రెండే ఉన్నాయి. అందులో ఇది ఒకటి. మరొకటి ఆఫ్రికాలో ఉంది. ఈ ఫలకం కదలికల వల్ల ఐస్‌లాండ్ ఏటా రెండు సెంటీమీటర్ల చొప్పున కదులుతూ వస్తోంది.