S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా ఉందీ వారం? ( డిసెంబర్ 24 నుండి 30 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
అనుకూల ఫలితాలు అందుకుంటారు. అన్నింటా విజయం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. మొహమాటం జోలికి వెళ్లకండి. ఆర్థికంగా అనుకూలం. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బద్ధకాన్ని విడనాడండి. సమయానికి పనులు పూర్తి చేసుకోండి. హితుల సూచనలు లాభిస్తాయి. ప్రశాంతచిత్తంతో ఇబ్బందులను అధిగమిస్తారు. ఆధ్యాత్మికత యోగిస్తుంది. స్పెక్యులేషన్ మిశ్రమం. విద్య, వైద్య, వృత్తి రంగాలందు సంతోషాలను అందుకుంటారు. పెట్టుబడులు స్వల్పంగా అనుకూలిస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
శీఘ్ర కార్యానుకూలతలు. సంయమనంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకొన్నట్లయితే యోగిస్తాయి. ఒత్తిడిని తట్టుకొనే ఆత్మస్థైర్యాన్ని పెంచుకోండి. ఖర్చులకు తగ్గట్టు ఆదాయం ఉంటుంది. ప్రణాళికలు అన్నింటా మేలు. కుటుంబ సభ్యుల సలహాలు మీ నిర్ణయాలకు ఊతమిస్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టేట్లు చూసుకోవాలి. కోపతాపాలకు అవకాశమివ్వకండి. వారాంతంలో మంచి వార్తలు వింటారు. పెట్టుబడులు మిశ్రమ ఫలితాలను అందిస్తాయి. అనుకోని సంపద అందేట్లుంది.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
సత్వర కార్య అనుకూలతలున్నాయి. ధన యోగం. ఉత్సాహంతో పనులు ప్రారంభించి పూర్తి చేయండి. ఆలోచనలతో కఠినమైన కార్యాలను సైతం పూర్తి చేస్తారు. సమాజంలో మీకు అనుకూల వాతావరణం చోటు చేసుకుంటుంది. మానసిక కృంగుబాటుకు ఆస్కారముంది. వివాదాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన వ్యవహారాలలో నేర్పును ప్రదర్శించండి. గుర్తింపును పొందుతారు. క్రమంగా ఈ వారంలో అభివృద్ధిని వీక్షిస్తారు. ఆధ్యాత్మిక శక్తి మిమ్ములను ముందుకు నడిపిస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)
మీ శక్తి సామర్థ్యాల పైనే విజయం ఆధారపడి ఉంటుందని గుర్తించండి. కొత్తగా ఆలోచించండి. సాహసాలకు ఇది అనుకూల సమయమా అని యోచించండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు సంతోషాన్ని కలిగిస్తాయి. మిత్రత్వాన్ని విస్తరించుకో గలుగుతారు. ఆస్తి విషయాలలో అనుకూలతలున్నాయి. గృహ, వాహన సుఖాలను అందుకుంటారు. నూతన కార్యాలను ఆవిష్కరిస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
ఆలోచనలకు పదును పెట్టి తీసుకొనే నిర్ణయాలు ఉపకరిస్తాయి. అర్హతకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఉత్సాహంతో పనులను ప్రారంభిస్తారు. తొందరపాటు కూడదు. లాభాలను అందుకుంటారు. సంకల్పం వికల్పం కాకుండా నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రుల సాయం అందుకుంటారు. ఎంచుకున్న రంగాలు విస్తరిస్తాయి. అర్థాంతరంగా పనులు వాయిదా వేయకుండా జాగ్రత్త పడండి. స్పెక్యులేషన్‌లో లాభవృద్ధి. అన్నింటా జయాలు గోచరిస్తున్నాయి.
కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

ఈ వారం అదృష్టం మీ వశమవుతుంది. గొప్ప అవకాశాలను అందుకుంటారు. అనుకున్నవి సాధిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలందు అనుకోని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆలోచనలు హితులకు మేలు చేస్తాయి. ప్రయాణాలందు నేర్పు అవశ్యం. వారాంతంలో ముఖ్యమైన పనులు పూర్తి చేసి, మీ విలువను పెంచుకుంటారు. ముఖ్య వ్యక్తుల కలయిక, సూచనలు మేలు చేస్తాయి.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
అనుకున్నవి సాధిస్తారు. ఆశయాలు నెరవేర్చుకుంటారు. కష్టపడి, ఇష్టపడి పని చేస్తే అనుకున్నవి సాధించి సంతోషాన్ని పొందగలుగుతారు. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను అందిస్తాయి. గృహంలో శుభాలకు అవకాశం. పేరు, గుర్తింపులు అందుకుంటారు. అపార్థాలకు తావివ్వకండి. స్పెక్యులేషన్ మిశ్రమం. అన్నింటా సాలోచనలతో, అవకాశాలకు అనుగుణంగా ప్రవర్తించండి. ప్రశంసలు అందుకుంటారు. అన్ని విషయాల్లోనూ అవగాహన కలిగి ఉండండి. అన్నింటా పరిష్కార మార్గాలు గోచరిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)
స్పష్టమైన ఆలోచనా విధానాలతో మీ కార్యాలు పూర్తి చేసుకుంటారు. సమయ పాలన ముఖ్యం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాదులందు అనుకున్న లాభాలను అందుకుంటారు. ప్రలోభాలకు లోను చేసే అంశాలను కనిపెట్టండి. పొగడ్తలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేట్టు ఉన్నాయి. గమనించండి. స్పెక్యులేషన్ దీర్ఘకాలికం. ఆలోచనలు అన్నింటా మంచి ఫలితాలను అందిస్తాయి. ఎంచుకున్న రంగాలందు వృద్ధి గోచరిస్తోంది. మనఃస్థిమితంతో ముందుకెళ్లండి. పెట్టుబడి రంగం ఆలోచింపజేస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)
మనోబలం మీకు ఉపకరిస్తుంది. సమస్యలన్నీ తొలగుతాయి. స్పెక్యులేషన్ మిశ్రమం. విశేష ధనప్రాప్తి. సంకల్ప శక్తితో భవిష్యత్తులో చక్కని కార్యక్రమాలను నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, సేవా రంగాలందు ప్రత్యేక లాభాలను అందుకుంటారు. ఆలస్యంగా అయినా అనుకున్నవి అనుకున్నట్లు జరిగి సంతోషాన్ని అందిస్తాయి. నమ్మకంతో పనులు పూర్తి చేస్తారు. సంతృప్తిని పొందుతారు. ఒక శుభ పరిణామం మిమ్మల్ని సంతోషపరుస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)
బుద్ధిబలం, అంగ బలం, అర్థబలం కలయికతో ఈ వారం ముందుకెళతారు. ప్రయాణాదులందు మెళకువ అవశ్యం. చేపట్టే పనులన్నింటిలో మీదే పైచేయిగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు లేకుండా జాగ్రత్త పడండి. ఆర్థిక విషయాలు ఇబ్బందికరం కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. శక్తికి మించి రుణాలు ఇవ్వకండి. అప్పుతో తిప్పలు పడకండి.

కుంభం (ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

అనుకున్నవి పూర్తి చేస్తారు. సంపద లభిస్తుంది. తగాదాలకు దూరంగా ఉండండి. అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి. ఉద్యోగులకు అనుకూల సమయం. వాహన మార్పులు. అనుకోకుండా ఆర్థిక లావాదేవీలు కలసివస్తాయి. ఎంచుకున్న రంగాలు వృద్ధి బాటలో నడుస్తాయి. వ్యవహారాదులు కలసి వస్తాయి. శత్రుత్వాన్ని నివారించుకోవాలి. సంతాన సౌఖ్యం. కుటుంబంలో ఆనందం విస్తరిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
వనరులకు అనుగుణంగా వ్యవహరించండి. హితుల సహాయం ఉపకరించినా మీ ఆలోచనల మేరకు పనులు పూర్తి చేయండి. అనాలోచితంగా కార్యాలు చేపట్టినట్లయితే ఇబ్బందులు ఎదురవుతాయి. జాగ్రత్త వహించండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార, రియల్ ఎస్టేట్ రంగాలు విస్తరిస్తాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు అనుకూల వాతావరణం. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855