S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

క్రొత్త క్షణం

కాలం పరుగెడుతుంటే
ఆంగ్ల దిన, మాసాల పుస్తకంలో క్రొత్త పుట తెరిస్తే-
వచ్చే క్రొత్త కలాన్ని పట్టుకొని ఆపాలని చూస్తే- ఆగితే కదా
క్షణాలు అల్లిన సంవత్సర మాలికలూ
యుగాలూ మారిపోతున్నా
మన జ్ఞాపికలు తీపివైనా, చేదువైనా
మనసులో నిలిచిపోతాయి.
పసిపాపల బోసినవ్వులు, తియ్యని కేకలు
అనురాగ పుష్పాలై భవిష్య వాణికి తెర తీస్తున్నాయ్
చదువూ సంధ్యా ఒద్దికగా అమరాలని
అమ్మా నాన్నలు తమ పిల్లలకై వేడుకుంటున్నారు
నూతన వధూవరులు నిత్యం నూతనంగా వుండాలని
కడుపు పండాలని మ్రొక్కుతున్నారు
మన ప్రాణ రక్షణకై, దేశాన్ని గుండెల్లో దాచుకొని
మన అన్నదమ్ముళ్లు సైనికులై హిమగిరుల్లో
గడ్డకట్టే చలిలో సింహగర్జన చేస్తుంటే
వాళ్ల క్షేమం కోసం క్రొత్త సంవత్సరంలో
ఎప్పటిలాగే గుడిగంటలు మ్రోగిస్తున్నా
కాల గమనాన్ని ఆపలేని అశక్తులం
అందుకే ఇతర శక్తులను మనకిచ్చిన ఆ పైవాడు
తను యిచ్చిన వరాల్ని ఎంతగా వాడుతున్నామో చూస్తున్నాడు
కాలరథంతో ప్రగతిపథంలో
ఇంకో అడుగు వేసే క్షణమే
క్రొత్త సంవత్సరాగమనం.

-అనంత మురళీచంద్ర ఎ.ఎస్.ప్రభాకర్ 9963887346