S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రపంచ వేదిక!

నాదయిన
ఒక గొంతు కావాలి
నాదయిన పాట పాడాల
నా మూలాలను
తర్జుమా చేసే
ఒక వేదిక కావాలి
నా చొక్కాలోని
డిజైన్లు కూడా
నా బతుకు రంగుల్ని
మీ కళ్లపై
ప్రతిఫలించాలి
ఒకే తానులో
ముక్కలమైనా
చెక్కలయిన
నా హృదయపు పలక మీద
నా వెతల అక్షరాలను
నా ఆత్మగౌరవ యాసను
నా జీవన మూలాల శ్వాసను
మీరూ ప్రేమతో దిద్దుకోవాలి
తెరిచిన తలుపులగుండా
ఒక పూల వంతెనను
నిర్మించుకుని
మన కలలు
కరచాలనం చేసుకోవాలి
మన హృదయాలు
ఒకటిగా కౌగిలించుకోవాలి
తెలుగు మాలలో అల్లుకున్న
తీరొక్క పూల గుబాళింపయి
నువ్వూ నేను
సరికొత్త జీవన పరిమళాలతో
పులకించిపోవాలి
ప్రపంచ వేదిక మీద
మన తెలుగు తేజం
విశ్వకేతనమై రెపరెపలాడాలి!’

-‘చిత్తలూరి’ 8247432521