S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గమ్యం

చినుకు చినుకు కురిస్తేనేగా వానయ్యేది
జలపాతమై పరవళ్లు తొక్కేది
నదిగా మారి.. పంట పొలాలను తడుపుతూ
నేలతల్లికి పచ్చని చీర కట్టి అలరించేది!

పదం పదం కలుపుతూ పోతుంటేనేగా
పాటకి పల్లవి పుట్టేది
పల్లవిని అనుసరించే చరణాలు..
రాగాల పల్లకిలో ఊరేగిస్తుంటే..
వీనులవిందై.. జనరంజకమైన పాటై..
వింటున్న హృదయాలని ఆనంద డోలికల్లో ఊగిస్తూ..
మది నిండా ఉల్లాసాన్ని నింపుతుండేది!

నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ.. ఒంటరితనాన్ని వీడి..
మాటలను కలుపుకుంటూ.. జనులందరిని పలకరిస్తూ..
మమతానురాగాలను పంచుకుంటూ..
అడుగులన్నీ ప్రగతిపథం వైపు సాగితేనేగా..
జనహితం కాంక్షించే ఆ జీవితం
పదుగురికి స్ఫూర్తివంతమయ్యేది!

గమ్యం కలిగిన గమనం.. అర్థవంతం!
గమ్యం లేని పయనం.. అర్థరహితం!

-జి.బ్రమరాచార్యులు 9652832290