S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నన్నుగా మిగుల్చు

ఏ పాపం పరాయి పాలన తెచ్చిందో
ఏ నేరం వేలాది మాన ప్రాణాలను
బలి తీసుకుందో
రెండు శతాబ్దాలు
బానిస బతుకులు బతికాం స్వామీ!
దయ చూపావు ఎట్టకేలకు
స్వేచ్ఛా వాయువు పీల్చాం చాన్నాళ్లకు
దారిద్య్రం, నిరుద్యోగం మిగిల్చావు శేష పాపంగా
ఆరు దశాబ్దాలు అనుభవించాం ప్రారబ్దంగా
ఓ దశాబ్దంగా దయ చూపావు
దేశాంతరాల్లో కూడా కొలువిచ్చావు
దారిద్య్రం చాలా తగ్గించావు స్వామీ!
మరింకా ఇమ్మని అడగలేను సుమీ!
కేంద్రీకృతం చేయడమే అర్థం కాలేదు
అంతరార్థమేదైనా వృథాగా పడుండకూడదు
ఆకలి చావులు ఇంకా మిగిలిస్తే
నీవు చేసిన అభివృద్ధికి అర్థం లేనట్లే!
నింద మోపడం లేదు స్వామీ!
ఆవేదనతో అడిగానంతే!
దేశంలో లక్షల కోట్లు మూలుగుతున్నా
ఆకలి తట్టుకోలేక అడుగుతున్నా!
అన్నం పెట్టేవాడికే బతుకులేదు
ఎందుకో వాడ్నింకా నువ్వు కరుణించలేదు
ఏమైనా నీకు కృతజ్ఞులమై ఉంటాం!
ఎందుకంటే - నువ్వు మాకు చాలా చేశావు
నాడు ముప్పై కోట్ల మందిమే అయినా
తొంభై శాతానికి ఒక్క పూట గడవలేదు
నేడు నూట ముప్పై కోట్లకు పెరిగినా
చాలామంది మూడు పూటలా తింటున్నాం
డబ్బుకు కొదవలేదు
సౌకర్యాలకు మితిలేదు
దౌర్జన్యాలకు అంతే లేదు
రాజకీయాల్లో మంచి లేదు
ప్రజాస్వామ్యంలో ప్రజలే లేరు
దేశంలో శాంతి లేదు
మనుషుల్లో మనశ్శాంతి లేదు
అందుకే స్వామీ!
నువ్వు ఎంతిచ్చినా
ఉన్నది పోనీకు ప్రభూ!
ఆత్మీయ పలకరింపు
పరస్పర సహకారం
ప్రేమానుబంధాలు
ధార్మిక ఆలోచనా
ఆథ్యాత్మిక చింతనా
ఒక్కమాటలో చెప్పాలంటే-
ప్రపంచం మెచ్చిన మా సంస్కృతి
చెక్కు చెదరనీకుండా మిగిల్చి
మమ్మల్ని మమ్ముగా బతకనీయి ప్రభూ!

తోట సుబ్రహ్మణ్యం 9908893669