S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘పర’ ‘అపర’ ప్రవృత్తుల ‘సం’యోగం’

‘ప్రాపంచిక ప్రలోభాలకు లోబడకుండటమే యోగం. అలా భౌతిక ఆసక్తుల నుండి విడివడ్డవాడే యోగి. సామాన్యంగా సన్యాసం అంటే సంసారాన్ని విసర్జించటం అని. నిజానికి సంసారం అంటే భార్యాభర్తల బంధం. ఆ బంధం పిల్లలతో విస్తృతం కావటం. బంధుగణంతో పరివ్యాప్తం కావటం అనే కాదు.. ఈ భౌతిక బంధాల బాధ్యతల మధ్య నుండి సైతం ప్రాపంచిక వ్యామోహాలను త్యజించటమే సన్యాసం. ధ్యాన యోగం వల్ల ఇది సులభ సాధ్యమవుతుంది.
ధ్యాన యోగులకు కావలసింది కాషాయాంబర ధారణా సన్యాసం కాదు.. సాంసారిక కర్మల ధారణ. మానవ అవతరణా పరమైన కర్మలను భరిస్తూ, కర్మ రాహిత్యంతో అభౌతికం, అరూపం కావటమే యోగం. అదే ధ్యాన యోగ పరమార్థం. ఇలా సర్వకర్మ నివృత్తి సాధనే ధ్యాన యోగ సాధన.’
భగవద్గీతా విశే్లషణకు నా అక్షర ప్రబంధం తెరచుకుంటోంది.
నా ఈ భావాలను చైతన్య కృష్ణ ఉవాచలో వెతుక్కుంటూ-
‘యం సన్న్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ/ న హస్యసన్న్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన’/ ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే/ యోగారూఢస్య తస్యైవ శమః కారణ ముచ్యతే-
అన్న శ్లోకాల వెనక ఉన్న జ్ఞాన చక్షువు ఇదన్నమాట’ అంటూ ఆశ్చర్యంగా మొహం పెట్టాడు.
‘ఆ తర్వాతి రెండు శ్లోకాలలో - కర్మల విషయంలోను, ఇంద్రియాల విషయంలోను ఆసక్తి కలిగి ఉండకపోవటమే యోగారోహణకు మొదటి మెట్టు అంటాడు కృష్ణుడు.
యదా హి నేంద్రియార్థేషు న కర్మ స్వనుషజ్జతే/ సర్వ సంకల్ప సన్న్యాసీ యోగారూఢస్త దోచ్యతే
ధ్యానయోగి ఎటువంటి పరిస్థితులలోనూ తనను తాను కించపరచుకోలేడు. తన ముందు తానే దోషిగా నిలబడలేడు. పైగా, యోగ సాధనా పటిమతో తనను తానే ఉద్ధరించుకోవాలి. అంతెందుకు, తన గిక ప్రపంచంలో తనకు తానే బంధవు, తనకు తానే మిత్రువు, తనకు తానే శత్రువు, తనకు తానే మార్గదర్శి కూడా. కాబట్టి ఉదాసీనత అనేది ధ్యాన యోగికి గిక వ్యక్తిత్వం అరు ఉండాలి.
ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మానమవ సాదయేత్/ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః
ఇలా గిక వ్యక్తిత్వాన్ని గరించి పలు తెరగుల చెపుతూ ఆరవ అధ్యాయంలోని నలభై ఆరవ శ్లోకంలో-
యోగితాపసుల స్థాయిని దాటిన వాడు, జ్ఞానుల కంటే గొప్పవాడు, కర్మనిష్ఠుల కంటే ఉన్నతుడు..
అంటూ కాబట్టి యోగి కావటం మానవ అవతార రహస్యం అంటాడు పురుషోత్తమ యోగి అయిన కృష్ణుడు.
ఇన్ని మాటలెందుకు చైతన్యా! నా ఉద్దేశంలో దేవతలైనా, దైత్యులైనా కర్మరహితులు కావాలంటే యోగ మార్గాన్ని అనుసరించవలసిందే. ఈ వ్యక్తీకరణను మనం కృష్ణుడి ద్వారా గీతలో వింటాం’ నా వివరణ సాగుతోంది.
ఇంతలో-
‘అవును గురువుగారూ, మీరు అన్నట్టుగా విశ్వరూప దర్శనా సందర్భంలో కృష్ణుడు విశ్వం అంతా తనలోదే అంటాడు కదా.. అంటే..’ అంటూ చైతన్య అర్థోక్తి.
‘యస్ చైతన్యా! ఇక్కడ వ్యాసుడు చాల జాగ్రత్తగా కలం పట్టాడు.. తాను సృజిస్తున్న మహాభారత కథనం నుండి కాస్తంత తప్పుకుని, తాను కథకుడిగా కాక అసలు సిసలు యోగిగా భగవద్గీతను మన ముందుంచాడు. అంటే తన యోగావిజన్ ప్రకారం విశ్వానికి ప్రతీకగా మానవ అవతారానికి మించిన సర్వోత్కృష్ట తత్వాన్ని కృష్ణ రూపంలో మన ముందుకు తెచ్చాడు. అంటే, విశ్వ వేదికను కృష్ణవేదిక చేశాడు. అందుకే గీతలో కృష్ణుడు మంచిలోను చెడులోను, పాపంలోను పుణ్యంలోను, దేవతలలోను దైత్యులలోను ఉన్నది తానే అంటాడు. అంటే విశ్వంలోని పలు అంశలే కృష్ణుడిలోని బహుముఖాలన్న మాట. నిజానికి, భగవద్గీత గిక గీతగా వ్యాస వేదిక.
గికంగా వ్యాసడు చెప్పదలచుకున్నది నాలో, నీలో, మనందరిలో, కనిపించే ఖగోళంలో, కనిపించని సృష్టిలో సైతం ఉన్నవన్నీ విశ్వాంసలే అని. వీటికి మూర్త రూపమే కృష్ణుడు.. విశ్వరూపమూను. దీన్ని తెలియజెప్పటానికే వ్యాసుడు అక్షరీకరించిన విశ్వరూప దర్శన సృజన. సత్‌చిత్ ఆనంద సత్య ఆవిష్కరణే ఆ విశ్వవేదిక.
ఆ విశ్వవేదికపైన మనది మానవ అంకం.. ఈ మానవ అవతరణ నుండి కాస్తంత సద్గతి పొందినవారే అవతార పురుషులు. మన దృష్టిలో వారు దేవతలు.. వారు ఆరాధింపబడుతుంటారే తప్ప ఋషితుల్యులు కాలేరు. నిజానికి ఋషులు దేవతల కంటే ఎన్నో మెట్లు పైనున్నవారు. ఆ ఋషిత్వం కొరకే యోగం.. ఆ యోగ సిద్ధిని పొందటానికే పురుషోత్తమ యోగం.. అదే యోగ సిద్ధి.
చూడు చైతన్యా, కృష్ణుడు ఏమంటున్నాడో -
మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే/ యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః
కోటానుకోట్ల మానవ అవతారులలో వేయి మందిలో ఒకరు సిద్ధత్వం కోసం ప్రయత్నిస్తూ యోగ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటే - యోగంలో నిలదొక్కుకునేది లక్షలో ఒకరు. యోగ సిద్ధిని పొందేది కోటికి ఒకరు, యోగప్రజ్ఞా మూర్తులయ్యేది కొన్ని కోట్లలో ఒకరు. అటువంటి ప్రజ్ఞామూర్తులే విశ్వాన్ని తమలో పొదువుకోగలరు.. తామే విశ్వప్రజ్ఞగా మూర్త్భీవించగలరు.
కృష్ణుడు తనను తాను యధాతథంగా తెలుసుకోగలగాలి అనటంలోని అర్థం ఇదే. అంటే, విశ్వం ‘పర’... ఎనిమిది అంశలుగా విడివడ్డ విశ్వమే ‘అపర’. ఈ అపరను పరంగా పరిణమింప చేయటమే యోగం. అంటే, అపర పరల సంయోగమే యోగం. కాబట్టి పురుషోత్తమ యోగం విశ్వ ప్రతీకగా పలికించటానికి వ్యాసుడికి కృష్ణుడు వాచ్యమయ్యాడు.
చిన్ననాట తల్లి యశోదమ్మకు తన నోటిలో విశ్వాన్ని చూపినట్లుగా పెద్దతనంలో అర్జునుడికి తన మూర్తిమత్వంలో విశ్వతత్వం చూపించాడు. అంతా తానే అని, తాను అంటే విశ్వమే అని అక్షర ప్రబంధమయ్యాడు.

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946