S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సంకురాత్రి నానీలు

గ్రామాల మాటేమిలే
పట్టణాల్లో
అపార్ట్‌మెంట్ల ముందు
ఒక్కటే ‘ఉమ్మడి’ ముగ్గు!

డూడూ బసవన్నల
ఊరేగుడే గానీ
‘రా..రా’ అని
పిలిచేవారేరి?!

చేతుల్లో
మొహిందీ మచ్చలు
‘కొరియర్లో’
గొబ్బెమ్మల అచ్చులు!

పిల్లాడు సెల్లాడ్తూ
పీట మీద
భోగిపండ్లకు బదులు
‘కుర్‌కురేలు’ నెత్తిమీద!

పేరంటాలంతా
పిలవగనే వచ్చారు
ఎనె్నన్ని సెల్లుఫోన్లో
‘బొమ్మల’ కొలువులో!

-యన్.కె.నాగేశ్వరరావు 9030360988