S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భూతాపంతో మరింత ముప్పు (విజ్ఞానం)

భూతాపం పెరిగిపోవడం పర్యావరణ అసమతుల్యత ఏర్పడి ఎన్నో కష్టనష్టాలు ఎదురవుతున్నాయని అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే రెండు దశాబ్దాల్లో అకస్మాత్తుగా వరదలు వెల్లువెత్తడం, ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోవడం సాధారణమైపోతుందని తాజాగా ఒక అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా అమెరికా, ఇండియా, ఆఫ్రికా, మధ్యఐరోపా దేశాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యే ప్రమాదం ఏర్పడబోతోందని వారు చెబుతున్నారు. జర్మనీలోని పాట్స్‌డమ్ ఇనిస్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ (పిఐకె)కు చెందిన శాస్తవ్రేత్తలు చేసిన పరిశోధనల్లో ఈ విషయాలను గుర్తించారు. 2040లోగా వరదముప్పు ఉన్న ప్రాంతాల్లో ఆ పరిస్థితుల నుంచి కాపాడటానికి తీసుకోవలసిన చర్యలను వారు అంచనా వేశారు. ఏఏ ప్రాంతాల్లో ఈ ముప్పు ఎదురుకాబోతోందో వారు విశే్లషించారు. నిజానికి వరదలు, ప్రకతి వైపరీత్యాలనుంచి రక్షణకు చర్యలు తీసుకోవలసిన దేశాల్లో మొదటి స్థానంలో అమెరికా ఉంది. భారత్, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలతోపాటు ఇండోనేషియా, మధ్య ఐరోపా దేశాల్లో వరద నివారణ, రక్షణ చర్యలు పెద్దఎత్తున తీసుకోవలసిన అవసరాన్ని వారు గుర్తించారు. ఒకవేళ అలాంటి చర్యలు తీసుకోని పక్షంలో ఆయా దేశాల్లో లక్షలాది మంది తీవ్రంగా నష్టపోతారన్నది వారి అంచనా. అమెరికాలో ప్రస్తుతం ఉన్నవారిలో సగానికి సగం మంది ప్రకృతి వైపరీత్యాలు, వరదల నుంచి రక్షణకు ఇప్పుడున్న ఏర్పాట్లను కనీసం రెట్టింపు చేసుకోవలసి ఉంటుందన్నది వారి అంచనా. నాటకీయంగా, హఠాత్తుగా వచ్చే నదుల వరదల ముప్పును సమర్ధంగా ఎదుర్కోవడానికి ఇలా చేయక తప్పదన్నది వారి హెచ్చరిక. సైన్స్ అడ్వానె్సస్ జర్నల్‌లో ఈ మేరకు పరిశోధన ఫలితాలను వెల్లడించిన పరిశోధక బృందం సారధి స్వెన్ విల్‌నర్ వివరించారు. నదుల నీటి నిర్వహణ, డైక్స్‌ను మెరుగుపరచడం, నిర్మాణాల తీరుతెన్నుల్లో ఆధునికత, పునరావాస చర్యలు చేపట్టడం అవసరం. లేనిపక్షంలో కనీసం పదిశాతం మంది వరదముప్పునుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. ఉత్తర అమెరికాలో ఇలా రక్షణ చర్యలు చేపట్టని పక్షంలో వచ్చే రెండు దశాబ్దాలలో బాధితుల సంఖ్య 0.1 నుంచి 1 మిలియన్‌కు చేరుకుంటుంది. దక్షిణ అమెరికాలో వరదల వల్ల నష్టపోయేవారి సంఖ్య కనీసం 6 నుంచి 12 మిలియన్లుగా ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. ఆఫ్రికాలో 25 నుంచి 35 మిలియన్లు, ఆసియాలో 70 నుంచి 156 మిలియన్ల మంది ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకుంటారని వారు చెబుతున్నారు. నిజానికి ఇవి కేవలం ఇప్పుడున్న జనాభా మేరకు అంచనాలు మాత్రమే. జనాభా పెరుగుదలను బట్టి ఈ సంఖ్యల్లో కూడా పెరుగుదల ఉంటుంది. వివిధ మార్గాల నుంచి సేకరించిన వివరాలు, ఇప్పటివరకు సేకరించిన గణాంకాల ఆధారంగా విశే్లషణలు చేశారు.

-ఎసకెఆర్‌