S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రచయిత కావాలంటే...

రచయిత కావాలనే నీ ఉత్సాహం నాకు అర్థం అయింది
కాని అది అంత ఈజీ కాదు మిత్రమా!
ప్రతీ పెద్ద మనికీ ఒక గమ్యం, ఒక ప్రణాళిక ఉంటుంది; స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది
ఎక్కడ మొదలుపెడితే ఏ దారి వెంట వెడితే మనం గమ్యం చేరతామో ఆలోచించాలి
ఇవన్నీ ఉన్నవాణ్ని ప్రొఫెషనల్ అంటారు; లేనివాడిని కాదంటారు.
మోడరన్‌గా ఉండమనీ, ఏదో అందామనీ
అస్పష్టపు ఆలోచనలతో కలగాపులగపు వర్ణనలతో
అస్తవ్యస్తపు సన్నివేశాలతో నిద్రపోతున్న పాత్రలతో
ఎందుకు బాధిస్తావు, ఎందుకు బాధ పడతావు
మరయితే ఏం చెయ్యాలి
నీకు మనుషుల మీద ఎనలేని ఆసక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి
వాళ్ల గుండె లోతుల్లోకి తొంగి చూడగలగాలి
పాఠకుడితో మొదలుపెట్టి పాఠకుడితో ముగించాలి
పాఠకుడికి ఏం కావాలో అన్న ఆలోచన నిరంతరం నీ మనసులో పని చెయ్యాలి
కస్టమర్ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ఏ వ్యాపారమైనా నడుస్తుందా? అతను రాజు కదా?
ఎవరైనా నీ మాటలు ఎందుకు వినాలి; నీ గురించీ, నీ సందేశం గురించీ తెలుసుకోడానికి కాదూ?
ప్రతి చిత్రణకి ఒక ఔచిత్యం ఉండాలి, ప్రతి పాత్ర జీవంతో తొణికిసలాడాలి
నీకు తెలిసిన విషయాన్ని, నీ అనుభూతుల్ని
పచ్చి నిజాన్ని నిక్కచ్చిగా, సూటిగా, నిజాయితీగా చెప్పగలగాలి
ఆవేదన, ఆవేశం, ఆనందం, కోపం, దుఃఖం లాంటి ఎమోషన్స్ ఉండాలి
మాటలు ఎమోషన్‌తో జతచేస్తే వాడిగా, వేడిగా, లోతుగా చొచ్చుకుపోతాయి
పరిస్థితిని బట్టి మాటల్లో మెత్తదనం, పదునూ ఉండాలి
సంభాషణలు గుండెకు హత్తుకోవాలి: మెటాఫర్లు, అనాలజీలు, ఉపమానాలు ఉండాలి
ఆశ్చర్యం కలిగించే అనూహ్యమైన పరిణామాలు ఉండాలి. కఠిన నిర్ణయాలు ఉండాలి
సమస్యలతోపాటు పరిష్కారాలు, మార్పు తెచ్చేవై ఉండాలి
మంచితనం, మానవత్వం, సంవేదన, ఆప్టిమిజం, పెసిమిజం
జయం, అపజయం; ఆనందం, దుఃఖం అన్నీ కవితామయమేనోయి
జీవితం అందించే అనేక అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకి సాగాలనే తపన ఉండాలి
పెద్దపెద్ద కలలుండాలి. వాటిని జోరుగా విడుదల చేసే సృజనాత్మకత ఉండాలి
అందం, ఆనందం, క్షమాగుణం, టాలరెన్స్ అంతర్లీనంగా
తనదంటూ సొంతమని చెప్పుకోదగ్గ ఒక శైలి స్థాపించుకోవాలి
సిద్ధమేనా మిత్రమా?

డి.యస్.యస్.రామం 9848726817