S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రోగ్రెస్ రిపోర్ట్

మనమింకా
భుజాలపై శవాలను మోస్తున్నాం
బతుకుల్ని అమ్మేసి
చావుల్ని కొని తెచ్చుకొంటున్నాం
అవసరాలను కుదువబెట్టి
ఆత్మహత్యల్ని ఆశ్రయిస్తున్నాం
స్వేదాన్ని కట్టబెట్టి
వేదనను వెంట తీసుకెళ్తున్నాం
కాలం చెల్లిన కష్టాలను నమ్ముకొని
కాలానికి ఎదురీదుతున్నాం.
* * *
ఏడు పదుల స్వాతంత్య్రం
ఏడిపిస్తూనే ఉంది
డెబ్బైఏళ్ల రాజకీయం
స్వభుజాలను తట్టుకొంటూ
వెకిలి నవ్వులు నవ్వుతూనే వుంది
* * *
‘బాధితులను ఆదుకొంటాం
వైఫల్యాలను అధిగమిస్తాం
ప్రజా బాహుళ్యాన్ని సంరక్షిస్తాం’
ఓ యధాలాప వృధా రాజకీయ ప్రేలాపన
సవరించడానికో సరిదిద్దడానికో
ఇవేమైనా పుస్తకాల్లోని పిచ్చిగీతలా
అధికారానికి అప్పగించిన వాళ్ల తలరాతలు
కుదుళ్లు కనిపిస్తాయి
అయినా ఆకులనే తడుపుతారు
చీకట్లో మెరిసే గణాంకాలే తప్ప
ఇచ్ఛగించని వాస్తవ ధనరేఖల గుర్తింపులు.
* * *
గురువు సమాజాన్ని నిర్మించగలడు
నాయకుడు జాతిని మలచగలడు
సంస్కర్త సమాజాన్ని బాగుచేయగలడు
సమసమాజాన్ని పాలకుడే తయారుచేయగలడు
ప్రజాస్వామ్య ఒడిలో
ప్రభుత్వాల వైఫల్యపు ప్రగతి పత్రాలు
కట్టె ఒంపును పొయ్యి తీర్చినట్లు
నేర్వని ప్రభుత్వాలకు
ప్రజలే నేర్పాలి గుణపాఠాలు.

-కె.రవీంద్రబాబు 9052778988