S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆయనకే సొంతం

చతురతతో గోపాలం గారు చెప్పిన చాయోపాఖ్యానం కమ్మని టీ తాగినంత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ చతురత ఆయనకే సొంతం. వినేవారి చెవుల్నిబట్టి నాదంతో పాట పాడి మెప్పించిన ఘనులు ఓలేటి వెంకటేశ్వర్లు, మహమ్మద్ రఫీ గార్ల విశేషాలతో ‘అమృతవర్షిణి’ అమృతం కురిపించింది. మన దేశంలో వామపక్షీయులు మొదటి నుంచి ఇక్కడి చరిత్ర, సంస్కృతిలపై దాడి చేస్తూనే ఉన్నారు. రామసేతువులో కోత పెట్టాలన్న వారి ప్రయత్నాలు సాగనివ్వరాదు. ఇక - ప్రపంచానికి టీని పరిచయం చేసింది చైనా అని తెలుసు. కాని చైనాలో టీని ‘చా’ అంటారని ఇప్పుడే తెలిసింది. చాయ్, చా లు హిందీ మాటలనుకునేవాళ్లం.
-ఆర్.సత్య (కరప)
రుచి మారదు
గ్లాసుడు నీళ్లలో దోసెడు ఉప్పు వేస్తే ఆ నీళ్లు చేదుగా ఉంటాయి. అదే ఉప్పు చెరువులో వేస్తే నీటి రుచి మారదు. గ్లాసుడు నీళ్ల మాదిరిగా ఉండాలా? చెరువు మాదిరిగా ఉండాలా? అని ప్రశ్నించి మంచి నీతి చెప్పిన ‘ఓ చిన్న మాట’ బహు బాగుంది. కూలి వాని కుమారుడు యదుకృష్ణ దేవాలయ అర్చకుని స్థాయికి ఎదిగి ఆపై సంస్కృతంలో రీసెర్చ్ చేసే స్థాయి అందుకోవడం ముదావహం. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నది పరమ సత్యం. నిన్నటి నీతి, నేటి రీతి, మరి రేపు ఎలా మారుతాయన్న భీతిని కలిగించిన కవిత బాగుంది.
-ఎస్.సంపూర్ణ (సాంబమూర్తినగర్)
సేతువు - హేతువు
పంచ్‌పాళీలో ‘రాముని కొరకై..’ పద్యం సాహతీ ప్రియులైన పాఠకులను అలరించింది. సేతువు - హేతువు చిత్రాలు మనస్సును రామాయణ కాలంలో విహరింపజేశాయి. తర్కానికి అందని అద్భుతాలు ప్రతి కాలంలోనూ జరుగుతాయి. వారధి నిర్మాణం అంతే. తలపుల పెట్టె కవి పాఠకుల ఆలోచనా పరంపరలను వెలికితీస్తే, ‘మోయలేక పోతున్నారు’లో పిల్లల విద్యా వ్యవస్థలోని లోపాలను ఎండగట్టింది. గోపాలంగారి ‘చాయోపాఖ్యానం’ ఉత్తేజపరచింది. రఫీ, ఓలేటి గారల గాన జీవిత వివరాలు సంగీత విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తాయి. రామసేతు కోతపై పార్వతీశం గారి అభిప్రాయాలు శిరోధార్యం. శేషారత్నం చేసిన ‘ప్రయోగశాల’ పరీక్షా విధానం మెచ్చతగ్గది. ‘గజదొంగ’ను మల్లాది మూలంలోని భావం చెడకుండా చక్కగా అనువదించి అందించారు. ధన్యవాదాలు.
-డా.శివభూషణం (కర్నూలు)
భలేగా ఉంది
విదేశీ క్రైం కథల్లో ఇతివృత్తాలు కొత్తగా ఉండి అలరిస్తున్నాయి. ఈ వారం ‘గజదొంగ’ కతలో పోలీసు అధికారి వస్తువుల్ని అతని అత్తగారే క్రమక్రమంగా దొంగిలించడం అనే సున్నిత అంశాన్ని పరిష్కరించిన విధానం భలేగా ఉంది. రసాయనాలు కలిపిన మాయిశ్చరైజర్లు ఎప్పటికైనా ముప్పు తెస్తాయని చెప్తూ చర్మ పరిరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి డా.పూర్ణచందు గారు చెప్పిన సలహాలు ఉపయుక్తంగా ఉన్నాయి. రామాయణ గాథల్లో కొన్ని తప్పులను జొప్పించి వాటిని కనిపెట్టమని అడగడం బావుంది. ఈ విధంగానైనా రామాయణాన్ని తెలుసుకునే అవకాశం ఉంది.
-పి.ఎస్.లక్ష్మి (బృందావనం)
ఇదిగో సేతువు...
‘ఇదిగో సేతువు.. అదిగో హేతువు’ కవర్‌పేజీ కథనం చాలా ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. సుమారుగా ఎనభై మైళ్ల వెడల్పుతో, ఎనిమిది వందల మైళ్ల పొడవున ఈ వంతెన నిర్మింపబడినట్లు వాల్మీకి రామాయణం వల్ల తెలుస్తోంది. ఇది వాస్తవమేనని, రామసేతువు సహజసిద్ధంగా ఏర్పడినది కాదు, ఇది మానవ నిర్మితమని అమెరికా శాస్తవ్రేత్తలు, ‘వాట్ ఆన్ ఎర్త్’ స్పష్టంగా చెబుతున్నా పుక్కిటి పురాణం అంటున్న వాళ్లను ఏమనుకోవాలో?
-వాడపర్తి వెంకటరమణ (గొల్లలవలస)
ఆనందం
మనం ఉప్పు మాదిరిగా ఉండాలి. అప్పుడే మన చుట్టూ అందం, దానితో బాటు ఆనందం విస్తరిస్తుంది అని చెప్పిన సండే గీత సమంజసమే. అయితే ఉప్పు ఎక్కువైతే ముప్పు తప్పదన్నది నేటి గీత. ఉప్పుతోబాటు బీపీ పెరిగి అనర్థానికి దారి తీస్తుందన్న భయం ఉంటుంది. నేషనల్ జియోగ్రాఫిక్ సంస్థ నిర్వహించిన ఫొటోల పోటీలో గెలిచిన ఫొటోలు అద్భుతంగా ఉన్నాయి. ఉద్యోగాలు, సంపాదన, రాజకీయ ఎత్తుగడల్లో పోటీ! మదుపర్లకు పోటీ! కానీ పోటీ లేనిదల్లా మంచితనం పెంచడానికి అన్న కవిత స్ఫూర్తిమంతంగా ఉంది. ‘బతుకు భయం’ కవిత మమ్మల్ని అలరించింది.
-జె.్ధర్మతేజ (గొడారిగుంట)
అభిమతం
కోచిలో చిన్నపాటి టీ స్టాల్ నడుపుకునే విజయన్ అనే వృద్ధుడు ప్రపంచమంతా చుట్టి రావాలన్న తీవ్రమైన తపనతో భార్యతో సహా బయలుదేరి తన అభిమతాన్ని సాధించడం గొప్పగా ఉంది. ఎంతో కఠిన పరిశ్రమ, వ్యాయామాలతో శరీరంలోని కొవ్వు తగ్గించుకోవచ్చని భావిస్తాం కాని ఒక మోస్తరు వ్యాయామం, పిండి పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే కొత్తగా కొవ్వు పేరకపోగా ఉన్న కొవ్వు తగ్గుతుందని కనిపెట్టడం ఒక అద్భుత విజయం. ‘చావుకళ’ కథలో విష్ణుశర్మకు ముందే చావు గురించి తెలియడం, అందువల్ల కలిగిన అనుభవాలు బాగున్నాయి.
-ఎ.సౌందర్య (కాకినాడ)
మానవ నిర్మితం
రామసేతు మానవ నిర్మితమే అని నొక్కి వక్కాణించే వారిని హేళన చేస్తూ డిఎంకె నేత రాముడు ఎక్కడ ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడు? అని ప్రశ్నించాడు. ఆయన పురాణ జ్ఞానం ఏ పాటిదో తెలియదు కానీ ఇప్పుడు శాస్ర్తియంగా సాధికారతతో నిరూపించబడటంతో వామపక్షాల వాదన చెదిరిపోయింది. ఈ విషయాన్ని విశదీకరించిన కవర్‌స్టోరీ ఎనలేని తృప్తినిచ్చింది.
-బి.ప్రభాస్ (గాంధీనగర్)