S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నీళ్లు తాగకుండా ఉండలేవు!

గుర్రాలు, గాడిదలకు దగ్గరి బంధువైన జీబ్రాలకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ రెండు జాతులను పెంచుకుని మనకు నచ్చినట్లు వాటితో పనులు చేయించుకోగలం. కానీ జీబ్రాలను అలా చేయలేం. సహజంగా అవి అడవుల్లో పెరగడంవల్ల అవి జనసామాన్యానికి అలవాటు పడలేదు. జీబ్రాలు నల్లని మేనితో ఉంటాయన్నది శాస్తవ్రేత్తల విశ్వాసం. వాటిపై తెల్లనిచారలవల్ల జీబ్రా అలా కనిపిస్తుందట. ఈ చారల సంఖ్య, వెడల్పు దేనికి దానికి ప్రత్యేకంగా ఉంటాయన్నమాట. మన వేలిముద్రల్లా.. జీబ్రాలు నీళ్లు లేకుండా మనుగడ సాగించలేవు. రోజుకు కనీసం ఒక్కమారైనా అవి నీళ్లు తాగాల్సిందే. అందుకే నీటి సదుపాయాలున్న చోటుకు అవి వలస వెడుతూంటాయి. ఇవి గంటకు 35 మైళ్ల వేగంతో పరుగుపెట్టగలవు. అప్పుడే పుట్టిన జీబ్రా కూన ఏకధాటిగా గంటపాటు పరుగుపెట్టే శక్తి కలిగి ఉంటుంది. పరుగుపెట్టగలదు కూడా! అన్నట్లు ఇవి నిలబడే నిద్రపోతాయి.

- ఎస్.కె.కె. రవళి