S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కొత్త వస్తువులు, కొత్త పనిముట్లు

సాంకేతిక యుగంలో ఎన్నో కొత్త పరికరాలు, పనిముట్లు. ఈ పనిముట్లతో ఎన్నో సౌకర్యాలు. మరెన్నో అసౌకర్యాలు.
స్మార్ట్ఫోన్లు వచ్చిన తరువాత మనుషుల ప్రవర్తన పూర్తిగా మారిపోయింది.
వాట్సప్‌లు, టెలిగ్రామ్‌లు, ట్విట్టర్లు, సోషల్ మీడియాలో చాట్స్. ఇట్లా వాటిల్లో పూర్తిగా మునిగిపోతున్నారు. వాట్సప్‌లలో ఎన్నో గ్రూప్‌లు. అందులో ఎన్నో బొమ్మలు, వీడియోలు.
ఇలా అందరూ కొట్టుకొని పోతున్నారు.
ప్రక్కవాడితో సంబంధం అవసరం లేదు. ఎక్కడో వున్నవారితో చాటింగ్‌లు. ఆ వ్యక్తి దగ్గరికి వస్తే కూడా మాట్లాడలేని పరిస్థితి.
ఒక్కసారి స్మార్ట్ఫోన్‌ని పక్కనపెట్టి జీవితంలో యాక్టివ్‌గా ఉంటే ఎంత బాగుండు అని అన్పిస్తుంది.
ఫోన్ పక్కనబెడితే పక్కన వున్న వాడితో మాట్లాడవచ్చు.
ఎదురుగా ఏమి ఉందో కన్పిస్తుంది.
మనకు మార్గాన్ని నిర్దేశించే వ్యక్తులు కన్పించవచ్చు.
మనం ఎవరికన్నా మార్గనిర్దేశనం చేయవచ్చు.
స్నేహితులకి కాగితం మీద కలలతో ఉత్తరం రాసి ఎన్నాళ్లైంది?
మనకు పుస్తకం పంపిన రచయితకి ఫోన్‌లో కాకుండా ఉత్తరం ద్వారా అభిప్రాయం చెప్పి ఎంత కాలమైంది?
కంటి కంటికీ మధ్య చూపు లేక మరెంత కాలమైందీ?
ఇతరులు నోటితో చెప్పే కథలు విని ఎన్నాళ్లైంది.
మనం అలాగే కథలు చెప్పి ఎంత కాలమైందీ?
మనలోకి మనం తొంగి చూసుకొని బహుశా చాలాకాలం అయి ఉంటుంది.
నిశ్శబ్దంగా ఈ ప్రపంచాన్ని చూస్తూ ఇప్పటికే చాలాకాలం గడిపి ఉంటాం.
కొత్త పనిముట్లు పరికరాలు మనలని నిష్క్రియాపరులుగా చేస్తున్నాయి.
ఈ ప్రపంచానికి కావల్సింది చురుకుగా ఉండే వ్యక్తులు.
కొత్త వస్తువులు కొత్త పనిముట్లు మన అదుపు ఆజ్ఞలో వుండాలి. అంతేకానీ వాటి అదుపు ఆజ్ఞలో మనం వుండకూడదు.
ప్రతి కొత్త వస్తువు ఉపయోగకరమైందే!
ఉపయోగించుకునే పద్ధతి మీద ఆధారపడి ఉంది.

- జింబో 94404 83001