S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆది విభూతుల సంసార యోగం

‘భగవద్గీతలో విభూతి యోగం అంటూ ఒక అధ్యాయం ఉంది కదా! నుదుట విభూతి పెట్టుకుని ధ్యానం చేయటమే విభూతి యోగమా?’ చైతన్య ప్రశ్న.
‘గుడికి వెళ్లి విభూతి పెట్టుకుంటే భక్తి మార్గం, ఆశ్రమానికి వెళ్లి విభూతి పెట్టుకుంటే యోగ మార్గం అవుతుందా చైతన్యా? మనలోని వ్యక్తావ్యక్త చైతన్యావిష్కరణకు వభూతి ధారణ కొలమానం కాదు కదా? అసలు విభూతితో కనిపిస్తే దేవళానికి వెళ్లి వచ్చినట్లు, పూజా పునస్కారాలు ముగించుకుని వచ్చినట్లు అనుకుంటే ఎలా? విభూతి ఒక గుర్తింపు చిహ్నమైతే ఎలా చైతన్యా?!’ ప్రశ్నకు ప్రశ్న సమాధానం అన్నట్టుగా నేను.
‘మరి, విభూతి దైవ ప్రసాదితం కదా! దేవుడి విభూతి పెట్టుకుంటే, ఆ భవగంతుడు మన కోరికలన్నీ విని, మనకు వరాలిస్తాడంటారు కదా!’ చైతన్య.
‘ఇంకా ఏ రాతి యుగంలో ఉన్నావు చైతన్యా! ఒకపక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విశ్వవీధుల్ని చేరుతుంటే, రోబోలు మనకు ప్రత్యామ్నాయాలు అవుతుంటే మన బుద్ధులం కావలసింది పోయి ఇంకా పాత వాసనలతోనే మగ్గిపోతుంటే ఎలా?’ నేను.
‘ఏమో గురువుగారూ! గుడికి వెళ్లి విభూతి పెట్టుకోకపోతే ఏదో పొరపాటు జరిగిపోయిందని అనుకునేవాళ్లని నేను చిన్నప్పట్నించీ చూస్తున్నా. నేను యోగంలో చేరి పదేళ్లయింది. మన యోగసాధకులలోను విభూతి పెట్టుకోకపోతే ఏదో అపరాధం జరిగినట్లు ఫీలవ్వటాన్ని చూస్తున్నాను’
‘నిజమే చైతన్యా! మనం యోగ మార్గంలోకి వచ్చాక కూడా ఇంకా సంప్రదాయ మార్గాల నుండి విడివడలేక పోతున్నాం. అందుకే మహాత్ముల, మహర్షుల పటాలకి మొక్కటాలు, దండలు వెయ్యటాలు, ధూపదీప నైవేద్యాలు, విభూతి ధారణలు తగ్గటం లేదు. ఈ బాడీ నుండి, మైండ్ నుండి దూరం జరగలేక పోతున్నాం. అందుకే భగవద్గీత విభూతి యోగాని కంటే ముందుగా విజ్ఞాన యోగాన్ని ప్రస్తావించింది. ఆ విజ్ఞాన యోగంలోనే బుద్ధియోగాన్ని గురించి చెప్పటమూ జరిగింది. అంటే మన బుద్ధులం అయితే తప్ప విజ్ఞానులం, యోగులం కాలేము అనేగా! కాబట్టి బుద్ధి కూడా యోగ విభూతే! విజ్ఞానమూ యోగ విభూతే!!
* * *
బుద్ధియోగంతో ముందుగా ఎరుకకు రావలసింది ‘ఆది’తత్వం. ఈ ‘ఆది’ స్థితి ‘్భతి’. అవ్యక్తమైన ఆదిని కేంద్రంగా చేసుకుని విలసిల్లే విశ్వవ్యాప్త దృశ్యమానమంతా ‘విభూతి’. నిజానికి విభూతిలోని అదృశ్య అస్తిత్వమే ఆది. భూతి విభూతిగా పరిణమించటమే విశ్వ పరిణామం. విశ్వ ఆవిష్కరణలన్నీ విభూతులే!
మనది ఆత్మ తత్వమైతే విశ్వానిది ఆదితత్వం. మన ఆత్మ అరూపమే అయినా దేహ సంబంధిగా మనది అని అనిపిస్తుండటం వల్ల ఆత్మని ఇహానిదే అంటే భౌతిక సంబంధిగానే పరిగణిస్తుంటాం. ఇక ఆదితత్వం అదృశ్యంగా పరం అని అనిపిస్తుండటం వల్ల ఆ ఆదితత్వాన్ని పరమాత్మ అంటున్నాం.
ఆది తత్వం భూతి కావటంతో ఆధ్యాత్మికంగా విభూతిని ఆజ్ఞాచక్ర స్థానంలో ధరించి ఆ ఆదితత్వాన్ని ఆచరంలో ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. దివ్య పరిణామంలో మన భాగస్వామ్యాన్ని సూచించేది విభూతి ధారణ. అదీ విభూతి ధారణ అంతరార్థం.
దివ్యత్వాన్ని ఈ మానవ తత్వానికి జతచేసి దివ్య జీవనం సాగిస్తామని చేసుకునే ఒప్పందమే విభూతి ధారణ. నుదుట విభూతి ఉందంటే అధ్యాత్మ, పరమాత్మ తత్వాలను సంయోగింప చేస్తున్నట్లే! ఆ సంయోగ విశిష్టత తెలీనినాడు విభూతి ధారణ కూడా ఒక వేషధారణలా సాధారణమై పోతుంది.
విభూతి ధారణలోని అద్వితీయ తత్వం తెలిసిన వారికి ఆ ‘విభూతి’ బాహ్యధారణ కాక అంతరంగ ధారణ అవుతుంది. అంటే, అంతరంగాన్ని అధివసించిన ఆత్మతత్వమే ఆదితత్వ ప్రకటిత విభూతి యోగం అన్నమాట.
* * *
భగవద్గీతలో ‘విభూతి యోగం’ పదవ అధ్యాయంలో పరివ్యాప్తమై ఉన్నప్పటికీ అది సప్తమాధ్యాయమైన విజ్ఞానయోగంలో కొంతమేర ప్రస్తావింపబడింది. విజ్ఞానయోగ అధ్యాయంలోని తొలి శ్లోకంలోనే యోగేశ్వరుడైన కృష్ణుడు-
‘మ య్యాసక్త మనాః’ మనస్సును తనపైనే లగ్నం చేసుకోమని, తనపైనే ఆసక్తిని పెంపొందించుకుని ఉండమని, మరో దృష్టి లేకుండా తననే ఆశ్రయించి ఉండమని అంటాడు.
‘యోగం యుంజన్మదాశ్రయః’ - కేవలం ఆశ్రయించి ఉండటమే కాక యోగాభ్యసనంలో ఉండమనీ, నిత్యయోగ సాధనలో ఉండగలగటం వల్లనే అనంత యోగ సాధనా ఫలితంగా పరిపూర్ణ యోగతత్వమైన ఆదితత్వం అంది వస్తుందనీ అంటాడు - అర్జునుడితో.
అంటే, నిశే్శష యోగ ప్రజ్ఞను యోగసాధకుడైన అర్జునుడికి అందించే ప్రయత్నం ప్రారంభించాడన్న మాట! అందుకే ఈ అధ్యాయం ‘విజ్ఞానయోగ’మైంది. మన యోగసాధనా ‘విభూతి యోగం’గా పరిణమించి, పరిఢవిల్లాలంటే విజ్ఞానం కొమ్మలు చాచాల్సిందే!
* * *
‘భూతి’గా అంటే అదృశ్య ‘సత్’గా ఉండే ‘ఆది’తత్వ ప్రకృతి మట్టి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం అని ఎనిమిది ప్రకృతులుగా ప్రకటితమైంది. ఈ అష్టవిధ ప్రకృతులూ అష్టవిధ విభూతులే! ఈ ఎనిమిది ప్రకృతులు వివిధ రీతుల సంయోగం చెందుతూ రూపాంతర ప్రకృతిలో భోగసంపదగా అంటే భోగ్య వస్తువులుగా పరిణమించి మానవ తత్వానికి భోగ సంస్కృతిని జత చేస్తున్నాయి. ఒక విధంగా ఈ భోగ సంస్కృతి మాయా ప్రకృతి. ఫలతృష్ణ మూలం ఈ భోగలాలసతే. ఫలితంగా, కర్మ ఫలితాలను ఆశించటమూ, కర్మబద్ధులం కావటమూ ఈ భోగ సంస్కృతితోనే.
ఇలా మనది ‘స్వభావ’ ప్రకృతి అవుతుంటే ఆది తత్వానికి ‘స్వరూప’ ప్రకృతి అవుతోంది. ఈ ఆదితత్వం అందివస్తే తప్ప గికంగా స్వస్వరాప దర్శనం సాధ్యం కాదు. ఇంకా గికంగా చెప్పుకోవాలంటే స్వభావ ప్రకృతి వన పాంచభౌతిక దేహానిది. అయితే స్వరూప ప్రకృతి ఆదితత్వ విలసిత ఆత్మది. అందుకే భోగసంపన్నతను అందించే స్వభావ ప్రకృతి ‘అపరా ప్రకృతి’ అయితే యోగ సంపన్నతను కలిగించే స్వరూప ప్రకృతి ‘పరాప్రకృతి’ అయింది. ఇలా చూసినపుడు మన అంతస్సౌందర్యమే స్వరూపసీమ.. బాహ్యాడంబరతే స్వభావ సీమ. స్వభావం నుండి విడివడి స్వరూపాన్ని చేరుకోవటమే ఆది స్థితిలో సంయోగించటం ఆ సంయోగమే యోగం.
అన్నట్టు, గికంగా చెప్పుకునే ‘సత్’ అనేది భాతి. ఈ సత్ లేనిదే ఈ విశ్వానికి ఉనికి లేదు.. ఈ విశ్వ ఉనికికి, అంటే ఆది అయిన సత్‌కు ఉత్కృష్టమైన అస్తిత్వాన్ని అందించగలది విభూతి. ఈ విధంగా చూస్తే విభూతి ధారణ అనేది యోగపరంగా ఒక సూప్రా లెవల్‌ను ప్రతిబింబించేదే తప్ప అలంకారప్రాయంగా నిలిచేది కాదు.
‘ఉపదేశ’ సమయంలో గురువు శిష్యుడి రెండు కనుబొమల మధ్య విభూతి నుంచి టచ్’ ఇవ్వటమంటే మానవ అవతారంలోని భౌతికాంశను విశ్వ ఆవరణకు కేంద్రమైన ‘ఆది’ అంవతో ‘లింక్’ చేయటమే! ఈ లింక్ అనేది మాస్టర్ ‘టచ్’తో మీడియమ్‌కి ‘ఇనీషియేషన్’ సందర్భంలో ఏర్పడుతుంది. ఇలా ‘ఇహ’ ‘పర’ ప్రకృతులను సంయోగింప చేయటమే విభూతియోగం.
విభూతి యోగం అనేది గిక పరిణావంలో ఒక అంకమే తప్ప ఆ విభూతి యోగమే పరిపూర్ణ యోగం అని కాదు. వ్యక్తాన్ని అవ్యక్తంలో మగ్నం చేయటం, అవ్యక్త ఆది తత్వాన్ని మానవ వ్యక్తంలో నింపటం యోగ పరిణామం. ఈ యోగ పరిణామంలో అంటే ఉపదేశం జరిగిన నాటి నుండి యోగ సాధకుడిలో ఇహ పర సమన్వయమంతా దృశ్య అదృశ్య ప్రధానంగా కాక, రూప, అరూప ప్రధానంగా కాక, భావ అభావ ప్రధానంగా కాక ‘సంకల్ప’ ప్రధానంగా సాగుతుంది.
అంటే, యోగ ప్రజ్ఞకు సంకల్పాలే సహస్ర నేత్రాలవుతాయి. కాబట్టి యోగ సాధనా క్రమంలో సంకల్పాలే యోగ విభూతులు. అలాగే యోగ సాధన తొలి పరిణామంలో యోగ విభూతులు యోగ దర్శనాలు అవుతుంటాయి. ఈ దర్శనాల నుండి ప్రభవించేవే యోగానుభూతులు, యోగానుభవాలు, అంటే, యోగ విభూతులన్నీ ఆదిభూతి ఆవిష్కరణలన్నమాట.
* * *
‘ఏతాం విభూతిం యోగం చ యో వేత్తి తత్త్వాతః
సో వికంపేన యోగేన యుజ్యతే..’
మానవ అవతరణ కూడా యోగవిభూతే! మనం ఆ సప్తఋషులు, నలుగురు మనువుల వంశజులమే! ఆ ఋషులు, మనువులు ఆది స్థితి నుండి మానస పుత్రులుగా పాంచభౌతికానికి వచ్చినవారే! వారి సంతానమే మన మానవ సంసారమంతా! ఈ విషయానే్న ధృవపరుస్తోంది -
‘మహర్షయః సప్తపూర్వే చత్వారో మనవస్త్థా
మద్భావా మానసా జాతా యేషాం లోకఇమాః ప్రజాః’ అన్న శ్లోకం. ఈ ప్రజ, ఈ లోకం, మనువులు, ఋషులు ఈ సంసారమంతా ఆది ఆవిష్కరణే!
ఇక సంసార తాపత్రయాలకు తావిచ్చే బుద్ధి, జ్ఞానం, అసమ్మోహం, క్షమ, సత్యం, దయ, శమం, సుఖం, దుఃఖం, జననం, మరణం, భయం, అభయం, వినాశనం, అహింస, సమత, తపస్సు, దానం, తృప్తి, కీర్తి, అపకారం మొదలైన భావోద్వేగాలు కూడా ‘ఆది’ ఆవిష్కరణలే! ఈ ఆవిష్కరణలన్నీ యోగవిభూతులే! వీటన్నింటి నడుమ ఆది అస్తిత్వాన్ని ఆవిష్కరించుకో గలగటం యోగం. ఈ విభూతి వైభవమే విభూతి యోగం.

-డాక్టర్ వాసిలి వసంతకువార్ 9393933946