S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వ్యవహారం

ఈ ప్రపంచంలో రకరకాల వ్యక్తులు ఉన్నారు. అందులో కొంతమంది చాలా విచిత్రంగా ఉంటారు. వాళ్లు ఇతరులని అంచనా వేస్తుంటారు. ఈ అంచనాలు కూడా వాళ్లని తక్కువ చేస్తూ వుంటాయి. అంటే ఎదుటి వ్యక్తులని తక్కువ అంచనా వేస్తూ వుంటారు.
తమని ఇతరులు ఎలా అంచనా వేస్తున్నారోనని మరి కొంతమంది ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. తమని ఇతరులు తక్కువగా అంచనా వేస్తున్నారేమోనని బాధపడుతూ ఉంటారు.
ఈ రెండు రకాల మనుషులు చాలామంది కన్పిస్తూ ఉంటారు. ఈ రెండు రకాల మనుషులు కూడా అనవసరమైన వ్యక్తులే. ఈ రెండు రకాల మనస్తత్వాలు కూడా సరైనవి కావు.
చాలామంది ఇలా ఆలోచిస్తూ వుంటారు.
- వాడు ఏదో గొప్ప పని చేద్దామని అనుకుంటున్నాడు. కానీ చేయలేడు.
- వాడు గొప్ప చిత్రకారుడనని అనుకుంటున్నాడు వాటికి సరిగ్గా అమ్మాయి బొమ్మ గీయడమే రాదు.
- వాడు గొప్ప కథా రచయితనని అనుకుంటాడు - వాడికి కథ ఎలా రాయాలో కూడా తెలియదు.
- వాడి ఆలోచనలు సరిగ్గా వుండవు.
- వాడి ఉద్దేశం సరైంది కాదు.
- వాడికి పిల్లలని పెంచడం రాదు.
- వాడికి పెద్దవాళ్లను గౌరవించడం తెలియదు.
- వాడి ఆశలు చాలా పెద్దవి.
ఇలా ఎన్నో రకాలుగా ఎదుటి వ్యక్తులని అంచనా వేస్తూ వుంటారు.
ఎదుటి వ్యక్తులని తక్కువచేసి మాట్లాడుతూ ఉంటారు.
ఒక్క విషయం గుర్తుంచుకోవాలి.
ఎదుటి వాళ్ల అంచనాలు మనకి అవసరం లేదు.
ఎదుటి వాళ్ల అభిప్రాయాలు మన గురించి అంతకంటే అవసరం లేదు.
ఇదంతా మనకు అవసరంలేని వ్యవహారం.
మన గురించి మనం ఏమి అనుకుంటున్నామన్నది అన్నింటికన్నా ముఖ్యమైన అంశం.

- జింబో 94404 83001