S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భారతీయ ఖగోళ శాస్తజ్ఞ్రుల మేధస్సు అసమానం

వర్తమాన కలియుగం క్రీ.పూ.3102 ఫిబ్రవరి 20వ తేదీ మధ్యాహ్నం 2గంటల 27నిమిషాల 30సెకండ్ల కాలమున ప్రారంభమైనదని నిర్ణయించారు. ఫ్రెంచిదేశపు ఖగోళ శాస్తవ్రేత్త ‘‘బెయిలీ’’ భారతీయుల ఖగోళ విజ్ఞాన మేధా సంపత్తికి జోహార్లర్పించారు. 14వ లూరుూ ఆజ్ఞానువర్తియైన లాబెరే క్రీ.శ.1687లో ఐరోపాకు ఇండియా నుండి తీసుకెళ్ళిన పథకాలను ‘‘కాసిని’’, ‘‘మేయర్’’ పథకాలతో పోల్చి ఎట్టి తేడా లేదని తేల్చారు. భారతీయులు ప్రత్యక్షంగా వేధలు వేసి ఖగోళాన్ని అవలోకించారని నిర్ధారించారు. సకల చరాచర సృష్టికర్తయైన బ్రహ్మ జననము మొదలుకుని, వర్తమాన సంవత్సరం వరకు సంవత్సర ఫలాలను సవివరంగా అందిస్తున్న భారతీయ పంచాంగ కర్తల మేధస్సు అమోఘం, అసమానం. కృతత్రేత ద్వాపర కలియుగమనెడు నాలుగు యుగాలు 1000 పర్యాయాలు పూర్తయితే బ్రహ్మదేవునికి ఒక దినమవుతుంది. బ్రహ్మసృష్టి ఆదిగా ఇంతవరకు స్వాయంభువ స్వారోచిష ఉత్తమ తామస రైవత చాక్షుషములను ఆరు మన్వంతరాలు సంధుతో కూడి గడిచినవి. ఇపుడు వైవస్వత మనెడి ఏడవ మన్వంతరం నడుస్తున్నది. ఒక్కొక్క మన్వంతరానికి 71మహా యుగములు కాగా, 27 మహా యుగాలు గతించి, ప్రస్తుతం 28వ మహా యుగము కొనసాగుతున్నది. (1).కార్తీక శుక్ల నవమి బుధవారం శ్రవణ నక్షత్ర ధృతి నామ యోగమందు మధ్యాహ్న సమయాన కృత యుగ ఆరంభం జరిగి 1728000 సంవత్సరాలు ఉండెను. అవతార చతుష్టయం - మత్స్య కూర్మ వరాహ నారసింహ ఇందిలివే. హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యారుర్జునుడు అనే శట్చక్రవర్తులు ఈ కాలంలో ఉండిరి. (2).వైశాఖ శుక్ల పక్ష తృతీయ గురువారం రోహిణీ నక్షత్ర ధృతి నామ యోగమందు త్రేతాయుగం ఉత్పన్నమై 1296000సంవత్సరాలు ఉండగా, అవతార త్రయం - వామన పరుశురామ శ్రీరామావతారాలు కలిగి ఉండెను. మాంధాతా, దిలీప, రఘునాథ, చక్రవర్తులుండిరి. (3).మాఘమాస కృష్ణ అమావాస్య శుక్రవారం ధనిష్ఠ నక్షత్ర యోగమున రాత్రి ద్వాపర యుగం ఉత్పన్నమై 864000 సంవత్సరాలు ఉండగా, అందు అవతార ద్వయం - శ్రీకృష్ణ బుద్ధ అవతారాలుండెను. యయాతి, నహుషుడు, దుశ్యంతుడు, పాండు యుధిష్ఠిరుడు ఉండిరి. (4).్భద్రపద కృష్ణ త్రయోదశీ ఆదివారం ఆశ్రేషా నక్షత్ర వ్యతీపాత యోగాన కలియుగం ప్రారంభమైంది. ఈ యుగం 432000 సంవత్సరాలు ఉంటాయ. బుద్ద కలికి అనే రెండు అవతారాలు కాగా, బుద్ధ అవతారం ఇంతకు ముందే ధరించినందున శలభ దేశమున విష్ణు భగవానుడు కలికి అవతారం ధరించాల్సి ఉంది. ప్రస్తుతమున్న వైవస్వత మన్వంతర 28వ మహాయుగాన కృత త్రేత ద్వాపర మూడు యుగాలు గతించి, 4వ యుగం కలి పేరుతో నడుస్తున్నది. ఈ యుగాన యుధిష్ఠిర, విక్రమ, శాలివాహన, విజయాభినందన, నాగార్జున, కల్కి భూపతి అనే 6గురు శకకర్తలు కలరు. ఇంద్రప్రస్తంలో ధర్మజుడు మొదటి శకకర్తగా ఆవిర్భవించగా ఈయన శకం 30044 సంవత్సరాలు ఉండెను. ఉజ్జయినీ నగరంలో విక్రమాదిత్య మహారాజు 2వ శకకర్తగా జన్మించగా, విక్రమార్క శకం 135 సంవత్సరాలు. శాలివాహనుడు 3వ శక కర్తగా ఉత్పన్నం కాగా ఈయన శకం 18వేలసంవత్సరాలు. వైతరిణీ సింధు సంగమ సమీపాన విజయాభినందనుడు 4వ శకకర్తగా జన్మించగా, 10వేల సంవత్సరాలు శకముండెను. గౌడ దేశమందు ధారా తీర్థములో నాగార్జునుడు జన్మించగా 4లక్ష సంవత్సరాలు శకము ఉండును. వలభ దేశమన కరవీర పట్టణంలో కలికి పేరుతో విష్ణువు 6వ శకకర్తగా అవతరించ గలడు. ఈ కల్కి శకం 821 సంవత్సరాలు ఉండగలదు. అనంతరం కలియుగ సమాప్తం జరిగి, 29వ మహా యుగం ప్రారంభ కాగలదు. కలి యుగం 5119, శాలివాహ శకం 1040, ఫసలీసన్ 1426-27, హిజరీసన్ 1439-40, క్రీ.శ 2018-19 మార్చి 18వ తేదీ ఆదివారం శ్రీశాలివాహన శకం 1940వ సంవత్సరంగా తెలుగు వత్సరమైన 32వ సంవత్సరం విళంబి ప్రారంభం కానున్నది.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494