S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అన్నమో రామచంద్రా!

1.మర పట్టించిన లేదా పాలిష్డ్ బియ్యం తింటే ఏ విటమిన్ లోపం వస్తుంది?
ఎ.విటమిన్ ఎ బి.విటమిన్ బి
సి.విటమిన్ ఇ డి.విటమిన్ డి
2.ప్రపంచవ్యాప్తంగా సాగు బియ్యం/ వరి (గడ్డిజాతులు)లో ఎన్ని రకాల జాతులు ఉన్నాయి?
ఎ.నాల్గు వందలు బి.మూడు వేలు
సి.తొమ్మిదివేలు డి.40వేలకు పైగా
3.‘పేడి’ అని ధాన్యాన్ని సూచించే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది?
ఎ.కొరియన్ బి.జపనీస్
సి.మలే డి.చైనీస్
4.అమెరికాకు వరి సాగును తెచ్చింది ఏ దేశస్థులు?
ఎ.చైనీస్ వలస కార్మికులు బి.వలస పక్షులు
సి.్ఫలిప్పీన్స్ రైతులు
డి.ఆఫ్రికా వెస్ట్‌కోస్ట్ నుండి కొనుక్కొన్న బానిసలు
5.కింది వాటిలో ఏది బియ్యం నుంచి తయారుచేయొచ్చు?
ఎ.పేపర్ బి.నూడుల్స్ మరియు శిశువుల కోసం ఆహారం
సి.వైన్ డి.పైవన్నియు
6.కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఇనుము, పాంతోతేనిక్ ఆమ్లం, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ ఇ, దేనిలో అధికంగా లభిస్తాయి?
ఎ.మొక్కజొన్న బి.గోధుమ
సి.్ధన్యం డి.బంగాళాదుంపలు
7.క్రింది వాటిలో ఏది బియ్యం/ ధాన్యంలో లభించదు లేదా చాలా తక్కువగా ఉంటుంది?
ఎ.విటమిన్ సి బి.ఫైబర్
సి.విటమిన్ ఎ మరియు బీటా కెరోటిన్
డి.పైవన్నియు
8.బియ్యంలో ఫోలిక్ ఆసిడ్ అధికంగా ఉండడం వలన, అన్నం ఆహారంగా తీసుకొంటే ఎవరికి మేలు కలుగుతుంది?
ఎ.గర్భవతులు బి.గర్భాశయంలోని గర్భస్థ శిశువులు
సి.గర్భవతులు మరియు గర్భస్థ శిశువులు
డి.పైవన్నియు
9.డయాబెటిస్ లేదా మధుమేహం ఉన్నవారు ఆహారంలో అన్నం ఎందుచేత అధికంగా తీసుకోరాదంటారు?
ఎ.బియ్యం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి
బి.బరువు పెరుగుటకు అన్నం దోహదం చేయవచ్చు
సి.బరువు పెరగడం వలన మధుమేహం తీవ్రత మరింత పెరుగుతుంది
డి.పైవన్నియు
10.1965లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఎక్కడ స్థాపించారు?
ఎ.హైదరాబాద్ బి.లుథియానా
సి.న్యూఢిల్లీ డి.కటక్

గత వారం క్విజ్ సమాధానాలు
1.సి 2.ఎ 3.బి 4.సి 5.డి 6.సి 7.డి 8.డి 9.బి 10.ఎ

-సునీల్ ధవళ 97417 47700