S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నొప్పి-నివారణ

(గత సంఛిక తరువాయ)

ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ 100 గ్రాముల చొప్పున కొని, మెత్తగా మిక్సీ పట్టి, తగినంత ఉప్పు కలిపి ఒక సీసాలో భద్రపరచుకోండి. ఒక చెంచా మోతాదులో గ్లాసు మజ్జిగలో కలిపి రెండు పూటలా రోజూ తాగుతూ వుంటే పిక్కల నొప్పులు తగ్గుతాయి.
కర్పూర శిలాజిత్ అనే ఔషధం ఆయుర్వేద మందుల షాపుల్లో దొరుకుతుంది. ఇది ఒక పావుచెంచా పొడిని తీసుకుని పంచదార కలుపుకుని రెండు పూటలా తీసుకుంటూ ఉంటే పిక్కల నొప్పులు తగ్గుతాయి. తిప్పసత్తు (గుడూచీ సత్వం) అనే ఔషధాన్ని కూడా ఇలానే తీసుకోవచ్చు. రెండింటినీ పావుచెంచా మోతాదులో కలిపి తీసుకోవచ్చు. వేడి వాతాలు తగ్గుతాయి. మంటలు, నొప్పులు, వాపులు తగ్గుతాయి.
మంచి గంథం చెక్క నమ్మకమైనది దొరికితే, దాన్ని రెండు మూడు పచ్చకర్పూరం పలుకులు వేసి సానమీద అరగదీసి కొద్ది నిమిషాలు నీడన ఆరనివ్వండి. గట్టిపడి మాత్రలకొస్తుంది. బఠాణీ గింజంత మాత్రలు చేసుకుని ఆరనిచ్చి ఒక సీసాలో భద్రపరచుకోండి. పూటకు రెండు మాత్రల చొప్పున రెండు పూటలా తీసుకుంటూ ఉంటే శరీరంలో వాతం, వేడి తగ్గి సౌకర్యం సమకూరుతుంది. కాళ్లనొప్పులు తగ్గుతాయి.
గోక్షురాది చూర్ణం కూడా ఆయుర్వేద మందుల షాపుల్లో దొరుకుతుంది. దీన్ని ఒక చెంచా పొడిని గ్లాసు మజ్జిగలో కలిపి రోజూ తాగుతూ వుంటే కండరాల నొప్పులన్నీ తగ్గుతాయి. క్షీరబలా లాక్షాది తైలం, కర్పూరాది తైలం లాంటి తైలాలతో పిక్క కండరాల మీద మర్దన చేసుకుంటే నొప్పి త్వరగా తగ్గుతుంది.
ఇవన్నీ ఏ మందులు వాడుతున్నవారైనా తీసుకోవచ్చు. ప్రత్యేకమైన చికిత్స కోసం వైద్యుని సంప్రదించటం మంచిది. ఎందుకంటే పిక్కలు పట్టేయటానికి గల మూలకారణాన్ని తెలుసుకుని దానికి చికిత్స అవసరం కాబట్టి.
ఊరుగాయ పచ్చళ్లు, అతిగా మసాలాలు, చింతపండు వంటకాలను మానేయండి. కూరగాయలు ఎక్కువగా, అన్నం తక్కువగా తినండి. పొగత్రాగే అలవాటుంటే తక్షణం మానేయండి. కాళ్లకు రక్తసరఫరా ఎలా ఉన్నదో పరిక్ష చేయించుకోండి. కాళ్లనొప్పుల్ని అశ్రద్ధ చేయకండి. తొలి దశలోనే జాగ్రత్త పడితే పెద్ద ప్రమాదం తప్పుతుంది.

- డా. జి.వి.పూర్ణచందు 9440172642 purnachandgv@gmail.com