S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం....82

మీకో ప్రశ్న
---------------
కేకయ రాజు పేరేమిటి?

భరతుడు తన కల గురించి చెప్పే సమయంలోనే, అలసిన గుర్రాలతో ఆ దూతలు శత్రువులు దాటడానికి శక్యం కాని కందకాలున్న, అందమైన రాజగృహ నగరంలోకి ప్రవేశించారు. కేకయ రాజుని, అతని కొడుకైన ఇంద్రజిత్‌ని కలిసి వారి చేత ఆదరించబడి ఆ రాజు పాదాలకి నమస్కరించి వారు భరతుడితో చెప్పారు.
పురోహితుడు, మంత్రులు అంతా నీ కుశలం అడుగుతున్నారు. నువ్వు వెంటనే బయలుదేరి రావాలి. నీతో చాలా తొందర పని ఉంది. విశాలమైన కళ్ళు గల భరతా! చాలా విలువైన ఈ వస్త్రాలని, ఆభరణాలని తీసుకుని నీ మేనమామకి ఇవ్వు. రాజకుమారా! ఈ వస్త్రాలు, ఆభరణాలని నీ తాత కేకయ రాజుకి ఇవ్వు. వీటి వెల ఇరవై కోట్లు. నీ మేనమామకి ఇవ్వాల్సిన వాటి వెల పదికోట్లు.44
బంధువుల మీద ప్రేమ గల భరతుడు వాటిని తీసుకుని దూతలకి కావాలసిన వస్తువులని బహుకరించి, ఆదరించి చెప్పాడు.
మా నాన్న దశరథ మహారాజు క్షేమంగా ఉన్నాడా? రాముడు, మహాత్ముడైన లక్ష్మణుడు ఆరోగ్యంగా ఉన్నారా? పూజ్యురాలు, ధర్మం మీదే ఆసక్తి గల, ధర్మాలు తెలిసిన, ధర్మానే్న చూసే ధీమంతుడైన రాముడికి తల్లైన సుమిత్ర ఆరోగ్యంగా ఉందా? ధర్మాలు తెలిసినది, లక్ష్మణుడికి, వీరుడైన శత్రుఘు్నడికి తల్లి, మా మధ్యమ తల్లైన కౌసల్య ఆరోగ్యంగా ఉందా? తన సుఖానే్న కోరేది, ఎప్పుడూ తీవ్రంగా ప్రవర్తించే కోపధారి, బుద్ధిమంతురాలిని అనే గర్వం గల నా తల్లి కైకేయి ఆరోగ్యంగా ఉందా? ఆమె మాకు ఏం చెప్పింది?22
మహాత్ముడైన భరతుడి మాటలు విన్న ఆ దూతలు వినయంగా ఇలా చెప్పారు.
మనుషుల్లో గొప్పవాడా! నువ్వు ఎవరి కుశలం అడుగుతున్నావో వారంతా క్షేమంగా ఉన్నారు. నిన్ను ఐశ్వర్యం, లక్ష్మి వరిస్తున్నాయి. త్వరగా రథంలో కూర్చుని బయలుదేరు.22
నన్ను దూతలు తొందర పెడుతున్నారు అని చెప్పి రాజుని అనుమతిని అడుగుతాను. అయోధ్యకి రమ్మని పిలిచిన దూతలతో చెప్పి భరతుడు తన తాతతో చెప్పాడు.
మహారాజా! దూతలు నన్ను అయోధ్యకి రమ్మంటున్నారు. నేను మా తండ్రి దగ్గరకు వెళ్తాను. మళ్ళీ నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను.22
తాత కేకయ రాజు భరతుడి మాట విని, అతని తలని వాసన చూసి మంగళకరమైన మాటలని చెప్పాడు.
నాయనా! నేను అనుమతిస్తున్నాను. వెళ్ళు. నువ్వు కైకేయికి మంచి కొడుకువి. నీ తల్లిదండ్రులు క్షేమం అడిగానని చెప్పు. పురోహితుడైన వసిష్ఠుడ్ని, ఇతర బ్రాహ్మణోత్తములని, గొప్ప బాణాలు గల అన్నదమ్ములైన రామలక్ష్మణులని క్షేమం అడిగానని చెప్పు.22
కేకయ రాజు భరతుడికి ప్రేమతో గొప్ప ఏనుగులని, రంగురంగుల కంబళ్ళని, మృగచర్మాలని, డబ్బుని ఇచ్చాడు. ఇంకా అదనంగా రెండు వేల బంగారు కంఠహారాలు, పదహారు వందల గుర్రాలని సంపదగా ఇచ్చాడు.
మేనమామైనా యుధాజిత్తు ఇంద శిరః పర్వతంలో పుట్టిన అందమైన ఏనుగులని, బాగా శిక్షణ ఇచ్చిన, వేగంగా పరిగెత్తే గాడిదలని బహుమతిగా ఇచ్చాడు. ఇంకా అంతఃపురంలో చక్కగా పెంచబడ్డ, పులులతో సమానమైన, వీర్య బలం గల, కోరలే ఆయుధాలుగా కల, చాలా పెద్ద శరీరం గల కుక్కలని కూడా బహుమతులుగా ఇచ్చాడు.
అయోధ్యకి వెళ్ళే తొందరలో ఉన్న భరతుడికి తన తాత ఇచ్చిన కానుకలేమీ ఆనందాన్ని కలిగించలేదు. ఎందుకంటే దూతలు తొందర పెట్టడంతో, తను చూసిన కల వల్ల అతని మనసు చాలా విచారానికి గురైంది. శ్రీమంతుడైన భరతుడు మనుషులతో, ఏనుగు, గుర్రాలతో నిండిన, సువిశాలమైన తన ఇంటిని దాటి గొప్పదైన రాజమార్గంలో ప్రవేశించాడు. మంచి బుద్ధిగల భరతుడు రాజమార్గాన్ని దాటి వెళ్ళి అంతఃపురాన్ని చూసాడు. తర్వాత అడ్డగించే వాళ్ళు లేకుం అంతఃపురంలోకి వెళ్ళాడు. తన తాత దగ్గర, మేనమామ యుధాజిత్తు దగ్గర శెలవు తీసుకుని, శత్రుఘు్నడితో కలిసి రథం ఎక్కి బయలుదేరాడు. సేవకులు వందల కొద్దీ రత్నాలతో విచిత్రంగా ఉన్న రథాల మీద కూర్చుని ఒంటెలు, ఆవులు, గుర్రాలతో భరతుడ్ని అనుసరించారు. మహాత్ములు, శత్రువులు లేని వాడైన భరతుడు సైన్య రక్షణలో తనతో సమానులైన వీరులతో శత్రుఘు్నడు వెంటరాగా సిద్ధ పురుషుడు ఇంద్ర లోకం నించి బయలుదేరినట్లు తాత ఇంటి నించి బయలుదేరాడు. (అయోధ్యకాండ సర్గ 70)
కాంతి గలవాడు, శ్రీమంతుడు, ఇక్ష్వాకు వంశానికి ఆనందాన్ని కలిగించే ఆ భరతుడు రాజగృహం నించి తూర్పు వైపు బయలుదేరి, అక్కడ నించి సుదామ నదిని దాటిన తర్వాత హ్లాదినీ నదిని, దూరతీరాలు గల పశ్చిమముఖంగా ప్రవహించే శతద్రూ నదిని దాటాడు. సత్యసంధుడు, పవిత్రుడు, శ్రీమంతుడైన భరతుడు శరద్రూ నదిని దాటి, అపరపర్పట దేశాన్ని చేరి, రాళ్ళని ఆకర్షించే శిలావహ నదిని దాటి, ఆగ్నేయం, శల్యకర్తనం అనే గ్రామాలని, శిలావహానదిని చూస్తూ మహాపర్వతాలని దాటి చైత్ర రథవనం వైపు ప్రయాణించాడు. సరస్వతీ, గంగల సంగమానికి చేరుకుని వీరమత్స్య దేశానికి ఉత్తరంగా ఉన్న అడవిలోకి ప్రవేశించాడు. అక్కడి నించి అధిక వేగంతో ఆనందం కలిగించే, పర్వతాలతో నిండిన కులింగ నదిని, యమునా నదిని దాటి, అక్కడ సైన్యానికి విశ్రాంతి ఇచ్చాడు. అలసిన గుర్రాల ఒంటి మీద చల్లటి నీళ్ళు చల్లి వాటిని సేదతీర్చి స్నానం చేసి నీళ్ళు తాగి, కొద్దిగా నీళ్ళని కూడా తీసుకుని బయలుదేరాడు.
మంగళకరుడైన భరతుడు ఉత్తమమైన ఏనుగు మీద ఎక్కి జనసంచారం లేని ఆ అరణ్యాన్ని వాయువు ఆకాశాన్ని దాటినట్లుగా దాటాడు. ప్రాగ్వటం అనే ప్రసిద్ధమైన ఊళ్ళో అంశుధానం అనే చోట దాటడానికి కష్టమైన భాగీరథీ నదిని చేరుకున్నాడు. అతను ప్రాగ్వటంలో గంగని దాటి కుటికోష్టికా నదిని చేరుకుని సైనికులతో కలిసి ఆ నదిని కూడా దాటి ధర్మవర్ధనం అనే గ్రామాన్ని చేరుకున్నాడు. (అయోధ్యకాండ సర్గ 71 10వ శ్లోకం దాకా)
ఆశే్లష హరికథని తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళి తల్లికి వినిపించాడు. శారదాంబ మొత్తం విని చెప్పింది.
ఆయన చెప్పిన దాంట్లో ఏడు తప్పులు ఉన్నాయి. అవేమిటో తెలుసా?22
తెలీదు.2ఆశే్లష చెప్పాడు.
అవేమిటో చెప్తా విను.22
రామాయణం డిటెక్టివ్‌గా మీరు కూడా ఆ ఏడు తప్పులని కనుక్కోగలిగారా?

గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు
---------------------------------------
భరతుడి కొడుకుల పేర్లేమిటి?
1.తక్షుడు 2.పుష్కలుడు

1.‘రాజగృహ నగరానికి చేరుకోండి’ అని వాల్మీకి రాసాడు. దానికి గిరివ్రజ అనే ఇంకో పేరున్నా, వాల్మీకి ఆ పేరు రాయలేదు. కాని హరిదాసు గిరివ్రజ అనే పేరు తప్పుగా వాడాడు.
2.కేకయ రాజుకి కూడా పట్టువస్త్రాలు, ఉత్తమమైన అలంకారాలు తీసుకుని వెళ్లమని వశిష్ఠుడు ఆజ్ఞాపించాడు. హరిదాసు ఇది చెప్పడం విస్మరించాడు.
3.మాలినీ నదీ తీరంలో వారు ప్రయాణించారు. హరిదాసు పొరపాటుగా మాలతీ నదిగా దాన్ని పేర్కొన్నాడు.
4.శరదండా నదిని దూతలు దాటారు. కాని హరిదాసు పొరపాటుగా శరగంగా నదిగా ఆ పేరుని చెప్పాడు.
5.సుదామ పర్వతాన్ని దాటారు. సుధామ కాదు. దని హరిదాసు ధగా చెప్పాడు.
6.గిరివ్రజ పురానికి దూతలు చేరుకున్నారు అని వాల్మీకి రాశాడు. కాని రెండోసారి హరిదాసు రాజగృహ నగరికి అని తప్పుగా చెప్పాడు.
7.్భరతుడిలోని విచారాన్ని పసికట్టిన ఓ ప్రియమిత్రుడు అతన్ని దాని గురించి ప్రశ్నించాడు. హరిదాసు పొరపాటుగా శతృఘు్నడు ప్రశ్నించినట్లుగా చెప్పాడు.

--మల్లాది వెంకట కృష్ణమూర్తి