S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నృత్యం ఆమె జీవన శైలి

డా. శ్రీమతి సరిత దిలీప్ కూచిపూడి, భరతనాట్యంలో ప్రసిద్ధ కళాకారిణి. ఆమె ప్రఖ్యాత గురువు, నటి, నర్తకి, కొరియోగ్రాఫర్, దర్శకురాలు, నిర్మాత, రచయిత్రి, నృత్యప్రియ సంస్థ అధినేత్రి. సరిత నిర్మించిన టెలీఫిలింకి నాలుగు నంది అవార్డులు వచ్చాయి. ఆమె కళాసేవకు యునైటెడ్ టెక్నాలజీ రీసెర్చ్ యూనివర్సిటీ - బర్క్‌లీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ (లలితకళల రంగంలో) ఇచ్చారు. దశాబ్దాలుగా కళాసేవకు అంకితమైనారు. ఎన్నో ఏళ్లుగా నృత్యప్రియ సంస్థ ద్వారా ఉత్తమ నర్తకీమణులను తీర్చిదిద్దుతున్నారు. పలు టీవీ సీరియల్స్ రాశారు, తీశారు, నటించారు. ఎన్నో సన్మానాలు, గౌరవాలు పొందారు. వారి శిష్యులు కూడా ఎన్నో గౌరవాలు పొందారు. నృత్యఝరి, నృత్యసంపుటి పుస్తకాలు రాసి ప్రచురించారు. నృత్యం జీవనశైలి అంటారు సరిత.
ప్రస్థానిం
17.4.1959 హైదరాబాద్‌లో జన్మించారు సరిత. తండ్రి కీ.శే.జి.ఎస్.రామచంద్ర గారి ప్రోత్సాహం వల్లనే ఆమె ఈ రంగంలోకి అడుగుపెట్టారు. తరువాత ఆమె భర్త దిలీప్ కూడా కళాసేవకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. 1984లో భరతనాట్యంలో త్యాగరాజ ప్రభుత్వ సంగీత - నృత్య కళాశాల నుండి డిప్లొమా చేశారు. 1981లో బేకరీలో డిప్లొమా - ఫుడ్‌క్రాఫ్ట్ ఇనిస్టిట్యూట్ నుండి చేశారు. 1982లో బిఎస్సీ హోంసైన్స్, 1991లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ. కూచిపూడి, 1995లో సెంట్రల్ యూనివర్సిటీ నుండి భరతనాట్యం ఎంపిఏ చేశారు. 2010లో కుప్పంలో ద్రవిడియన్ యూనివర్సిటీ నుండి ఎం.్ఫల్ చేశారు. 2015లో ఆనరరీ డాక్టరేట్ లభించింది. దశాబ్దాలుగా నృత్యప్రియ నాట్య శిక్షణాలయం ద్వారా ఎంతోమంది నర్తకీమణులను తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ కూచిపూడి, భరతనాట్యం నేర్పిస్తున్నారు. వీరిదే సినిమాక్స్ ప్రొడక్షన్స్. దీని ద్వారా ఎంతో న్యూస్ కవరేజీ జరిగింది. ఎన్నో వర్క్‌షాపులు నిర్వహించారు. డా.ఉమారామారావు గారి వద్ద భరతనాట్యం, కూచిపూడి నేర్చుకున్నారు.
అవార్డులు
బెల్లం యూత్ అవార్డు - శ్రీ రోశయ్యగారి చేతుల మీదుగా - 10 జనవరి 1994లో. అభినందన సంస్థ ద్వారా అభినందన - దుర్గాబాయి దేశ్‌ముఖ్ అవార్డు, హైదరాబాద్‌లో యూనియన్ మినిస్టర్ శ్రీపాదరావు, శ్రీమతి నన్నపనేని రాజకుమారి చేతుల మీదుగా - డిసెంబర్ 1994.
సరిత తీసిన ‘తానాషా కూచిపూడి అగ్రహార సందర్శన’ టెలీఫిలిం 4 నంది అవార్డులు పొందింది. 1998 బంగారు నంది - ఉత్తమ టెలీఫిలిం - నిర్మాత సరిత దిలీప్. దీనికి పరిశోధన, కథా కథనం, ఆహార్యం, నగలు, రూపకల్పన - కొరియోగ్రఫీ మొత్తం వీరే చేశారు.
1998 నంది అవార్డు - ఫొటోగ్రఫీ - దిలీప్‌కుమార్
1998 నంది అవార్డు - ఉత్తమ నటుడు - రత్తయ్యశర్మ
1998 నంది అవార్డు - ఉత్తమ మేకప్ - శ్యాం జడ్చర్ల
పద్మనృత్య కళాశిరోమణి అవార్డు- 18 జూన్ 2011
ఆమ్రపాలి నృత్య మయూరి - 7 సెప్టెంబర్ 2011
యువ దశాబ్ద మహిళా అవార్డు - 16 మార్చి 2013
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ - మహిషాసుర మర్దిని 500సార్లు ప్రదర్శన.
నృత్యరూపకాలు
సరిత దిలీప్ గారు ఎన్నో నృత్య రూపకాలను ప్రదర్శించారు. అందులో కొన్ని-
విశ్వదీపం, ఏక్తా కీ ఆవాజ్, నౌకా చరిత్ర, శహాజీ పల్లకీ సేవా ప్రబంధం, పంచనదీయం, శ్రీకృష్ణ జననం, మహిషాసుర మర్దిని, భామాకలాపం, మహాశక్తి, సింగి - సింగడు.
అభిరుచులు
నర్తకి, గురువుగా ఎంతో పేరు తెచ్చుకున్నారీమె. అలాగే ఆమె నిర్మాణ దర్శకురాలిగా, ఎడిటింగ్, మిక్సింగ్, ఫొటోగ్రఫీ, డబ్బింగ్, ఫొటోప్రాసెస్, స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే, పెయింటింగ్, క్లే మోడలింగ్, జ్యుయలరీ డిజైనింగ్, కాస్ట్యూమ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్, టెక్స్‌టైల్ డిజైనింగ్, డాల్‌మేకింగ్, టెక్స్‌టైల్ ప్రింటింగ్, ఫ్యాబ్రిక్ ప్రింటింగ్, బేకరీ అండ్ కనె్ఫక్షనరీ.
యాంకర్
సరిత దిలీప్ ఎన్నో కార్యక్రమాలకు యాంకరింగ్ చేశారు. అందులో కొన్ని-
టీవీ సీరియల్ మేడ్ ఇన్ ఇండియా - సాంస్కృతిక జీవనధార.
హిమబిందు - అడవి బాపిరాజుగారి నవలపై. దీనికి సరిత నిర్మాత, దర్శకురాలు, నటి కూడా.
‘చీకట్లో చిరుదీపం’ దీనికి కూడా దర్శక, నిర్మాత, నటి.
స్క్రిప్ట్
‘చీకటిలో చిరుదీపం’ - 50 ఎపిసోడ్స్ - సాంఘిక భావాలుగల మహిళల సీరియల్
నర్తకి - 13 ఎపిసోడ్స్. చారిత్రక కథ - భారతీయ సంస్కృతి, నృత్యముల మీద.
హిమబిందు - సంగీతం, నృత్యం మీద టీవీ కోసం.
నటిగా - సాంస్కృతిక జీవనధార - జనవరి 1995. పాతాళ గంగమ్మ పైకి రావమ్మా - ఏప్రిల్ 1992. అడ్వర్టైస్‌మెంట్ - పోలియో - డిపిటి - డిసెంబర్ 1991.
ఇప్పటికైనా చదువుకోండి - ఆగస్టు 1991.
హిమబిందు, భార్యాభర్తలు, జీవన సౌరభాలు, నమ్మలేని నిజాలు, ప్రత్యౌషం, జీవన సౌరభాలు. కోడిగుడ్డంత గుడమగింజ - 2003, ప్రహ్లాద చరిత్ర, హరవిలాసం - 2003-04.
ముఖ్య ప్రదర్శనలు
సరిత 18 సంవత్సరాల వయసు నుంచీ నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. 13 నవంబర్ 1986లో రంగప్రవేశం చేశారు. 19 జనవరి 1986 డా.ఉమారామారావుగారి శిష్యరికంలో నృత్యార్చన చేశారు.
అమరావతి, విజయవాడ, బాంబే, బెంగుళూరు, తిరుపతి, ఉజ్జయిని, కూచిపూడి, హిమాచల్‌ప్రదేశ్, సిమ్లా, రాంపూర్‌లో ప్రదర్శించారు.
బెంగుళూరు తెలుగు మహాసభలు - 1991
కాళిదాసు సమ్మేళనం - ఉజ్జయిని 1991.
విజయవాడ శ్రీశక్తి పీఠం - 13 సెప్టెంబర్ 1999
దేశమంతటా ఎన్నో ఎనె్నన్నో ప్రదర్శనలు. ఈమె శిష్యులు సిసిఆర్‌టి, హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్‌మెంట్ యంగ్ ఆర్టిస్ట్ స్కాలర్‌షిప్, మరియు ఎన్నో గౌరవాలు పొందారు.

-డాక్టర్ శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి