S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వాస్తు శిల్ప వాచస్పతి

డా.ఈమని శివనాగిరెడ్డి గారు శాసనాలు, పురావస్తు శాస్త్రంలో విశ్వవిఖ్యాతమైన పండితుడు. వీరు చరిత్ర, శాసనాలు, పురావస్తు శాస్త్రం, బౌద్ధం, పర్యాటకం.. ఇలా ఎన్నో పుస్తకాలు రాశారు. శ్రీశైలం జలాశయం ముంపునకు గురైన క్రీ.శ.7-17 శతాబ్దాలకు చెందిన వందకు పైగా దేవాలయాలను తొలగించి, ఎగువన నిర్మించారు. డా.ఇ.శివనాగిరెడ్డి గారు ‘ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ’ సీఈఓగా పని చేస్తున్నారు. వీరు సెంట్రల్ యూనివర్సిటీలో చరిత్రలో పిహెచ్.డి. చేశారు. 1978లో దేవాదాయ శాఖలో, 1981 నుండి రాష్ట్ర పురావస్తు శాఖలో పనిచేసి 2013లో పదవీ విరమణ చేశారు. 2004 నుండి 2008 దాకా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా, డీన్‌గా, తరువాత డైరెక్టర్‌గా పని చేశారు. 2013-15 స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్‌గా, శిల్పారామం ప్రత్యేకాధికారిగా చేశారు. ఈమని శివనాగిరెడ్డిగారు కళారత్న, వాస్తు శిల్ప వాచస్పతి. కోణార్క సూర్య దేవాలయం మీద అత్యంత ఉన్నతమైన మోనోగ్రాఫ్ రాశారు. ఈ కళింగ శిల్పం - కోణార్క దేవాలయంపై వ్యాసం మిసిమిలో వచ్చింది.
శాసనాలు, ఎపీగ్రాఫీ మీద పూర్వం మల్లంపల్లి సోమశేఖర శర్మ, వేటూరి ప్రభాకరశాస్ర్తీ, నేలటూరి వెంకటరమణయ్య ఎంతో కృషి చేశారు. తరువాత పి.వి.పరబ్రహ్మ శాస్ర్తీ, ఇంగువ కార్తికేయశర్మ, డా.ఈమని శివనాగిరెడ్డి గార్లు శాసనాలపై గణనీయమైన కృషి చేశారు. ఈయన ఎపీగ్రాఫీలో ఎన్నో పుస్తకాలు రచించారు.
ప్రశ్న: మీ ప్రస్థానం గురించి చెప్పండి.
జ: నేను ఏప్రిల్ 15, 1955న వలివేరు - చుండూరు మండలం, గుంటూరు జిల్లాలో పుట్టాను. నాలుగు సంవత్సరాలు శిల్పశాస్త్రం మీద ఎస్వీ ఇన్‌స్టిట్యూట్‌లో టీటీడీ తిరుపతిలో చదివాను. వందకు పైగా దేవాలయాలు శ్రీశైలం జలాశయం ముంపునకు గురి అయినప్పుడు, అవి తొలగించి ఎగువలో పునర్నిర్మించాను. ఎం.ఏ. చరిత్ర, పురాతత్వశాస్త్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేశాను. నేను పిహెచ్.డి. చరిత్రలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేశాను. నా పరిశోధనాంశం ‘ఇవల్యూషన్ ఆఫ్ బిల్డింగ్ టెక్నాలజీ ఇన్ ఎర్లీ అండ్ ఇన్ టూరిజం మేనేజ్‌మెంట్’. ఎం.కె. యూనివర్సిటీ నుండి ఎగ్జిక్యూటివ్ ఎంబిఏ ఎం.ఎస్. యూనివర్సిటీ నుండి చేశాను.
ప్ర: ప్రభుత్వోద్యోగిగా..
జ: 1978లో దేవాదాయ శాఖలో ప్రభుత్వోద్యోగిగా మొదలుపెట్టాను. 1979లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరాను. ఎన్నో దేవాలయాలు పునర్నిర్మించాను. ఎన్నో పురాతత్త్వ తవ్వకాలు, ముఖ్యంగా బౌద్ధపరంగా ఆంధ్రప్రదేశ్‌లో చేశాను. తెలంగాణలో కాకతీయ హెరిటేజ్ ప్రాజెక్ట్‌లో ఎన్నో కాకతీయ ఆలయాలను కాపాడాము.
ప్ర: మీకు లభించిన గౌరవాలు?
జ: లండన్ యుకెటిఏలో, 14 జులై 2012లో నాకు డా.వి.గణపతి స్థపతి ‘వాస్తు శిల్ప వాచస్పతి’ బిరుదు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ‘హంస కళారత్న’ అవార్డు పొందాను. పి.వి. పరబ్రహ్మ శాస్ర్తీగారి గొప్ప పండితులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అవే నిజమైన గౌరవాలు. ఎన్నో పుస్తకాలు రాశాను. అవే నిజమైన రివార్డులు.
ప్ర: మీరు రాసిన పుస్తకాల గురించి చెప్పండి.
జ: 50కి పైగా పుస్తకాలు, 500కి పైగా వ్యాసాలు ప్రచురించాను. ఇవి చరిత్ర, సంస్కృతి, బౌద్ధము, పురాతత్త్వము, పర్యాటకం మీద. అందులో కొన్ని ముఖ్యమైనవి బుద్ధిస్ట్ ఆర్కియాలజీ ఇన్ ఆంధ్రప్రదేశ్, బుద్ధిస్ట్ సర్క్యూట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బుద్ధిస్ట్ హెరిటేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, లేపాక్షి టెంపుల్, రామప్ప టెంపుల్, టెంపుల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, టూరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్, సిల్పిన్స్ ఇన్ ఎర్లీ అండ్ మెడీవల్ ఆంధ్రా, తెలుగు శిల్పులు, తెలుగువారి దేవాలయాలు, కల్చరల్ కాంటూర్స్ ఆఫ్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ, బుద్ధిస్ట్ ఇన్స్‌క్రిప్షన్స్ తెలుగు పీపుల్, కొండవీటి రెడ్డిరాజులు, హాండ్‌బుక్ ఫర్ ఆర్కియలాజికల్ గైడ్స్, కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, కాలచక్ర సాధన, ఎన్‌సైక్లోపిడియా ఆఫ్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ బుద్ధిస్ట్ హెరిటేజ్ సైట్స్. నా పుస్తకాలు తెలుగులోనూ, ఆంగ్లంలోనూ వచ్చాయి. ఎక్కువ భాగం నేను రాసినవి. కొన్ని పుస్తకాలకు సంపాదకత్వం వహించాను.
ప్ర: టూరిజం డిపార్ట్‌మెంట్‌కు మీరు ఎనలేని సేవ చేశారు కదా?
జ: ఎం.కె. యూనివర్సిటీ నుండి మాస్టర్ ఇన్ టూరిజం మేనేజ్‌మెంట్ చేశాను. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, గచ్చిబౌలిలో డీన్‌గా అక్టోబర్ 1, 2004 నుండి సెప్టెంబర్ 30, 2009 దాకా, మళ్లీ డైరెక్టర్‌గా జూన్ 2010 నుండి మే 2011 దాకా పని చేశాను. పర్యాటకం మీద ఎన్నో పుస్తకాలు రాశాను. డా.వైఎస్‌ఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో పర్యాటకం బోధించాను. ఎపిటిడిసి, మాదాపూర్‌లో డైరెక్టర్‌గా ఏప్రిల్ 2013- మే 2014 దాకా చేశాను. చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ - డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రావల్ అండ్ టూరిజం, విక్రం సింహపురి యూనివర్సిటీ, నెల్లూరు, మెంబర్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ - డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఏంసియెంట్ ఇండియన్ హిస్టరీ కల్చర్ అండ్ ఆర్కియాలజీ, ఎస్వీ యూనివర్సిటీ తిరుపతి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టూరిజం, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు.

-డాక్టర్ శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి