S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం -- (1-7-2018 నుంచి 7-7-2018 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆదివారం వృత్తిలో ఒత్తిడులుంటాయి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. సామాజిక ఉన్నతి కోసం ప్రయత్నించాలి. గౌరవం కోల్పోకుండా జాగ్రత్తగా మెలగాలి. పితృవర్గ ఒత్తిడులుంటాయి. సోమ మంగళ బుధవారాల్లో అన్ని పనుల్లో ప్రయోజనాలు. లాభాలు సంతృప్తినిస్తాయి. పెద్దల అనుకూలత. కాలం కలిసి వస్తుంది. వ్యవహారశైలి బాగుంటుంది. కొన్ని రకాల ఒత్తిడులు తప్పకపోవచ్చు. ప్రయాణాదుల్లో సమస్యలు. గురు శుక్రవారాల్లో ఖర్చులు, పెట్టుబడులు అత్యధికం. గృహావసరాల కోసం వెచ్చిస్తారు. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. విహార యాత్రలకు, విందు వినోదాలకు అవకాశం. సామాజిక భాగస్వామ్యానుబంధాలు సంతృప్తినిస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఆదివారం లక్ష్యాలను సాధిస్తారు. కీర్తిప్రతిష్టలు విస్తరిస్తాయి. పుణ్య కార్యక్రమాలపై దృష్టిని కేంద్రీకరిస్తారు. ఆధ్యాత్మిక ధార్మిక వ్యవహారాలుంటాయి. సంప్రదింపులలో కొంత జాగ్రత్త. సోమ మంగళ బుధవారాల్లో వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. సామాజిక గౌరవం లభిస్తుంది. శ్రమాధిక్యం. కార్యనిర్వహణలో సంతృప్తి. ఖర్చులు, దూర ప్రయాణావకాశాలు. ఇతరులకు సహకారం అందించాలి. పోటీలుంటాయి. గురు శుక్రవారాల్లో లాభాలపై దృష్టి. కొన్ని ప్రయోజనాలు ఆశించినంతగా సంతృప్తి నివ్వకపోవచ్చు. అనుకోని ఒత్తిడులకు అవకాశం ఉంది. అప్రమత్తంగా మెలగాలి. వ్యాపార వర్గ సహకారం కోసం ప్రయత్నం. సంప్రదింపులుంటాయి.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఆదివారం అన్ని పనుల్లో జాగ్రత్తగా మెలగాలి. అనుకోని ఇబ్బందులు. అనారోగ్య భావనలు. కొత్త పనులను వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబ సంబంధాల్లో వత్తిడులు. సోమ మంగళ బుధవారాల్లో అన్ని పనుల్లో అనుకూలత. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో సంతృప్తి. కీర్తిప్రతిష్టలు విస్తరిస్తాయి. సుదూర ప్రయాణాలు. చిన్న ప్రమాదాలకు అవకాశం. కుటుంబంలో అననుకూలత. అభీష్టాలు నెరవేరుతాయి. గురు శుక్రవారాల్లో వృత్తి ఉద్యోగాదులపై దృష్టి, బాధ్యతల నిర్వహణ. అనుకూల ప్రభావాలు. సామాజిక గౌరవం లభ్యం. భాగస్వామ్యాల్లో ఒత్తిడులు తప్పకపోవచ్చు. పరిచయాల్లో జాగ్రత్త. కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో సంతృప్తి.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఆదివారం పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. భాగస్వామ్య అనుబంధాలపై ప్రత్యేక దృష్టి. కార్యనిర్వహణలో సంతృప్తి లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో కార్యక్రమాల నిర్వహణ. సోమ మంగళ బుధవారాల్లో అన్ని పనుల్లో అప్రమత్తంగా మెలగాలి. అనుకోని సమస్యలు, అనారోగ్య భావనలు. కొత్త పనులను వాయిదా వేసుకోవాలి. పరిచయాల్లో ఒత్తిడులు. నిర్ణయాదుల్లో లోపాలు. ఆహార విహారాల్లో ఇబ్బందులు. గురు శుక్ర వారాల్లో అన్ని రకాల పనులు సులువుగా పూర్తవుతాయి. ఉన్నత లక్ష్యాలు. విద్యారంగంలో గుర్తింపు. కీర్తిప్రతిష్ఠలు. కొన్ని వ్యతిరేకతలు తప్పకపోవచ్చు. విజయం లభిస్తుంది. సంప్రదింపులు, ఖర్చులు ప్రభావితం చేస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఆదివారం పోటీలు, ఒత్తిడులు, చికాకులుంటాయి. వ్యతిరేకతలు అధికం. విజయ సాధన. శ్రమాధిక్యం. ఖర్చులు ప్రభావితం చేస్తాయి. విందులు వినోదాలు విహారాల విషయంలో జాగ్రత్త. సోమ మంగళ బుధవారాల్లో పరిచయాలు, అనుబంధాలు ప్రభావితం చేస్తాయి. కొత్తవారితో జాగ్రత్తగా మెలగాలి. భాగస్వామితో కలహాలకు దూరంగా ఉండాలి. నిర్ణయాదుల్లో తొందరపాటు కూడదు. సంప్రదింపుల్లో శుభ పరిణామాలు. గురు శుక్రవారాల్లో అన్ని పనుల్లో కొంత అప్రమత్తంగా మెలగాలి. ఊహించని సంఘటనలుంటాయి. వ్యవహారాల్లో కొంత ఒత్తిడి. నిర్ణయాదుల్లో జాగ్రత్త. సంతానవర్గ విషయంలో చికాకు ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఆదివారం ఆలోచనలకు రూపకల్పన. అభీష్టాలు నెరవేరుతాయి. సంతాన వర్గ వ్యవహారాలపై దృష్టి. లాభాలు సంతృప్తినిస్తాయి. వ్యాపార వ్యవహారాలు, ఆహార విహారాల్లో సంతృప్తి. సోమ మంగళ బుధవారాల్లో పోటీరంగం ప్రభావితం చేస్తుంది. అన్ని వ్యవహారాల్లో ఒత్తిడులుంటాయి. వ్యతిరేకతలున్నా శ్రమతో విజయం సాధిస్తారు. ఆలోచనల్లో ఒత్తిడులు, తొందరపాటు. లాభాలపై అధిక దృష్టి. కుటుంబంలో అనుకూలత. గురు శుక్రవారాల్లో పరిచయాలు విస్తరించే అవకాశం. స్నేహానుబంధాలు, కుటుంబ సంబంధాలు పెరుగుతాయి. శ్రబ తప్పకపోవచ్చు. ఆహార విహారాల్లో కొంత జాగ్రత్త. సౌఖ్యలోపాలుంటాయి.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఆదివారం సౌకర్యాదులపై దృష్టి. ఆహార విహారాలు ప్రభావితం చేస్తాయి. గృహ వాహనాదులపై దృష్టి. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. శ్రమ తప్పదు. సామాజిక గౌరవం పెంచుకుంటారు. సోమ మంగళ బుధవారాల్లో అభీష్ట సిద్ధి. అన్ని పనుల్లో అనుకూలత. నిర్ణయాలు లాభిస్తాయి. మానసిక ఉన్నతి. సౌఖ్య లోపాలు. తొందరపాటు అధికం. జాగ్రత్త. బాధ్యతలు, శ్రమ అధికవౌతాయి. నిర్ణయాదుల్లో శ్రమతో అనుకూలత. గురు శుక్రవారాల్లో పోటీలు, ఒత్తిడులు, చికాకులు అధికం. అన్ని రంగాల్లోనూ వ్యతిరేకతలుంటాయి. జాగ్రత్తగా అధిగమించాలి. సంప్రదింపుల్లో జాగ్రత్త. సోదర వర్గ సమస్యలుంటాయి. వ్యాపారాత్మక లక్ష్యాలను సాధిస్తారు.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆదివారం సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలు. ఇతరుల సహకారం లభిస్తుంది. కార్యనిర్వహణ దక్షత. ఉన్నత విద్యలపై దృష్టి. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. సంతృప్తి. సోమ మంగళ బుధవారాల్లో ఆహార విహారాలపై దృష్టి. ఆశించిన సౌఖ్యాలు అందక సమస్యలుంటాయి. సౌకర్య లోపాలు. సోదర వర్గంతో జాగ్రత్తగా మెలగాలి. అసంతృప్తి. దూర ప్రయాణ భావాలు. ధర్మ కార్యక్రమాలకు ఖర్చులు. గురు శుక్ర వారాల్లో అభీష్ట సిద్ధి. ఆలోచనలకు రూపకల్పన. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. సంతానవర్గ సంతృప్తి. కుటుంబం, ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి. మాట విలువ తగ్గుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆదివారం కుటుంబంలో అనుకూలత. ఆర్థిక నిల్వలను పెంచుకునే ప్రయత్నం. మాట విలువ పెరుగుతుంది. కొన్ని అనుకోని సంఘటనలుంటాయి. తొందరపాటు నిర్ణయాదులు కూడదు. సోమ మంగళ బుధవారాల్లో సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలు. సోదర వర్గంతో కొంత జాగ్రత్త అవసరం. మాట తీరును సమీక్షించుకోవాలి. ధనం శ్రమ వ్యర్థమయ్యే సూచనలు. పెద్దల ఆశీస్సులు, అండదండలు. గురు శుక్రవారాల్లో గృహ వాహనాది సౌకర్యాదులు ప్రభావితం చేస్తాయి. ఆహార విహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. బద్ధకంగా వ్యవహరిస్తారు. శారీరక ఒత్తిడులుంటాయి. వ్యాపారాదుల్లో లోపాలు. నష్టాలకు అవకాశం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఆదివారం ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. నిర్ణయాదులు లాభిస్తాయి. కార్యనిర్వహణ దక్షత. అనేక రకాల బాధ్యతలుంటాయి. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. అనుకూలత. సోమ మంగళ బుధవారాల్లో కుటుంబంలో శుభ పరిణామాలు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత. నిల్వధనంపై దృష్టి. ప్రవర్తనలో తొందరపాటు కూడదు. పరిచయాలు, అనుబంధాల్లో అనుకూలత. నిల్వధనంపై దృష్టి. ప్రవర్తనలో తొందరపాటు కూడదు. పరిచయాలు, అనుబంధాల్లో ఒత్తిడులుంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి. గురు శుక్రవారాల్లో సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త. అధికారిక వ్యవహారాలుంటాయి. పెద్దల సహకారం. వ్యర్థమైన ఖర్చులు.

కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఆదివారం విందులు వినోదాలకు అవకాశం. విహార యాత్రలుంటాయి. ఖర్చులు పెట్టుబడులకు అవకాశం. వ్యతిరేక ప్రభావాలున్నా విజయం సాధిస్తారు. సోమ మంగళ బుధవారాల్లో నిర్ణయాదులు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అన్ని బాధ్యతలను సంతోషంగా నిర్వర్తిస్తారు. వ్యర్థమైన ఖర్చులుండవచ్చు. వ్యతిరేక ప్రభావాలను అధిగమించాలి. పెద్దల ఆశీస్సులు. ధార్మిక వ్యవహారాలు. గురు శుక్రవారాల్లో కుటుంబ ఆర్థికాంశాలు ప్రభావితం చేస్తాయి. మాటతీరు వల్ల మేలు. నిల్వధనం పెరుగుతుంది. లక్ష్యాలను సాధిస్తారు. లాభాలు ఒత్తిడులకు గురి చేయవచ్చు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. శనివారం సంప్రదింపులు ప్రభావితం చేస్తాయి.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదివారం లాభాలు ప్రభావితం చేస్తాయి. పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నం. సంతానవర్గ వ్యవహారాల్లో అనుకూలత. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత జాగ్రత్త అవసరం. శ్రమాధిక్యం. సోమ మంగళ బుధవారాల్లో ఖర్చులు పెట్టుబడులు అధికం. వ్యర్థంగా కాలం ధనం కోల్పోయే అవకాశం. విందులు వినోదాల్లో కొంత జాగ్రత్త. గౌరవ లోపాలకు అవకాశం. ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. విద్యాత్మక వ్యవహారాలుంటాయి. గురు శుక్రవారాల్లో నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కార్యనిర్వహణ బాధ్యతలు అధికం. వృత్తి ఉద్యోగాదుల్లో ఘర్షణలుంటాయి. శ్రమతో వ్యవహారాలు. వ్యాపారాదుల్లో అనుకూలత. ప్రయోజనాలు.

--డాక్టర్ సాగి కమలాకరశర్మ