S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రక్తహీనత- బాలికలకు శాపం

సాధారణంగా బాలికలకి 10-14 సం. వయసులో రజస్వల అంటే మొట్టమొదటి నెలసరి కన్పిస్తుంది. వంశపారంపర్యంగా చాలా లేత వయసులో అంటే 10 సం.గాని లేక 14 సం.గాని అవుతుంది. రక్తస్రావంతోపాటు జననేంద్రియాల పెరుగుదల, సెక్సు కారక్టరు అంటే రొమ్ముల పెరుగుదల, బాహ్యేంద్రియాల మార్పు కలుగుతుంది. ఇదేకాక వారి మానసిక పరిణతి కూడా జరుగుతుంది.
కొంతమందికి 16, 17 సం.ల వయసు వరకు రజస్వల రాకపోతే డాక్టర్ పరీక్ష, సలహా మేరకు కొన్ని స్కానింగు వంటి పరీక్షలు, శోధనలు జరపాలి. ఈ కారణాలు చాలా రకాలుగా ఉండవచ్చు. మొదటిగా జన్యుపరమైన కారణాలు కొన్ని సిండ్రోములు, శరీర నిర్మాణంలో లోపాలు అంటే గర్భసంచి ముఖద్వారం మూసుకొనిపోయి ఉండడం, కనె్న పొర దళసరిగా వుండి రంధ్రం లేకుండా వుండడం జరుగవచ్చు. ఒక్కోసారి గర్భసంచి చాలా చిన్నదిగానో లేక అసలే లేకపోవడం, సగభాగం డెవలప్ అయి, అసంపూర్తిగా వుండిపోవడం జరుగవచ్చు.
అలా కిందిభాగం మూసుకొనిపోయి గర్భసంచి నార్మలుగా వుంటే రజస్వల అయినా లోపలే వుండిపోయి పైకి తెలియదు. ప్రతి నెలా కొంచెం కొంచెం రక్తం తయారై బయటికి వెళ్ళే దారిలేక లోపలే గడ్డలాగా వుండిపోయి ప్రతి నెలా కడుపునొప్పి, జ్వరం రావచ్చు. అప్పుడు గైనిక్ పరీక్ష చేయించి స్కానింగు చేస్తే లోపలి రక్తం గడ్డను కనిపెట్టవచ్చు. అలా తెలిస్తే దారిలోని పొర తొలగించి రక్తం బైటికి తీస్తే నెల నెలా సక్రమంగా రక్తం ప్రవహిస్తుంది. నొప్పి తగ్గిపోతుంది. తర్వాత జీవితంలో వివాహానికి, పిల్లలు పుట్టడానికి ఏమీ ఇబ్బంది వుండదు.
ఒకవేళ బ్లీడింగు రెండు మూడు నెలలకి ఒకసారి అవుతుంటే స్కానింగు తీసి పిసిఓడి వుందేమో కనుక్కోవాలి. అలాంటిది లేకపోతే మంచి ఆహారం, వ్యాయామం వంటి సహజమైన చికిత్స చేయిస్తే కొద్దికాలంలో నెల నెలా వచ్చే పీరియడ్ పరిస్థితి ఏర్పడుతుంది.
ఆడపిల్లలలో రక్తహీనత లేకుండా చిన్నప్పటి నుంచే చూసుకోవాలి. కొంచెం మొదట్లో ఓవరీలు పరిణతి పూర్తి అయ్యేవరకు ఆలస్యంగా వచ్చినా కంగారు అవసరం లేదు. అయితే వైద్య పర్యవేక్షణ అనివార్యం. ఎక్కువ రక్తస్రావం అవుతుంటే మాత్రం వెంటనే గైనకాలజిస్టు చేత పరీక్షలు చేయించి తగిన మందులు లేక ఒక్కోసారి ఇంజక్షన్ల ద్వారా రక్తస్రావం అరికట్టాలి. కొంతమందికి రక్తకణాలలో లోపాలు అంటే ప్లేట్‌లెట్స్ తక్కువగా వుండడం గాని ఇంకేదైనా రక్తకణాల లోపంగాని వుంటే దానికి వెంటనే ట్రీట్‌మెంట్ ఇస్తారు. దీన్ని కనుక్కోవాలంటే హిమోగ్రామ్ అనే పరీక్ష, బ్లీడింగ్ క్లాటింగ్ టైమ్ ఫైబ్రినోజన్ పరిమాణం అన్నీ చూడాలి. దీనికి రక్తకణాల స్పెషలిస్టులు వుంటారు (హిమటాలజిస్టులు) వారి సలహా ప్రకారం రక్తం లేక ప్లాస్మా ఎక్కించవలసి వుంటుంది. తల్లిదండ్రులు బాలికల వయసు 10-12 సం. రాగానే వారిని జాగ్రత్తగా గమనిస్తూ వారి కంప్లయింట్లని తోసిపారేయకుండా, వారి అలసట, చదువులో వెనుకబడటం, నీరసం వంటి లక్షణాల వెనుక ఏదైనా శారీరక లోపం, కారణం వుందేమో చూసుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగినులు ఈ బాధ్యత ఎంతో అవసరం.

డా. కేతరాజు సరోజినీ దేవి, ఎం.డి, డిజివో