S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (8-7-2018 నుంచి 14-7-2018 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆది సోమవారాల్లో నిర్ణయాదులు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. బాధ్యతల నిర్వహణలో సంతృప్తి. ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గ వ్యవహారాలు చర్చలకు వస్తాయి. సంతోషం. మంగళ బుధవారాల్లో కుటుంబ ఆర్థికాంశాలు ప్రభావితం చేస్తాయి. మాట తీరు వల్ల శుభ పరిణామాలు, సౌకర్యాలు సమకూర్చుకునే ప్రయత్నం. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి. అధికారిక వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. శ్రమ. గురు శుక్రవారాల్లో సంప్రదింపులకు అనుకూలం. సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలు. రచనలు వెలుగులోకి వస్తాయి. సౌకర్య లోపాలు. గృహ వాహనాదుల విషయాల్లో జాగ్రత్త. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. సంతోషం.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఆది సోమ వారాల్లో ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. విందులు వినోదాలు విహారాలపై దృష్టి. దూర ప్రయాణాలున్నా కొంత జాగ్రత్త. సౌకర్యాలు పెంచుకుంటారు. మంగళ బుధ వారాల్లో నిర్ణయాదులు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కార్యనిర్వహణ దక్షత, బాధ్యతలు అధికమైనా సంతృప్తి. దగ్గరి ప్రయాణాదులుంటాయి. భాగస్వామ్యాల్లో ఒత్తిడులున్నా అనుకూలత. ఖర్చులు అధికం. గురు శుక్రవారాల్లో కుటుంబంలో అనుకూలత. మాట తీరువల్ల ప్రయోజనాలు. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం. సంప్రదింపులు, దగ్గరి ప్రయాణాదులున్నా జాగ్రత్త అవసరం. పెద్దలతో వ్యతిరేకతలు కూడదు. పోటీ రంగంలో గెలుపు.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఆది సోమవారాల్లో లాభాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలున్నా కొంత అసంతృప్తి. సంప్రదింపుల్లో అనుకూలత. నిర్ణయాదులు ఇబ్బంది పెట్టవచ్చు. మంగళ బుధవారాల్లో ఖర్చులు పెట్టుబడులుంటాయి. సంతోషం కోసం కాలం ధనం వెచ్చిస్తారు. ప్రయాణావకాశాలు. విందులు వినోదాలు, విహారాలు. కుటుంబంలో అనుకూలత. నిల్వధనం కోల్పోవచ్చు. స్వల్ప ప్రమాదావకాశాలు. గురు శుక్రవారాల్లో కార్యనిర్వహణ దక్షత. అన్ని పనుల్లోనూ శుభ పరిణామాలు. నిర్ణయాదులు లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు కూడదు. మాటల వల్ల అపోహలు. సంతానంతో సంతోషంగా గడుపుతారు. విజయసాధన.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఆది సోమ వారాల్లో వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. అధికారిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. కార్యనిర్వహణలో సంతృప్తి. కుటుంబంలో అనుకూలత. ప్రభుత్వ సంబంధ పన్నులు. మంగళ బుధవారాల్లో ప్రయోజనాలపై దృష్టి. పెద్దల ఆశీస్సులను సాధించే ప్రయత్నం. లాభాలు ఆశించినంతగా అందకపోవచ్చు. నిర్ణయాదులకు అనుకూలత. సంతోషంగా గడుస్తుంది. భాగస్వామ్యాల్లో తొందరపాటు కూడదు. గురు శుక్రవారాల్లో ఖర్చులు పెట్టుబడులు పెరిగే అవకాశం. వ్యాపారాదులపై దృష్టి. విహార, విజ్ఞాన యాత్రలుంటాయి. మాటల్లో జాగ్రత్త. తొందరపాటు కూడదు. శ్రమతో సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. సౌఖ్యంగా కాలం గడుపుతారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఆది సోమవారాల్లో అత్యున్నత వ్యవహారాలపై దృష్టి. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. లక్ష్యాలను సాధించే యత్నం. ఉన్నత విద్యావకాశాలు, ప్రయాణాలు. సంతోషంతో గడుపుతారు. ప్రయోజనాలుంటాయి. మంగళ బుధవారాల్లో వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ప్రభావితం చేస్తాయి. అధికారులతో కొంత జాగ్రత్తగా మెలగాలి. బాధ్యతలు అధికం. పదోన్నతి కోసం ఖర్చు చేసే అవకాశం. లక్ష్యాలను సాధించడానికి పోటీ పడాల్సి రావచ్చు. గురు శుక్రవారాల్లో అన్ని పనుల్లో ప్రయోజన దృష్టి. వ్యాపార వ్యవహారాల్లో లాభాల కోసం శ్రమించాలి. కాలం ధనం కొంత వ్యర్థమయ్యే సూచనలు. విశ్రాంతి లోపం. పెద్దలతో సంప్రదింపులకు అవకాశం. సహకారం లభిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఆది సోమ వారాల్లో అన్ని పనుల్లో జాగ్రత్త. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. నూతన కార్యక్రమాలను వదిలిపెట్టాలి. సుఖభోగాలకు ఖర్చు చేస్తారు. వృత్తిలో గుర్తింపు. మంగళ బుధవారాల్లో అన్ని పనుల్లోనూ ఉన్నతి. వ్యవహార విజయం. గుర్తింపు. కీర్తిప్రతిష్ఠలు విస్తరిస్తాయి. లాభాలు సంతృప్తినిస్తాయి. లక్ష్యాలను సాధించే ప్రణాళికలుంటాయి. సంతాన వర్గ సంబంధ ఒత్తిడులు, అపోహలు, ఇబ్బందులు. గురు శుక్రవారాల్లో వృత్తిలో అనుకూలత. ఉద్యోగ వృద్ధి. వ్యాపారాలు ప్రభావితం చేస్తాయి. అధికారిక కార్యకలాపాలు. శ్రమతో సామాజిక గౌరవం. ఊహించని ప్రయోజనాలున్నా అప్రమత్తంగా మెలగాలి.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఆది సోమవారాల్లో భాగస్వామ్యాల్లో అనుకూలత, పరిచయాలు విస్తరించే అవకాశం. స్నేహానుబంధాలు బలపడతాయి. లాభాలు సంతృప్తినిస్తాయి. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. మంగళ బుధవారాల్లో అన్ని పనుల్లో జాగ్రత్త. ఊహించని సంఘటనలు. కొన్ని నష్టాలకు కూడా అవకాశం. నిర్ణయాదుల్లో ఆచితూచి వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాదుల్లో ఇబ్బందులు తప్పకపోవచ్చు. సౌకర్య లోపాలకు అవకాశం. గురు శుక్రవారాల్లో ఉన్నత వ్యవహారాలపై దృష్టి. లక్ష్యాలను సాధిస్తారు. వ్యాపార వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. సామాజిక గౌరవం పొందడంలో ఒత్తిడి. బాధ్యతలు అత్యధికం. నిర్ణయాదులు లాభిస్తాయి. సంప్రదింపులకు అనుకూలం.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆది సోమవారాల్లో వ్యతిరేక ప్రభావాలు అత్యధికవౌతాయి. పోటీ రంగంలో విజయం. గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమ ఉన్నా ఫలితాలు, పదోన్నతులు. అనుకోని సమస్యలు. మంగళ బుధవారాల్లో పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. భాగస్వామ్యాలపై ప్రత్యేక దృష్టి. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. ఉన్నత విద్యా వ్యవహారాల్లో ఒత్తిడులు. సోదర వర్గంతో కొంత జాగ్రత్తగా మెలగాలి. గురు శుక్రవారాల్లో అన్ని పనుల్లో జాగ్రత్త. వ్యాపారాదుల్లో లోపాలు. పెట్టుబడుల్లో జాగ్రత్త. దూర ప్రయాణాదులున్నా అసంతృప్తి. ఆశింపు అధికం. కుటుంబం, సంతానం కోసం అధిక ఖర్చులుంటాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆది సోమవారాల్లో మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. దూర ప్రయాణ దృష్టి. విహారయాత్రలు. భాగస్వామ్యాల్లో ఒత్తిడులు. మంగళ బుధవారాల్లో వ్యతిరేకతలు పెరిగే అవకాశం. గుర్తింపు కోసం ప్రయత్నం. శ్రమాధిక్యం. శత్రు రోగ రుణాలు ప్రభావితం చేస్తాయి. అనుకోని సమస్యలుంటాయి. ఊహించని సంఘటనలు. కుటుంబంలో ఒత్తిడులు. గురు శుక్రవారాల్లో పరిచయాలు పెంచుకుంటారు. భాగస్వామ్యాల్లో అనుకూలత. వ్యాపారాదులపై దృష్టి. పెట్టుబడుల్లో జాగ్రత్త. అత్యాశ కూడదు. నిర్ణయాదులు లాభిస్తాయి. సౌకర్యాలు సంతృప్తినిస్తాయి. శనివారం అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఆది సోమ వారాల్లో సౌకర్యాలపై దృష్టి. ఆహార విహారాలను శ్రమతో సాధించుకోవాలి. సంతానవర్గ సంబంధ సమస్యలుంటాయి. వ్యతిరేకతలున్నా విజయసాధన. మంగళ బుధవారాల్లో మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గంతో గడిపే ప్రయత్నం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. భాగస్వామ్యాల్లో సంతృప్తి. స్నేహానుబంధాలు బలపడతాయి. తొందరపాటు కూడదు. గురు శుక్రవారాల్లో పోటీలు, ఒత్తిడులు, వ్యతిరేకతలుంటాయి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ, గుర్తింపు కోసం ప్రయత్నం. భాగస్వామ్య సంబంధాలు ఇబ్బందికి గురి చేస్తాయి. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. శనివారం పరిచయాలు, స్నేహానుబంధాలపై దృష్టి.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఆది సోమ వారాల్లో సంప్రదింపులకు అనుకూలం. ఇతరులకు సహకారం అందించడం మంచిది. పరిచయాలు, అనుబంధాలు విస్తరిస్తాయి. ఆలోచనల్లో వత్తిడులుంటాయి. మంగళ బుధవారాల్లో ఆహార విహారాలపై దృష్టి. గృహ వాహనాది సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. సంతోషంగా గడుపుతారు. వ్యతిరేకతలుంటాయి. శ్రమాధిక్యం. కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలు. ప్రయాణావకాశాలు. ఖర్చులు. గురు శుక్రవారాల్లో అభీష్టాలు నెరవేరుతాయి. స్పెక్యులేషన్‌కు అనుకూలం. ప్రణాళికలకు రూపకల్పన. సంతానవర్గ వ్యవహారాలుంటాయి. పోటీలను అధిగమించాలి. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. లాభాలు. శనివారం వ్యతిరేకతలపై విజయం.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఆది సోమ వారాల్లో కుటుంబంలో అనుకూలత. మాటల్లో శుభ పరిణామాలు. నిల్వధనం పెంచే ప్రయత్నం. సంప్రదింపుల్లో ఇబ్బందులు. వాహనాది సౌకర్యాల వల్ల సమస్యలు. మంగళ బుధవారాల్లో సంప్రదింపులపై దృష్టి. ఏదో సమాచారం ఇబ్బంది పెట్టే సూచనలు. అభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గ సహకారం లభిస్తుంది. కుటుంబ, ఆర్థికాంశాల్లో అనుకూలత. లక్ష్యాలను సాధిస్తారు. ప్రయోజనాలుంటాయి. గురు శుక్రవారాల్లో సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. ఆహార విహారాలపై ప్రత్యేక దృష్టి. అభీష్ట సిద్ధి. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. ఆలోచనల్లో ఆందోళనకు అవకాశం. గౌరవ లోపాలుంటాయి. నిర్ణయ లోపాలకూ అవకాశం.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ