S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

క్రమశిక్షణ

క్రమశిక్షణ చాలా అవసరం.
నిజమైన క్రమశిక్షణ వుంటే మనం చేయాలనుకున్న పనులకు కార్యరూపం సిద్ధిస్తుంది.
మనం కొన్ని పనులు చేద్దామని అనుకుంటాం. వాటిని అమలు చేయడాన్ని వాయిదా వేస్తాం. రోజూ ఉదయం ఐదు గంటలకి నిద్రలేచి కొంతమంది రచయితలు రచనలు చేద్దామని అనుకుంటారు. చిత్రకారులు చిత్రాలని. ఇట్లా వివిధ రంగాల్లో వున్నవాళ్లు వాళ్ల పనులు చేద్దామని అనుకుంటారు. కానీ వాయిదా వేస్తూ ఉంటారు. అదే విధంగా ఉదయానే్న లేచి వాకింగ్ మొదలుపెడదామని అనుకుంటారు. బరువు తగ్గడానికి ఆహార నియమాలు పాటిద్దామని అనుకుంటారు. కానీ అమలు చేయడంలో విఫలం అవుతూ ఉంటారు.
కొత్త ఊహలు వస్తూ ఉంటాయి. లేడికి లేచింది పరుగులా వుండకూడదని అంటారు. తొందరలో నిర్ణయాలు తీసుకోకూడదని అంటారు. అది వాస్తవమే. అయితే కొత్త ఊహలని, కొత్త ఆలోచనలని అలా మాగనివ్వకూడదు. దాని వల్ల ఆ విషయాన్ని మరిచిపోయే అవకాశం ఏర్పడుతుంది. ఆ విషయం చేయాలన్న కోరిక బలంగా ఉన్నప్పుడు, మనలో భావోద్వేగం వున్నప్పుడు, అది వేడిగా ఉన్నప్పుడు దాన్ని అమలులో పెట్టాలి. ఆలస్యం అయిన కొద్దీ అది మసకబారుతుంది. ఓ వారం రోజులకో, ఓ నెలకో, ఓ సంవత్సరానికో అది కన్పించకుండా పోతుంది.
అందుకని మన కొత్త ఊహ, కొత్త ఆలోచన అమల్లో పెట్టడానికి వెంటనే చర్యలు చేపట్టాలి.
అయితే చేయాలన్న కోరిక బలంగా వున్నప్పుడు మనం చూసుకోవాల్సిన అంశాలు రెండు ఉంటాయి. అవి - మన ఆలోచన స్పష్టంగా ఉందా లేదా చూసుకోవాలి. అట్లాగే అది శక్తివంతంగా ఉందా లేదా కూడా చూసుకోవాలి.
మన ఆలోచనలు, మన ఊహలు అమల్లోకి రావాలంటే క్రమశిక్షణ ఉండాలి.
క్రమశిక్షణ సరిగ్గా లేని వ్యక్తులు ఎవరైనా కొంతమంది అభివృద్ధిలోకి వచ్చి వుండవచ్చు. కానీ చాలా తక్కువ. క్రమశిక్షణ వున్న వ్యక్తులే అభివృద్ధిలోకి వస్తారు.
మన శక్తిమేరకు, మన నైపుణ్యం మేరకు మనం పని చేస్తూ ఉండాలి. అది పూర్తిగా వినియోగించాలి. ఏ మాత్రం తక్కువ చేయడానికి వీల్లేదు. అది ఒక్క శాతం కూడా కావడానికి వీల్లేదు.
అదే విధంగా నిర్లక్ష్యం కూడా ఒక్క శాతం వుండటానికి వీల్లేదు.
కొన్ని పనులు చేయడానికి క్రమశిక్షణ ఎంత అవసరమో అంతకు మించి అది అమలులో పెట్టడానికి తగు చర్యలు తీసుకోవడం ఇంకా అవసరం.

- జింబో 94404 83001