S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రస సుధాకరం

డా.రుద్రవరం సుధాకర్ ప్రఖ్యాత నర్తకుడు, గురువు, రచయిత, పరిశోధకుడు. వీరు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నృత్యశాఖలో దశాబ్దాలుగా పని చేస్తున్నారు. వీరి జీవిత భాగస్వామి డా.రత్నశ్రీ కూడా నర్తకి, గురువు, రచయిత్రి, పరిశోధకురాలు. భార్యాభర్తలిద్దరూ నృత్యానికే అంకితమయ్యారు.
ప్రస్థానం
డా.రుద్రవరం సుధాకర్‌గారు డిసెంబర్ 9, 1963న జన్మించారు. చిన్నప్పటి నుండీ నాట్యం అంటే ఎంతో ప్రేమ. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కూచిపూడి నృత్యం బి.ఏ.-1990, ఎం.ఏ -1992లో చేశారు. చదివిన చోటే అధ్యాపకుడిగా 1992లో మొదలుపెట్టి 26 ఏళ్లుగా ఇక్కడ పని చేస్తున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో, నృత్య శాఖ నుండి ‘కూచిపూడి - కర్ణాటక - తంజావూరు యక్షగానముల తులనాత్మక పరిశీలన’ అనే పరిశోధనాంశంతో పిహెచ్.డి పొందారు 2009లో. 1984లో శ్రీ సిద్ధేంధ్ర కళాపీఠం స్థాపించి ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దుతున్నారు. వీరి శిష్యులు ప్రశిష్యులు దేశ విదేశాలలో వ్యాపించి ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, హ్యూమన్ రిసోర్సెస్ నుండి జెఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్ పొందారు. ఎన్నో వ్యాసాలు ప్రచురించారు. ఎన్నో పుస్తకాలు రాశారు.
* డా.సుధాకర్ ఎన్నో విదేశాలు పర్యటించి, కూచిపూడి కీర్తి పతాకను ఆయా దేశాలలో ఎగురవేశారు. మారిషస్, సింగపూర్, యుఎస్‌ఏలో న్యూజెర్సీ, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, డల్లాస్ మొదలగు టూర్స్ చేసి కళాసేవ చేశారు.
* 1984లో ‘శ్రీ సిద్ధేంద్ర కళాపీఠం’ నృత్య శిక్షణాలయం స్థాపించి కూచిపూడి సంప్రదాయ నృత్యం నేర్పిస్తున్నారు. వీరికి వందల మంది శిష్యులు, ప్రశిష్యులు దేశ విదేశాలలో ఉన్నారు. ప్రతి సంవత్సరం డా.సుధాకర్‌గారి శిష్యులు కూచిపూడి సర్ట్ఫికెట్, డిప్లొమా పరీక్షలు పాసవుతున్నారు. ఎంతోమంది శిష్యులు అరంగేట్రం చేసి ఉత్తమ కళాకారులుగా రూపుదిద్దుకుంటున్నారు.
అవార్డులు
* కూచిపూడి నృత్యంలో, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, లలిత కళాపీఠం నుండి పిహెచ్.డి -2009-10
* ఉత్తమ యువ నర్తకుడు - వి.బి.ఎం. ఆర్ట్ థియేటర్ - 1992
* దేవేందర్ మెమోరియల్ అవార్డు - ఉత్తమ కొరియోగ్రఫీ - నటరాజ నృత్యం అకాడెమీ, 1999
* అన్నమాచార్య స్కాలర్‌షిప్ అవార్డు - 1993
* జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, న్యూఢిల్లీ, 1999-2001 - సిద్ధేంద్ర యోగిపై జయదేవుని ప్రభావం - పరిశోధనాంశం.
* సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ - మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ - న్యూఢిల్లీ (2002-04) పరిశోధనాంశం - కూచిపూడి యక్షగానాలు - తంజావూరు యక్షగానాల తులనాత్మక పరిశీలన.
కొరియోగ్రఫీ - రూపకల్పన
* ‘సీతాకళ్యాణం’ బి.ఎన్. మూర్తిగారి రచన. ‘విజయదశమి’ జె.బాపురెడ్డిగారి రచన. సిద్ధేంద్ర యోగి చరిత్ర - వేదాంతం పార్వతీశం రచన. ‘మైథిలీం’- డి.వి.నారాయణమూర్తి రచన. శ్రీమహావిష్ణు పరివారం - టి.ఆర్.జి.కె. విఠల్ రచన.
పాత్రలు
డా.సుధాకర్‌గారు ఎన్నో పాత్రలు పోషించి, ప్రేక్షకులను రసానందంలో ఓలలాడించారు. అందులో కొన్ని పాత్రలు-
* బ్రహ్మ - చిత్రకూట మహత్యం
* లక్ష్మణుడు - సుగ్రీవ విజయం
* సిద్ధేంద్ర యోగి - సిద్ధేంద్ర యోగి
* బలిచక్రవర్తి - బలి విజయం
ముముక్షువులో ప్రధాన పాత్ర.
ప్రచురణలు
* కూచిపూడి యక్షగాన ప్రస్థానం, 2005 పాఠ్య పుస్తకం
* నాట్య రమణీయం - తెలుగు విశ్వవిద్యాలయం, డిసెంబర్ 2009 - అసిస్టెంట్ ఎడిటర్
* కూచిపూడి నాట్య ప్రస్థానం - డిసెంబర్ 2006, తెలుగు విశ్వవిద్యాలయం వారి ‘కూచిపూడి నాట్యోత్సవాలు’లో.
* ‘నాట్యసేవలో నాయకరాజులు’ తెలుగు అకాడెమీ వారి త్రైమాస పత్రికలో -2009 జనవరి
* ‘జయదేవుని ప్రభావం సిద్ధేంద్ర యోగి మీద’ నాట్య రమణీయకం - పి.ఎస్.తెలుగు విశ్వవిద్యాలయం.
* ‘ఆంధ్రప్రదేశ్ కళా వైభవం’ నేటి నిజాం డైలీ, 7.6.2002
* ‘పద సాహిత్య మార్గదర్శకుడు మా అన్నమయ్య’ - కృష్ణాపత్రిక - 3.6.2002
* ‘జానపద జీవితంలో కళ’ ప్రజా పోరాటం - 25.8.92
* ‘జానపద భావ - సారూప్యం’ - మహానగరం డైలీ - 9.8.1998
*

-డాక్టర్ శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి