S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎము‘కలకలం’ గుర్తించారా?

ముప్ఫై, నలభై సంవత్సరాల వయస్సు వరకు ఎముకలు దృఢంగా ఉంటాయి. ఆ తర్వాత మెల్లమెల్లగా ఎముకల్లోని కాల్షియం, విటమిన్ ‘డి’ తగ్గి పల్చబడిపోతాయి. అందుకనే నడుము, ఛాతీ ముందుకు వంగి పొడుగు తగ్గిపోవడం జరుగుతుంది. ప్రతి స్ర్తీకి మెనోపాజు తర్వాత ప్రతి పది సంవత్సరాలు అంటే దశాబ్దానికి ఒక సెంటీమీటరు పొడవు తగ్గుతుంది. ఎన్ని దశాబ్దాలైతే అని సెంటీమీటర్లు తగ్గుతుంది. ఇది ఎలాగంటే వెనె్నముకలోని చిన్న చిన్న ఎముకలు పూసలలాగ ఒక దొంతరగా ఉంటాయి. మెనోపాజు, ఆ తర్వాత శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోను తగ్గిపోయి ఎముకలు అన్ని ప్రదేశాలలోనూ పలుచగా అయిపోతాయి. అయితే నడుములోని పూసల మధ్య కార్టిలేజి కూడా ఎముకలతో పాటు సన్నబడి ఎముకలు (వర్టిబ్రా) ఒకదానిపై ఒకటి కుదబడిపోతాయి. దీంతో ఎత్తు తగ్గిపోతుంది. కొన్నిచోట్ల శరీరం బరువు మోయలేక లేదా ఒక పొజిషను అలవాటైతే దానికి అనుగుణంగా అడ్డదిడ్డంగా వంగిపోతుంది శరీరం.
చేతులు, కాళ్లలోని ఎముకలు బలహీనపడితే చిన్నదెబ్బలకే ఎముకలు చిట్లిపోవడం లేక ముక్కలయిపోవడం కద్దు. కూర్చుని లేచేటప్పుడు అరచేయి నేలపై మోపి లేచే అలవాటుంటే ముంజేతి ఎముకలు విరిగిపోయి ఒక చెంచా వంటి ఆకారంతో అతుక్కోవచ్చు చికిత్స ఆలస్యం చేస్తే..
ఇలా అవకుండా ఉండాలంటే ఆహారంలో చిన్నప్పటి నుంచి కాల్షియం, విటమిన్ డి.. ఉండేట్టు చూడడం, ఆడవారికి మెనోపాజు సమయంలో తప్పక కాల్షియం, ఈస్ట్రోజన్ హార్మోను చిన్నమోతాదులో ఇవ్వాలి. ముఖ్యంగా అరవై సంవత్సరాలలోపు వయసులో హార్మోను చికిత్స (ఎం.ఆర్.టి) ఇస్తే ఎముకలు గట్టిగా ఉండి బతికినన్నాళ్లూ మంచానపడి ఒకరిపై ఆధారపడకుండా గౌరవంగా బతకవచ్చు.
అయితే ఈ హార్మోన్లు, కాల్షియమే కాక వ్యాయామం, రోజువారీ నడక, యోగాసనాలు, సూర్య నమస్కారాలు, మంచి ఆహారం, ఆరోగ్యమైన అలవాట్లు, మానసిక ఆనందం, ఉపకార బుద్ధి కూడా ఉండాలి ఈ వయసువారికి. హఠాత్తుగా ఇవన్నీ ఒక్కరోజులో రావు కనుక చిన్నవయసు నుంచి మంచి సమతుల ఆహారం, పాలు, పెరుగు, క్రోధావేశాలను అదుపులో ఉంచుకోవడం, వ్యాయామం, ఆటలు పిల్లలకు నేర్పించాలి. అప్పడే మంచి పౌరులున్న మంచి దేశం తయారవుతుంది.
వృద్ధులైన కుటుంబ సభ్యులచేత వాకింగ్ వంటివి చేయించడం, ప్రతి ఆరు, పనె్నండు నెలలకు ఒకసారి వైద్యపరీక్షలు, బోన్ డెన్సిటీ వంటివి, విటమిన్ డి పరీక్షలు చేయించి వారికి కాన్సర్ స్కీ నింగ్, ఈసీజీ వంటివి, గుండె పరీక్షలు, కంటిచూపు పరీక్షలు చేయించే బాధ్యత పిల్లల మీదే ఉంటుంది.

డా. కేతరాజు సరోజినీ దేవి, ఎం.డి, డిజివో