S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (5-8-2018 నుంచి 11-8-2018 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఆదివారం ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు కోసం ప్రయత్నం. కొన్ని చికాకులున్నా శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. సోమవారం కుటుంబ ఆర్థికాంశాలు ప్రభావితం చేస్తాయి. అధికారిక సంప్రదింపులుంటాయి. సమాచార ప్రయోజనం. మంగళవారం సౌకర్యాలు సంతృప్తినిస్తాయి. మాట తీరులో శుభ పరిణామాలు. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. బుధవారం సంప్రదింపులకు అనుకూలం. సౌకర్యాలపై దృష్టి. ఆహార విహారాల్లో అపశ్రుతులుంటాయి. గురువారం భాగస్వామ్యాల్లో అనుకూలత. కొత్త పరిచయాలు. ఒక వార్త సంతృప్తినిస్తుంది. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. శుక్రవారం ఆధ్యాత్మిక భావనలు.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఆదివారం ఖర్చులు పెట్టుబడులు తప్పకపోవచ్చు. సంతానవర్గం కోసం కాలం ధనం వెచ్చిస్తారు. ఆలోచనల్లో అనుకూలత. విశ్రాంతి లభిస్తుంది. సోమవారం ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత జాగ్రత్త. మాటల్లో అధికారిక ధోరణి. మంగళవారం బాధ్యతలు అధికం. అనేక కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు. బాధ్యతల నిర్వహణపై ప్రత్యేక దృష్టి. బుధవారం పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. పోటీ నుండి తొలగాలి. ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. నిల్వధనం. శుక్రవారం అన్ని పనుల్లో జాగ్రత్త. సంప్రదింపుల్లో సమస్యలు. సోదర వర్గంతో ఇబ్బందులు. ఆలస్య నిర్ణయాలు. శనివారం కొత్త సమాచారంపై దృష్టి. సంతానవర్గంతో సంతోషం.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఆదివారం లాభాలు సంతోషాన్నిస్తాయి. గృహ వాహనాదులు అనుకూలం. ఆహార విహారాల్లో శుభ పరిణామాలు. సౌకర్యాలను పెంచుకునే ప్రయత్నం. సోమవారం ఖర్చులు పెట్టుబడులు తప్పవు. నిల్వధనం కోల్పోవచ్చు. కుటుంబంలో ఒత్తిడులు. అధికారులతో జాగ్రత్త. మంగళవారం విశ్రాంతి కోసం ప్రయత్నం. ప్రయాణావకాశాలు. ప్రమాదావకాశాలు. సౌఖ్యం లభిస్తుంది. బుధవారం మాటల్లో జాగ్రత్తగా మెలగాలి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కుటుంబంలో ఒత్తిడులకు అవకాశం. గురువారం మనోభీష్టాలు నెరవేరుతాయి. అన్ని పనుల్లో అనుకూలత. సంతాన సౌఖ్యం. నిర్ణయాదులు లాభిస్తాయి. సంతృప్తి. శుక్రవారం భాగస్వామ్యాల వల్ల సమస్యలు.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఆదివారం వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. సంప్రదింపుల వల్ల హోదా పెంచుకుంటారు. కొత్త సమాచారం సంతృప్తినిస్తుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. సోమవారం అన్ని పనుల్లో ప్రయోజన దృష్టి. శారీరక ఒత్తిడులు. కొంత అస్వస్థత. చికాకుగా ఉంటుంది. పెద్దలతో జాగ్రత్త. మంగళవారం లాభాలపై దృష్టి. వ్యవహారాల్లో అనుకూలత. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. ఆశీస్సులు లభిస్తాయి. బుధవారం నిర్ణయ లోపాల వల్ల ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు. పెట్టుబడుల్లో సమస్యలు. సౌఖ్యలోపాలుంటాయి. గురువారం సౌకర్యాలపై దృష్టి. ఆహార విహారాల కోసం పెట్టుబడులుంటాయి. సౌఖ్యంగా గడుపుతారు. శుక్రవారం పోటీలు ఒత్తిడులు తీవ్రవౌతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఆదివారం లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కుటుంబంలో అనుకూలత. మాటల్లో అత్యంత శుభ పరిణామాలు. ఉన్నత విద్య. దూర ప్రయాణాల కొరకు ప్రయత్నాలు. సోమవారం ప్రభుత్వ పన్నులను చెల్లించాలి. అధికారిక వ్యవహారాల్లో ఖర్చులుంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు. ఉన్నతి. మంగళవారం సామాజిక వ్యవహారాల్లో అనుకూలత. పదోన్నతి. వ్యతిరేకతలున్నా పోటీ రంగంలో విజయ సాధన. బుధవారం లాభాలున్నా వ్యర్థంగా వెళ్లిపోతాయి. పెట్టుబడుల్లో జాగ్రత్త. కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలు. పెద్దలతో జాగ్రత్త. గురువారం గురుతుల్యులతో సంప్రదింపులు. అన్ని పనుల్లో లాభాలు. ప్రయాణాదులకు అనుకూలం. సంతృప్తి.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఆదివారం అన్ని పనుల్లో జాగ్రత్త. తమ నిర్ణయాదులు తమకే ఇబ్బంది పెట్టవచ్చు. లక్ష్యాలు దెబ్బతినే సూచనలు. అన్ని పనులను వాయిదా వేయాలి. ఊహించని సంఘటనలు. సోమవారం అన్ని పనులకూ అనుకూలం. లాభాలు సంతృప్తినిస్తాయి. పెద్దల అనుకూలత. ప్రభుత్వ సహకారం. మంగళవారం ఉన్నత విద్య, ఉద్యోగాదులపై దృష్టి. దూర ప్రయాణాలు. ఆధ్యాత్మిక వ్యవహారాలకు అనుకూలం. బుధవారం అధిక ప్రయోజనాలపై ఆసక్తి. అపోహలకు అవకాశం. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత జాగ్రత్తగా మెలగాలి. గురువారం ఆర్థిక నిల్వలను పెంచుకుంటారు. మాటల వల్ల సామాజికమైన ఉన్నతి కలుగుతుంది. గుర్తింపు లభిస్తుంది.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఆదివారం భాగస్వామ్యాల్లో అనుకూలత. విందులు వినోదాలుంటాయి. సౌఖ్యంగా గడుపుతారు. ఖర్చులు పెట్టుబడుల్లో సంతృప్తి. ప్రయాణావకాశాలు. విశ్రాంతి. సోమవారం అన్ని పనుల్లో జాగ్రత్త. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులకు అవకాశం. అధికారులతో ఇబ్బందులుంటాయి. మంగళవారం కొత్త పనులను వాయిదా వేసుకోవాలి. ఊహించని ఇబ్బందులకు అవకాశం. సౌఖ్యలోపం. ఆహార విహారాల్లో జాగ్రత్త. బుధవారం అనేక కార్యక్రమాలపై దృష్టి. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. సుదూర ప్రయాణాలకు అవకాశం. గురువారం నిర్ణయాదుల్లో సంతృప్తి. బాధ్యతలు ఆనందాన్నిస్తాయి. కార్యనిర్వహణపై దృష్టి. ఆధ్యాత్మిక వ్యవహారాలు. సంప్రదింపులుంటాయి.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఆదివారం పోటీ రంగంలో గుర్తింపు. వ్యతిరేక ప్రభావాలుంటాయి. విజయంపై దృష్టి. భాగస్వామ్య ప్రయోజనాలు అధికం. రుణ రోగాదులపై విజయం సాధిస్తారు. సోమవారం పరిచయాలు విస్తరించే అవకాశం. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. శ్రమాధిక్యం. మంగళవారం స్నేహానుబంధాలు విస్తరించే అవకాశం. భాగస్వామ్యాల్లో అనుకూలత. సౌఖ్యంగా గడుపుతారు. బుధవారం నూతన పరిశోధనలపై దృష్టి. అన్ని పనుల్లో జాగ్రత్త. ఊహించని నష్టాలకు అవకాశం. ప్రయాణాల్లో ఒత్తిడులు. గురువారం ధార్మికమైన ఖర్చులపై దృష్టి. ఆధ్యాత్మిక యాత్రల వల్ల మేలు. దానధర్మాలు ప్రశాంతతను ఇస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఆదివారం మనోభీష్టాలు నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్త వహించాలి. సంతానవర్గ సంతృప్తి. అధికారిక వ్యవహారాల్లో అనుకూలత. విజయ సాధన. సోమవారం పోటీలు ఒత్తిడులు అధికం. అధికారిక వ్యవహారాల్లో ఇబ్బందులుంటాయి. పితృవర్గ సమస్యలుంటాయి. మంగళవారం అనుకోని సమస్యలు. అనారోగ్య లోపాలు. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. రుణ రోగాదులుంటాయి. బుధవారం పరిచయాల్లో ఒత్తిడులు. కార్యనిర్వహణలో జాగ్రత్త. నూతన కార్యక్రమాలపై దృష్టి. శ్రమాధిక్యం. గురువారం అన్ని పనుల్లో ప్రయోజనాలుంటాయి. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. లాభాలు సంతృప్తినిస్తాయి. శుక్రవారం నిర్ణయాదులు ఇబ్బంది పెడతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఆదివారం సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. ఆహార విహారాల్లో శుభ పరిణామాలు. లక్ష్యాలను సాధిస్తారు. కార్యనిర్వహణ దక్షత. సౌఖ్యంగా గడుపుతారు. సోమవారం మనోభీష్టాలు నెరవేరుతాయి. భాగస్వామ్యాల్లో ఒత్తిడులుంటాయి. అధికారిక కార్యక్రమాల ఒత్తిడులు. మంగళవారం పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. ఆలోచనలకు రూపకల్పన. తొందరపాటు కూడదు. బుధవారం అన్ని పనుల్లో జాగ్రత్త. కొత్త పరిచయాల్లో సమస్యలు. అపోహలు అధికం. వ్యతిరేకతలుంటాయి. శ్రమాధిక్యం. గురువారం వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు లభిస్తుంది. అధికారిక వ్యవహారాల్లో అనుకూలత. గౌరవం పెరుగుతుంది. శుక్రవారం వ్యర్థమైన ఖర్చులు.

కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఆదివారం సంప్రదింపుల్లో జాగ్రత్త. అనుకోని ఇబ్బందులు. అపోహలకు అవకాశం. సౌకర్య లోపాలు. కీర్తి ప్రతిష్టలు తగ్గే సూచనలు. లక్ష్యాలను సాధిస్తారు. సోమవారం వ్యతిరేక ప్రభావాలు అధికం. ఆహార విహారాల్లో అనుకూలత. కార్యనిర్వహణలో గుర్తింపు లభిస్తుంది. మంగళవారం గృహ వాహనాది వ్యవహారాలపై దృష్టి. శ్రమ ఉన్నా సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. బుధవారం అన్ని పనుల్లో వ్యతిరేకతలుంటాయి. పోటీలు, ఒత్తిడులు, చికాకులున్నా కార్యక్రమాల నిర్వహణ. గురువారం అన్ని పనుల్లో విజయ సాధన. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. మనస్సు ప్రశాంతం. ఆధ్యాత్మిక వ్యవహారాలుంటాయి. శుక్రవారం లాభాలున్నా కొంత శ్రమ తప్పదు.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదివారం కుటుంబ ఆర్థికాంశాలు ప్రభావితం చేస్తాయి. పరిచయాలు విస్తరిస్తాయి. భాగస్వామ్యాల వల్ల ఆర్థిక నిల్వలు పెరిగే సూచనలు. మాట తీరులో మెలకువలుంటాయి. సోమవారం ఆహార విహారాలపై దృష్టి. ఆలోచనల్లో వత్తిడులు. సంతానవర్గ సమస్యలుంటాయి. శ్రమతో కార్యాలు. మంగళవారం ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గ వ్యవహారాల్లో అనుకూలత. సంప్రదింపులకు అనుకూలం. బుధవారం మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనల్లో వైవిధ్యం. అపోహలకు అవకాశం. దైవధ్యానం వల్ల మేలు. గురువారం గౌరవ లోపాలకు అవకాశం. సౌకర్యాలు శ్రమకు గురి చేయవచ్చు. ఆహార విహారాల్లో జాగ్రత్త వహించాలి.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ