పునరుజ్జీవన ప్రస్థానంలో నేను..
Published Saturday, 11 August 2018నేను..
విశ్వ ప్రతీకను.
చారిత్రక పరిణామ ప్రతిమను.
అస్తిత్వ ఆరాట పటిమను.
వెరసి... వైయక్తిక సంస్కృతీ పరిణామ ప్రతిబింబాన్ని.
అయినా.. అన్ని వ్యవస్థలలోను ఇండిపెనె్డన్ట్.
ఈనాటి పరిభాషలో-
నేను - Man - is the measure of all things అన్నిటికీ కొలమానాన్ని.
నేను - The humanbody - is the most perfect instrument for the self expression of consciousness చైతన్య స్వవ్యక్తీకరణకు సరియైన సాధనాన్ని.
ఇంకాస్త ఆధునిక స్వరంలో చెప్పుకోవాలంటే-
నేను -Renaissance Man పునరుజ్జీవన మానవ అస్తిత్వాన్ని.
మొత్తానికి, ఈ ‘పునరుజ్జీవన నేను’కు నేపథ్యంగా సాంస్కృతిక పురోగతి, పాంచభౌతిక పరిణతి, విశ్వమైత్రి వేళ్లూనుకుని ఉన్నాయి. కొన్ని వేల, లక్షల, కోట్ల బంధాల అనుబంధం పెనవేసుకుని ఉంది.
‘నేను’ చుట్టూ విభిన్న వ్యవస్థలు.. విపరీత ధోరణులు.. ‘సంక్లిష్టత’ల నడుమ ‘సంసార’ తాపత్రయాలు.. అవాంతరాలు.. అవరోధాలు. అయినా నిలదొక్కుకోవాలనే అస్తిత్వ ఆరాటం. సామాజిక వ్యవస్థలో ఈ అయోమయ ‘అవస్థీకరణ’లో ‘నేను’కు ఎప్పటికప్పుడు తప్పిపోతున్నాననే అభద్రతా భావం.. చివరికి కొనఊపిరిలో సైతం సంక్షోభాల నుండి బయటపడటం.. ఆశ చిగురించటం.. అవకాశం పల్లవించటం.. పట్టుదొరికిందన్న ఆలోచన పొటమరించటం.. ఆ‘లోచన’ మహావృక్షంలా వేళ్లూనుకోవడం.. జీవితం కొత్తగా కొమ్మలు రెమ్మల నీడన వొదగటం. ఓహ్.. ఈ ప్రస్థానమంతా ‘నేను’కు పునరుజ్జీవనమే!
అవును, ‘నేను’కున్న తెలివితేటల విస్తృతి పరివ్యాప్తమవుతూ ‘మేధాసంపన్నత’గా పదుగురిని ఆకర్షించటమూ.. ప్రభావితం చేయటమూ ఒక మా‘నవ’ పరిణామమే! ఫలితం - మానవత్వంలో పునరుజ్జీవన వికాసం.
* * *
‘నేను’
సదా అభ్యసనశీలి.
అస్తిత్వ అంశతో నేర్చుకునే ప్రక్రియలో ముందుండటం ‘నేను’కు ప్రకృతి ప్రసాదించిన వరం.
కాబట్టి, ‘నేను’ వరకు మానవత్వం ఒక తత్త్వంలా అనిపిస్తున్నా నిజానికి అది మానవ నైజం. స్వభావం. ఆ నేర్చుకోవటం అనే ప్రక్రియనే ‘నేను’ను కాలరేఖపైన నిలుపుతుంది. వర్తమానంలోనే కాక భవిష్యత్తులో సైతం నిలదొక్కుకునేలా చేస్తుంది. అందుకే ‘నేను’కు జీవితం ఎల్లప్పుడూ ఒక పాఠశాలనే. నేర్చుకుంటూ నేర్చుకుంటూ ‘నేను’ ఎప్పటికీ మేధావినే! సమర్థ‘శీలినే’!
ఎంతలా చదవగలిగితే అంతలా చదువుకుంటూ పోవటం లెర్నింగ్! ఈ క్రమంలో సమీప భవిష్య జీవనానికి ఆలంబన దేహం. బుద్ధి అంటే దేహ దారుఢ్యత, మనోకుశలత. మొత్తానికి మానవ పునరుజ్జీవన వ్యవస్థలో బౌద్ధిక క్షేత్రాన్ని ప్రత్యేకంగా మలచటం అనేది ప్రధాన ఘట్టం. అయితే, ఇది భౌతిక జీవనం వరకే.. అధిభౌతిక వ్యవస్థలో మాత్రం ‘నేను’ విశ్వ ప్రతీక కావలసిందే.. మనోకౌశలమంతా ‘విశ్వ’శక్తిగా పరిణమించాల్సిందే. వైయక్తిక ప్రతిభ అంతా విశ్వ ‘ప్రజ్ఞానం’గా భాసురం కావలసిందే.
అందుకే ‘నేను’ అంటే ఈ ‘దృశ్య నేను’ మాత్రమే కాదు.. దృశ్య నేనుకు ‘ఆఫ్టర్ లైఫ్’ అనిపించినా ‘అదృశ్య నేను’ మాత్రం తపించేది. ‘ఆఫ్టర్ డెత్’ క్షేత్రజ్ఞత కోసమే.
* * *
‘నేను’
బుద్ధిజీవి.. అంటే ‘నేను’ది బౌద్ధిక ప్రస్థానం. బౌద్ధిక ప్రస్థానం ఆలోచనా చైతన్య స్రవంతిగా సాగుతుంటుంది. ‘నేను’ మానసికం. మన జీవన శైలిలో ‘మనసు పడటం’ అంటే మానసికమనే. ఈ మనసు పడటమే ‘కోరిక’. తీవ్రతను బట్టి అదే కోరిక వ్యామోహం అనీ అనిపించుకుంటుంది. ఫలితంగా, ‘కోరిక’ నుండి రకరకాల భావాలు, భావోద్వేగాలు, అనుభూతులు, ఆలోచనలు, అభిప్రాయాలు, దృక్పథాలు పుట్టుకొస్తుంటాయి. ఇవన్నీ ‘నేను’ను నిర్వచిస్తుంటాయి.. ‘నేను’కున్న ప్రాపంచిక వర్తనాన్ని స్పష్టంగా చూపిస్తుంటాయి. ఆలోచించటం, నిర్ణయానికి రావటం, ఆచరణలో పెట్టటం, గుర్తించటం, విశే్లషించటం, విమర్శించటం - ఇవన్నీ మానసిక చర్యలే! మానసిక ప్రక్రియల ఫలితాలే ఫీలింగ్స్, ఎమోషన్స్..
తమాషా ఏమిటంటే మన వర్తనానికి మూలం మనస్సే అయినప్పటికీ మానసికాల ఆచరణ దేహావయవాల ద్వారా వ్యక్తమవుతుంటుంది కాబట్టి మానసికాలు సైతం దైహికాలుగా ముద్ర పడుతుంటాయి. ఈ బాడీ-మైండ్ లింక్ వల్లనే మనస్సును ‘్ఫజికల్ బ్రెయిన్’ అనీ అంటుంటాం. అందుకే మైండ్ - బాడీ లింక్‌గా నాడీ వ్యవస్థ అన్నది బలమైన వాహిక అవుతోంది. ఇలా, ఆరోగ్యకర దైహిక జీవనానికి నాడీకణ వ్యవస్థ అవసరం ఎంతైనా ఉంది.
‘నేను’లో న్యూనతాభావాన్ని, ఆధిక్యతా భావాన్ని కలిగించేది మనస్సే! ఒక సమస్యను పరిష్కరించుకో గలిగినపుడు మనం గాలిలో తేలిపోతుంటాం. ఇటువంటి సందర్భాల్లో మనస్సు ఆత్మ విశ్వాస ప్రతీక అవుతుంటుంది. ఆత్మ ఆధిక్యతా భావాన్ని తేజరిల్ల చేస్తుంది. సమస్య పరిష్కారం కానప్పుడు, ఎంత చిన్న సమస్య అయినా పెనుభూతంలా భయపెడుతుంది. న్యూనతాభావాన్ని నెలకొల్పుతుంది. అందుకే రెండు కళ్లతో చూస్తున్నా నిర్ధారణకు వచ్చేది ‘మనోనేత్రం’లోనే!
ఇంతకీ ఈ ఫిజికల్ బ్రెయిన్ ఉండేది తలలో.. 8,600 కోట్ల కణ వ్యవస్థగా.. ప్రతీ కణానికి మరో పదివేల కణాలతో అనుబంధం. అందుకే ఇంతటి భారీ వ్యవస్థను ఈనాటి సైన్స్ అంతే భారీగా పరిశోధిస్తోంది. అయినా శాస్ర్తియతకు అందకుండా మైండ్ పరిక్రమిస్తోనే ఉంది. సైన్స్‌కు అందని ఆ పరిక్రమణ తావును స్పిరిట్యుయల్ శోధనకు, సాధనకు అందుతున్నాయి. అదే సూప్రా మైండ్.. దానిది హయ్యర్ ఇంటెలిజెన్స్.
మొత్తానికి మానవ మానసిక పరిణామంలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఉన్న బ్రెయిన్ సైజ్ ఒక యాభై సంవత్సరాల క్రితానికి మూడింతలుగా పెరగటం జ్ఞానం ఇబ్బడిముబ్బడి అయిందనటానికి సంకేతమే. ఈ మూడింతల ప్రస్థానంలో ఆలోచన వేగం పెరిగింది. ఆలోచన సాంద్రత పెరిగింది. ఆలోచన తీక్షత పెరిగింది. విచక్షణా పెరిగింది. విశే్లషణా పెరిగింది. భావ ఉద్విగ్నతా పెరిగింది. ఈ ఎమోషన్స్ కారణంగా దేహంలో ఆరోగ్యమూ, అనారోగ్యమూ భాగస్వాములయ్యాయి. ఒకవైపు జీవితకాలం పెరుగుతున్నా మరోవైపు ఆరోగ్య వ్యవస్థ తరుగుతోంది. రకరకాల జబ్బులు మానవ పరిణామంలో ఆధునికతను సంతరించుకుంటూ ‘సూప్రా స్పెషాలిటీ’గా పరిణమిస్తున్నాయి.
మొత్తానికి, మనో విశే్లషణ ఎంతలా వికసిస్తున్నప్పటికీ మనసు దేహంలో ఎప్పుడు క్రియాశీలంగా ఉంటుందో, ఎప్పుడు నిస్తేజంగా ఉంటుందో చెప్పలేకపోతున్నాం. ఆధ్యాత్మికంగా ‘ఆత్మ’ దేహంలో ఎప్పుడు, ఎలా, ఎందుకు ప్రవేశిస్తుందో చెప్పలేనట్లుగానే శాస్ర్తియంగా ‘మనసు’ దేహాన్ని ఎప్పుడు, ఎందుకు, ఎలా చేరుతుందో, ఎందుకు విడనాడుతుందో చెప్పలేకపోతున్నాం. ఇలా చూసినపుడు అటు ఆత్మ ఇటు మనసు - రెండూ నిరాధారిత వ్యవస్థలే అవుతున్నాయి.
అన్నట్టు, ఈ దేహం మృత్యువులోకి వొదిగినపుడు ‘ఆత్మ’ దేహం నుండి తప్పుకున్నట్లే ‘మనస్సు’ కూడా దేహం నుండి తప్పుకుంటుంది. ఆత్మ చేరినట్లే మనస్సు కూడా ఆవలి తీరాన్ని చేరుకుంటుంది. అంటే, మృత్యువు తర్వాతి క్షేత్రత్వాన్ని చేరుకుంటుంది. ఆ చేరికతో ఆవిష్కృతమయ్యే చైతన్యమే ‘హయ్యర్ ఇంటెలిజెన్స్’ ఆవలి తీర క్షేత్రమే ‘సూప్రామైండ్’. అది మనస్సుకు దక్కిన శాశ్వతత్వం. అది ఇమ్మోర్టల్ మైండ్. దానిది ఇమ్మోర్టల్ ఇంటెలిజెన్స్.
మృత్యువుతో ఆగిపోకుండా మృత్యువు తర్వాతి క్షేత్రంలో మానసిక చైతన్య స్రవంతి తన అస్తిత్వాన్ని కలిగి ఉంటుందన్నది విచారణ కాదు.. అది గిక సాధనావిష్కరణ. ‘నేన’కే సాధ్యమైన ఈ అతీంద్రియ చైతన్యం వర్తమానంలో నెలకొని ఉన్న అన్ని చైతన్య ఆవిష్కరణల కంటే భిన్నమైంది, ప్రత్యేకమైంది. అందుకే, మానవ గిక సాధనతో నిలదొక్కుకుంటన్న చైతన్యం మార్మిక జగత్తులకి పరివ్యాప్తవౌతోంది.
ఇలా విశే్లషించుకుంటున్నప్పుడు - మృత్యువుకు ఆవల అస్తిత్వాన్ని కలిగి ఉండే సూప్రామైండ్ క్షేత్రజ్ఞతను అవలోకించటం, ఆ క్షేత్రజ్ఞతలోకి ప్రస్థానించటం అంతశ్శోధనగా సాగే గిక సాధన ద్వారా సాధ్యవౌతంటే దేహాన్ని కేంద్రంగా చేసుకుని బాడీమైండ్‌ను అవలోకించటం శాస్ర్తియ పరిశోధనగా పరిఢవిల్లుతోంది. ఇలా - పరిశోధనకు భూమిక జ్ఞాన విజ్ఞాన వికాసం అయితే శోధనకు మూలం ప్రజ్ఞాన ప్రస్థానం.